intercity express
-
ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది. మరిన్ని వందే మెట్రో రైళ్లను కూడా త్వరలో ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది. వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం. ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. -
రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు
వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారుజార్ఖండ్లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకు..
సాక్షి, హైదరాబాద్: విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు విజయవాడ–లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (నం.12795) సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55కి బయలుదేరి 11.04కి బేగంపేట చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది. సోమవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అలాగే లింగంపల్లి–విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12796) మంగళవారం (14న) నుంచి లింగంపల్లిలో ఉదయం 4.40కి బయలుదేరుతుంది. 4.58కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్ చేరుతుంది. అక్కడ నుంచి 5.30కి బయలుదేరి 10.45కి విజయవాడకు చేరుకుంటుంది. ఇంటర్సిటీ ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్–విజయవాడ ఇంటర్సిటీ ప్రత్యేక రైళ్లను ఈ నెల 19 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి ఆదివారం లింగంపల్లి వరకు నడపనున్నారు. లింగంపల్లి–విజయవాడ ఇంటర్ సిటీ ప్రత్యేక రైలు (నం.07757) ప్రతి ఆదివారం ఉదయం 4.40కి లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. 4.58 గంటలకు బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్ చేరుతుంది. అక్కడ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, మంగళగిరి మీదుగా 10.45కి విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ–లింగంపల్లి ఇంటర్సిటీ ప్రత్యేక రైలు (నం.07758) ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. అక్కడ నుంచి మంగళగిరి, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా 10.50కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 11.04కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది. -
మారిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వేళలు
హైదరాబాద్ : సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12796) వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మారిన వేళల ప్రకారం ఈ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ తరువాత గుంటూరు నుంచి బయలుదేరి ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ లో మంటలు
సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానించి బీబీ నగర్ సమీపంలో రైలును నిలిపివేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తతల అనంతరం రైలులోని సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
నిజామాబాద్: కాచిగూడ నుంచి అకోలకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయూణికులు భయూందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు రైలు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బోగీల చక్రాల వద్ద నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో ప్రయూణికులు కంగారుపడ్డారు. వెంటనే రైల్వే సాంకేతిక విభాగం అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ బైండింగ్ వల్లనే పొగలు వచ్చినట్టు వారు చెప్పారు. ఈ కారణంగా నిజామాబాద్‌లోనే రైలు దాదాపు 45 నిమిషాలు నిలిచిపోయిందని స్టేషన్ మాస్టర్ టి.ప్రభుచరణ్ తెలిపారు. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 14 కిలోల బంగారం పట్టివేత
వరంగల్(ఖాజీపేట): ఖాజీపేట జంక్షన్లో గురువారం బిస్కెట్ల రూపంలో ఉన్న 14 కిలోల 700 గ్రాముల బంగారాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లు పట్టుకున్నారు. స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని బజ్జూరి బులియన్ దుకాణానికి చెందిన గుమస్తాలు పట్టూరి వీరేశం, ఉపేందర్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ దిగి బయటికి వెళ్తున్నారు. రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా... బ్యాగుల్లో ప్యాకింగ్‌లో ఉన్న రూ.4 కోట్ల విలువ చేసే 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బజ్దూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చాలన్‌లో ఉందని, కానీ కాజీపేటలో పటుకున్న బంగారం 14.700 కిలోలు మాత్రమే ఉందన్నారు. పట్టుబడిన బంగారం, కాగితాలలో తేడా ఉండడంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి బంగారంను సీజ్ చేసి పంచనామా చేసి కమర్షియల్ టాక్స్, ఐటీ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. -
పట్టాలు తప్పిన బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ చిత్రాలు
-
రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైలు ఎక్కుతూ జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా నుజ్జు నుజ్జయింది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం అదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం ఆసిఫాబాద్ స్టేషన్లో జరిగింది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నించిన ప్రయాణికుడు ప్రమాదవశాత్తు దానికింద పడి మరణించాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. -
అసోం రైల్లో దొరికిన బాంబు
గువాహటి: అసోంలోని గువాహటికి సమీపంలోని ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో శక్తివంతమైన బాంబును పోలీసులు గుర్తించారు. కెందుకొండ రైల్వేస్టేషన్ లో రైలు ఆగినప్పుడు భద్రతా సిబ్బంది బాంబు కనుగొన్నారు. ప్లాస్టిక్ కవర్ లో టవల్ లో చుట్టి వైర్లు అతికించివున్న బాంబును గుర్తించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆరు కేజీలున్న బాంబును నిపుణుల బృందం నిర్వీర్యం చేసిందని తెలిపారు. దీబ్రుఘర్ లో ఆదివారం సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 25 మందిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైల్లో బాంబు దొరకడం తీవ్రకలకలం రేపింది. బాంబు పేలకముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.