సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానించి బీబీ నగర్ సమీపంలో రైలును నిలిపివేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తతల అనంతరం రైలులోని సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.