పట్టాలు తప్పిన మరో రైలు
భువనేశ్వర్: ఒడిశాలో సరుకు రవాణా చేసే ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. రైల్వే అధికారుల సమాచారం మేరకు కటక్ జిల్లాలోని మార్థాపూర్ వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
దీంతో నారజ్ డెంకానల్ మార్గం మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భువనేశ్వర్-బోలంగిర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, శంబల్ పూర్- పూరి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, అంగుల్-పూరి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించారు. దాదాపు ఐదు గంటల ఆలస్యం అనంతరం తిరిగి సాధారణ సర్వీసులు ఈ మార్గంలో ప్రారంభించారు.