ఈసారైనా.. | As the gateway to the Kazipet junction | Sakshi
Sakshi News home page

ఈసారైనా..

Published Tue, Jan 31 2017 10:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

ఈసారైనా..

ఈసారైనా..

జిల్లా వాసుల ఆశలు పట్టాలెక్కేనా..

కాజీపేట రూరల్‌ : ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు ఈ సారి రైల్వే బడ్జెట్‌లో న్యాయం జరగాలని ఈ ప్రాంత ప్రజలు, రైల్వే కార్మికులు ఆశిస్తున్నారు. కాజీపేట జంక్షన్‌లో మూడు ఫ్లాట్‌ఫాంలు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో మూడు ప్లాట్‌ఫాంలు కావాలనే డిమాండ్‌ ఉంది. ఈ బడ్జెట్‌లో అదనపు ప్లాట్‌ఫాంలు మంజూరైతే   రైళ్ల సంఖ్య ఇక్కడి నుంచి పెరగడమే కాకుండా వచ్చిన రైళ్లకు ట్రాఫిక్‌ అంతరాయం ఉండదు. అదేవిధంగా సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట జంక్షన్‌ మీదుగా వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ వారానికి రెండు రోజులు ఉండదు. జిల్లా నుంచి తిరుమలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజుల పాటు పొడిగించితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

ఎస్కలేటర్‌ ఎప్పుడో..
ఈ జంక్షన్‌ నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేటలో  చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు పుట్‌ఓవర్‌ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి. ఇక్కడ ఎస్కలేటర్‌ నిర్మాణం జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్‌ లోకోషెడ్, ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ల సామర్థ్యం నిర్వాహణ మరింత పెరిగేందుకు బడ్జెట్‌లో నిధులు మంజూరు కావాలని కార్మికులు కోరుతున్నారు.

అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అయ్యేనా..
 కాజీపేటలో ఆక్ట్‌ అప్రంటీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గత పదేళ్ల నుంచి డిమాండ్‌ ఉంది. కాజీపేటలో ఎక్కువ శాతం రైల్వే కార్మికుల పిల్లలు ఐటీఐ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ అప్రంటీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

కాజీపేట–బెల్లంపల్లికి పుష్‌పుల్‌ వచ్చేనా..
కాజీపేట నుంచి బెల్లంపల్లి వరకు పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాట్నా ఎక్స్‌ప్రెస్‌ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు భాగ్యనగర్‌ వరకు ఒక్క రైలు లేదు. ఈ మధ్యకాలంలో పుష్‌పుల్‌ వేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌కు చోటు దొరికేనా..
 కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌ను 2006లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ స్టేషన్‌ నుంచి ఒక్కటే ప్యాసింజర్‌ రాకపోకలు చేస్తుంది. ఈ టౌన్‌ స్టేషన్‌ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్‌ మార్గంలో వందల రైళ్లు రాకపపోకలు సాగిస్తాయి. ఇక్కడ కొన్ని రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని, స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పలు రైళ్లకు హాల్టింగ్‌ లభించేనా..
 కాజీపేటలో ఆగకుండా వెళ్తున్న సికింద్రాబాద్‌–కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–విశాఖ వెళ్లే దురంతో, సికింద్రాబాద్‌–విశాఖపట్నం వెళ్లే గరీభ్‌రథ్, సికింద్రాబాద్‌–గౌహతి వెళ్లే గౌహతి, సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్‌ కల్పించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement