వరంగల్(ఖాజీపేట): ఖాజీపేట జంక్షన్‌లో గురువారం బిస్కెట్ల రూపంలో ఉన్న 14 కిలోల 700 గ్రాముల బంగారాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ)లు పట్టుకున్నారు. స్టేషన్‌లో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని బజ్జూరి బులియన్ దుకాణానికి చెందిన గుమస్తాలు పట్టూరి వీరేశం, ఉపేందర్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ దిగి బయటికి వెళ్తున్నారు. రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా... బ్యాగుల్లో ప్యాకింగ్‌లో ఉన్న రూ.4 కోట్ల విలువ చేసే 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
ఈ బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బజ్దూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చాలన్‌లో ఉందని, కానీ కాజీపేటలో పటుకున్న బంగారం 14.700 కిలోలు మాత్రమే ఉందన్నారు. పట్టుబడిన బంగారం, కాగితాలలో తేడా ఉండడంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి బంగారంను సీజ్ చేసి పంచనామా చేసి కమర్షియల్ టాక్స్, ఐటీ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు.
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 14 కిలోల బంగారం పట్టివేత
Published Thu, Apr 16 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement