Southern Railway
-
2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖ
రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. టికెట్ బుకింగ్(Ticket Booking) సమయంలో అక్రమ సాఫ్ట్వేర్ల వినియోగాన్ని అరికట్టడానికి దక్షిణ రైల్వే 2,000 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ(IRCTC) యూజర్ ఐడీలతోపాటు 119 ఏజెంట్ ఐడీలను బ్లాక్ చేసింది. ప్రయాణీకులందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా బుకింగ్స్ చేస్తున్న మోసగాళ్లు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.సమస్య ఏమిటంటే..పండగ సీజన్లు, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో దళారులు, ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బల్క్‌గా టికెట్లు బుక్ చేస్తున్నట్లు దక్షిణ రైల్వేశాఖ గుర్తించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తరుచూ అరెస్టులు, టికెట్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉందని తెలిపింది. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఐఆర్సీటీసీ పోర్టల్‌పై ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో క్రాష్ అవుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావాలనే కొందరు మోసగాళ్లు అక్రమ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ట్రాఫిక్‌ను క్రియేట్ చేస్తూ తత్కాల్ పోర్టల్ సరిగా పనిచేయకుండా చేస్తున్నారు. దాంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండడంలేదు. దాంతో ఏజెంట్ల నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైల్వేశాఖ తెలిపింది.రైల్వేశాఖ చర్యలుఈ సవాళ్లను పరిష్కరించడానికి దక్షిణ రైల్వే అనేక చర్యలను అమలు చేస్తోంది.119 ఏజెంట్ ఐడీలతో పాటు 2,003 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీలను బ్లాక్ చేశారు.బల్క్, తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఉపయోగించే పది వేర్వేరు అక్రమ సాఫ్ట్వేర్ టూల్స్‌ను నిలిపేశారు.ఒకే ఐపీ అడ్రస్ నుంచి లేదా వీపీఎన్ల ద్వారా ఎక్కువ బుకింగ్‌లు చేసే వారిని, రియల్ టైమ్‌లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నారు.యూజర్ ఐడీలపై రోజువారీ తనిఖీలు నిర్వహిస్తూ అవకతవకలకు పాల్పడిన వారిని డీయాక్టివేట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలుప్రయాణికులపై ప్రభావం..రైల్వేశాఖ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణీకులకు మరిన్ని టికెట్లు అందుబాటులో ఉండేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు అనుకున్న ధరలకే టికెట్ లభ్యమవుతుందని, దళారులు, ఏజెంట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. దక్షిణ రైల్వే గత ఏడాది 391 కేసులు నమోదు చేయగా, 404 మంది దళారులను అరెస్టు చేయడంతో పాటు రూ.1.2 కోట్ల విలువైన 7,506 టికెట్లను స్వాధీనం చేసుకుంది. -
గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదరణ లభిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు చెక్‌పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్ కూడా సరికొత్తగా ప్రయాణికులకు ఈ-బైక్ రెంటల్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్ సర్వీసులను పొందవచ్చును. ఈ-బైక్ రెంటల్ సర్వీస్ ఎక్కడంటే..! తమిళనాడులోని తిరుచ్చి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంటల్ సేవలను దక్షిణ రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ బైక్ సర్వీసులపై భారీ స్పందన వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ-బైక్ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ-బైక్ సేవలను పొందాలంటే ముందుగా రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత గంటకు రూ.50 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.వాటితోపాటుగా ఆయా వ్యక్తి తన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పత్రాలు ఇస్తే ఈ బైక్ సేవలను పొందవచ్చును. తిరుచ్చి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ఈ-బైక్ రెంటల్ సర్వీసులపై భారీ ఆదరణ వస్తోనట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్స్ రెంటల్ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చును. చదవండి: ఐఫోన్, ఐప్యాడ్, ఇప్పుడు ఐకార్..యాపిల్ నుంచి ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే.. -
సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్‌కు చెందిన చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ కార్యాలయం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 3378 ► పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, చెన్నై డివిజన్. ► విభాగాలు: ఫ్రెషర్ కేటగిరీ, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ. ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 15 ఏళ్లు నిండి ఉండాలి. 22/24 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021 ► వెబ్సైట్: https://sr.indianrailways.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు -
ఆగిన కూత
♦ రైల్వే పథకాలకు బ్రేక్ ♦ 13 మార్గాల పనులు నిలుపుదల ♦ ఒప్పందాలకు తమిళ సర్కారు దూరం ♦ ఆ మార్గాల్లో ఆదాయం శూన్యం అన్న రైల్వే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైల్వే పథకాలు అనేకం ఆగే పరిస్థితికి వచ్చాయి. ప్రధానంగా 13 రైల్వే మార్గాల పనుల్ని నిలుపుదల చేయడానికి రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఆ మార్గాల్లో ఆదాయం శూన్యమే అన్న విషయాన్ని పరిగణించడంతో పాటు, పనులకు తగ్గ ఒప్పందాల విషయంలో తమిళ ప్రభుత్వ సహకారం కొరవడంతో బ్రేక్ వేయడానికి రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. సాక్షి, చెన్నై : ఆదాయం లేదనే కారణంతో గత ఐదారేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పలు పథకాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లనున్నాయి. దక్షిణ రైల్వేకి ఆదాయం మెండుగా ఉన్నా, అందుకు తగ్గ కొత్త పథకాల మీద కేంద్రం సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఏటా బడ్జెట్లో మమా.. అనిపించే విధంగా రైళ్లు, కొత్త మార్గాల పనుల్ని ప్రకటిస్తూ వస్తోంది. అయితే, అవి అమల్లోకి వచ్చేదెన్నడో అన్న ప్రశ్న బయలుదేరక మానదు. ఇందుకు కారణం నిధుల కేటాయింపులు నామమాత్రంగానే ఉండడం. ఏడాదికి ఒకటి రెండు చొప్పున పథకాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా, కేంద్ర రైల్వే యంత్రాంగంతో కలిసి ముందుకు సాగడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోంది. గత ఐదారేళ్లలో రాష్ట్రానికి వచ్చిన 13 పథకాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లనున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వ సహకారం కొరవడడమే. అలాగే, ఆ మార్గాల్లో పనులు చేపట్టినా, రైళ్లు నడిపినా ఆదాయం శూన్యమే అన్న విషయాన్ని కేంద్ర రైల్వేయంత్రాంగం తేల్చి ఉండడం గమనించాల్సిన విషయం. రూ.9500 కోట్ల పథకాలకు బ్రేక్ 2011లో అన్నాడీఎంకే సర్కారు రాష్ట్రంలో అధికార పగ్గాల్ని చేపట్టింది. రెండోసారిగా ఆ పాలన ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఐదారేళ్ల కాలంలో ఏడాదికి ఒకటి రెండు చొప్పున పథకాలను బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయించింది. చెన్నై, కాంచీపురం, మదురై, తంజావూరు, కారైక్కుడి , దిండుగల్, పుదుకోట్టై వైపుగా కొత్త రైల్వే మార్గాలను ప్రకటించారు. ఇందుకు తగ్గ ప్రారంభ పనుల మీద అధికార వర్గాలు దృష్టి పెట్టి, అంచనా వ్యయాన్ని రూపొందించాయి. ఆ మేరకు రూ.915 కోట్లతో సైదా పేట నుంచి శ్రీ పెరంబదూరు మీదుగా, రూ.1810 కోట్లతో తిరువణ్ణామలై నుంచి కాంచీపురం మీదుగా కాట్పాడికి, రూ.650 కోట్లతో మేలూరు నుంచి కారైక్కుడి వైపుగా, నైజ 1314 కోట్లతో కారైక్కుడి–దిండుగల్, రూ.1009 కోట్లతో కుంబకోణం–విరుదాచలం వైపుగా కొత్త మార్గాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. అదే సమయంలో ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టిన పక్షంలో ఆదాయం ఏమేరకు ఉంటుందో అనే పరిశీలనను సైతం కేంద్రం రైల్వే యంత్రాంగం సాగించింది. ఆదాయం అంతంత మాత్రమే అనేది తొలుత తేలినా, తదుపరి పరిశీలనలో శూన్యమేనన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పనులకు తగ్గ ఒప్పందాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైల్వే యంత్రాంగం తమ జాగ్రత్తల్లో పడింది. స్థల సేకరణ, తమిళనాడు సగం వాటా నిధులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, ఇక్కడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేని దృష్ట్యా, ఆ పథకాల్ని నిలుపుదల చేయడానికి రైల్వేవర్గాలు సిద్ధం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ సహకారం లేనందున పనుల్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని, మరోవైపు ఆ మార్గాల్లో రైల్వేకు ఆదాయం శూన్యమేని తేలడంతో పథకాలకు బ్రేక్ వేస్తూ కేంద్ర రైల్వే యంత్రాంగానికి నివేదిక పంపినట్టు ఇక్కడి రైల్వే వర్గాలు పేర్కొనడం గమనార్హం. కొన్ని రైల్వే మార్గాల ద్వారా ఆదాయం మెండుగా ఉన్నా, మరికొన్ని మార్గాల్లో నష్టం తప్పడం లేదని అధికారులు వివరించారు. 14 శాతం ఆదాయం ఉన్న పక్షంలో కొత్త మార్గాల్ని చేపట్టేందుకు వీలుందని, లేనిపక్షంలో నష్టం తప్పదంటున్నారు. ఇటీవల తిరువనంతపురం–కన్యాకుమారి మధ్య సిద్ధం చేసిన రైల్వేమార్గం ద్వారా ఆదాయం 2 శాతం మేరకే ఉందనే విషయాన్ని పరిగణించాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో రూ.9,500 కోట్లతో కూడిన 13 పథకాలు తమిళనాడులో ఆగినట్టేనని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. -
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దుచేయడంతో కొన్ని రైళ్లను చెన్నై మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు అధికారికంగా వెల్లడించారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా 55 మంది మృతిచెందిన విషయం అందరికి విదితమే. రాజధాని చెన్నై నగరంలో పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించారు. వర్షాల కారణంగా ఈ ఆదివారం నుంచి పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రద్దయిన కొన్ని రైళ్లు: చెన్నై సెంట్రల్- విజయవాడ జన శతాబ్ది ట్రైన్ నెంబర్. 12077, చెన్నై నుంచి తిరుగుప్రయాణం కావలసిన ట్రైన్ 12078, బెంగళూరు-చెన్నై సెంట్రల్ ట్రైన్ నెంబర్. 12640 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. పట్నా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, గువహతి-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను చెన్నై సెంట్రల్ మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా దారి మళ్లిస్తున్నారు. -
పట్టాలు తప్పిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
చెన్నై: కోయంబత్తూరు నుంచి బయలుదేర వలసిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు ఈ రోజు ఉదయం పట్టాలు తప్పాయని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు శనివారం చెన్నైలో వెల్లడించారు. యార్డ్ నుంచి రైల్వే ప్లాట్ ఫామ్‌కు వస్తున్న క్రమంలో బెసిన్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. సహాయక చర్యలు కోనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బోగీలో ప్రయాణీకులు ఎవరు లేరని చెప్పారు. అయితే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు నుంచి శనివారం ఉదయం 7.15 గంటలకు కోయింబత్తురు నుంచి బయలుదేర వలసి ఉందన్నారు. కానీ మూడు గంటల ఆలస్యగా అంటే 10.30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు వివరించారు. -
మేలో తొలి పనిదినం ఇక ‘స్వాతి డే’
ఏటా పాటించనున్న దక్షిణ రైల్వే చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మరణించిన తెలుగమ్మాయికి అరుదైన గౌరవం చెన్నై(తమిళనాడు): చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన గుంటూరు అమ్మాయి పరుచూరి స్వాతికి దక్షిణ రైల్వే అరుదైన గౌరవం కల్పించింది. స్వాతి స్మారకార్థం ఇకపై ఏటా మే నెలలో తొలి పనిదినాన్ని ‘స్వాతి డే’గా పాటించనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు పునరంకితం అవుతూ ఈ మేరకు స్వాతి డేను నిర్వహిస్తామని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. సోమవారం చెన్నైలో జరిగిన స్వాతి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ రైల్వే పరిధిలో స్వాతి డేను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతి డే సందర్భంగా తాము ప్రయాణికుల భద్రత కోసం పునరంకితం అవుతామని, భద్రతా సన్నద్ధతను సమీక్షించుకుంటామన్నారు. చెన్నై సెంట్రల్ స్టేషన్లో మే 1న బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్లో జరిగిన పేలుళ్లలో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న స్వాతి (24) చనిపోగా, 14 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
విభజనతో లాభాల్లో ఉన్న దక్షిణ మధ్యరైల్వే...
-
శబరిమలైకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్:శబరిమలై భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్ల నుంచి కొల్లాం వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25 నుంచి ఉదయం 8 గంటలకు శబరిమలై ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది. కాకినాడ-కొల్లాం (07211/07212) మధ్య 38 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు డిసెంబర్ 12, 13, 15, 16, 18, 19, 21, 22 జనవరి 1 ,2 ,4 ,5, 7, 8, 10 ,11 ,13, 14, 15 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14, 15, 17, 18, 20, 21, 23, 24 జనవరి 3, 4, 6, 7, 9, 10, 12, 13, 15, 16, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుకుంటాయి. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో ఆగుతాయి. నర్సాపూర్-కొల్లాం (07217/07218) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 1,2 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటాయి. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరంటౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, తరిగొప్పుల, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతాయి. విజయవాడ-కొల్లాం (07219/07220) మధ్య 4 సర్వీసులు నడుస్తాయి. జనవరి 3,9 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జనవరి 5, 11 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి. విజయవాడ-కొల్లాం (07213/07214) మధ్య గుంటూరు, తిరుపతి మీదుగా 6 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 7, 11, 18 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9, 13, 20 తేదీల్లో ఉదయం 5.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. -
రైల్వేలను తాకిన సమైక్యాంధ్ర ఉద్యమ సెగ