రైల్లో నుంచి మహిళను గెంటేసిన టీసీ | the woman thrown away on the train by TC | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి మహిళను గెంటేసిన టీసీ

May 30 2014 1:35 AM | Updated on Sep 2 2017 8:02 AM

కదులుతున్న బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ నిర్దాక్షిణ్యంగా గెంటేయటంతో రైలు పట్టాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.

 జల్‌గావ్: కదులుతున్న బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ నిర్దాక్షిణ్యంగా గెంటేయటంతో రైలు పట్టాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. టీసీ మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. గురువారం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. లోక్‌మాన్య తిలక్ టెర్మినస్-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఉజ్వలా పాండే(38) ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. పదేళ్ల కుమార్తె కూడా ఆమె వెంట ఉంది.
 
ఆమె వద్ద జనరల్ టిక్కెట్ ఉండటంతో టీసీ సంపత్ సాలూఖే అడ్డుకున్నాడు. రైలు వేగం పుంజుకుని కదలటంతో ఆందోళన చెందిన ఆమె మరోసారి ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. అయితే టీసీ ఆమెను తోసివేయటంతో కదులుతున్న రైలు కింద పట్టాలపై పడిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చిన మేనల్లుడు దీన్ని చూసి అప్రమత్తం చేయటంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు రైలు బోగీలోని వంటగదిలో నక్కిన టీసీని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. టీసీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement