
లక్నో: స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలెట్లు గుర్తించడంతో కేవలం రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదమేమి సంభవించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.
రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి బిహార్‌లోని జయనగర్‌కు 4674 షహీద్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో లక్నో సమీపంలోని చర్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అయితే పట్టాలు తప్పిన బోగీల్లో ప్రయాణికులు ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. వెంటనే ఆ ఆ బోగీలలోని ప్రయాణికులను దింపేసి ఇతర బోగీల్లో ఎక్కించి రైలు ప్రయాణం పునరుద్ధరించారు.

