కోయంబత్తూరు నుంచి బయలుదేర వలసిన శతాబ్ది ఎక్స్ప్రెస్లోని ఐదు బోగీలు ఈ రోజు ఉదయం పట్టాలు తప్పాయని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు శనివారం చెన్నైలో వెల్లడించారు.
చెన్నై: కోయంబత్తూరు నుంచి బయలుదేర వలసిన శతాబ్ది ఎక్స్ప్రెస్లోని ఐదు బోగీలు ఈ రోజు ఉదయం పట్టాలు తప్పాయని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు శనివారం చెన్నైలో వెల్లడించారు. యార్డ్ నుంచి రైల్వే ప్లాట్ ఫామ్కు వస్తున్న క్రమంలో బెసిన్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. సహాయక చర్యలు కోనసాగుతున్నాయని తెలిపారు.
ప్రమాద సమయంలో బోగీలో ప్రయాణీకులు ఎవరు లేరని చెప్పారు. అయితే శతాబ్ధి ఎక్స్ప్రెస్ కోయంబత్తూరు నుంచి శనివారం ఉదయం 7.15 గంటలకు కోయింబత్తురు నుంచి బయలుదేర వలసి ఉందన్నారు. కానీ మూడు గంటల ఆలస్యగా అంటే 10.30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు వివరించారు.