కదులుతున్న రైల్లోంచి ఓ ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ కిందకు తోసేయడంతో.. ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. రైలుపట్టాల పక్కన పడిన ఆమె, అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దాంతో ఆ టికెట్ కలెక్టర్పై కేసు నమోదు చేశారు. టికెట్ కలెక్టర్ ఆ సమయంలో బాగా తాగి ఉన్నాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
జనతా ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ఆ మహిళ, అందులో రద్దీగా ఉండటంతో ఏసీ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. రైలు ఎక్కేందుకు ఆమె ప్రయత్నిస్తున్న సమయంలోనే టికెట్ కలెక్టర్ ఆమెను తోసేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
రైల్లోంచి తోసేసిన టీసీ.. మహిళ మృతి
Published Thu, May 29 2014 2:28 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement