Women Travelers
-
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ఆపరేషన్ ‘కాళి’
మెట్రో రైళ్లలో త్వరలో సీఐఎస్ఎఎఫ్ మహిళా సిబ్బంది సాక్షి, న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం (సీఐఎస్ఎఫ్) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా మహిళా సిబ్బందిని నియమించనుంది. ఆపరేషన్ కాళీ పేరిట ఈ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ కింద మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బందిని మెట్రో రైళ్లలో మోహరించనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకుండా నివారించడం కోసం సుశిక్షితులైన మహిళలను ఈ బోగీల్లో నియమిస్తారు. ఇందుకోసం సీఐఎస్ఎఫ్ రెండు బ్యాచ్‌ల సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బందికి ‘పెకిటి తిర్సియా కాళీ’ అనే ఫిలిప్పీన్స్ యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం వారంపాటు జరిగింది. ఈ నెల 29వ తేదీనుంచి మూడో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి రోజూ పురుషులు భారీ సంఖ్యలో ఈ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ 25 నుంచి 50 మంది పురుష ప్రయాణికులకు సంబంధిత మెట్రో స్టేషన్ల సేషన్ కంట్రోలర్లు రూ.250 చొప్పున జరిమానా విధిస్తున్నారు. అయినప్పటికీ మహిళా కోచ్‌లలోకి ఎక్కి దిగమంటూ మొండికేసే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది అటువంటి ప్రయాణికులను బలవంతగా మెట్రో రైలునుంచి దింపడమేకాకుండా వారిని మెటో రైలు పోలీసులకు అప్పగిస్తారు. అంతేకాక ఈ మహిళలు ఈవ్ టీజింగ్ వంటి ఘటనలలోనూ మహిళా ప్రయాణికులకు అండగా నిలుస్తారు. -
రైల్లో నుంచి మహిళను గెంటేసిన టీసీ
జల్గావ్: కదులుతున్న బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ప్రయాణికురాలిని టికెట్ కలెక్టర్ నిర్దాక్షిణ్యంగా గెంటేయటంతో రైలు పట్టాల కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. టీసీ మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. గురువారం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. లోక్మాన్య తిలక్ టెర్మినస్-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఉజ్వలా పాండే(38) ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. పదేళ్ల కుమార్తె కూడా ఆమె వెంట ఉంది. ఆమె వద్ద జనరల్ టిక్కెట్ ఉండటంతో టీసీ సంపత్ సాలూఖే అడ్డుకున్నాడు. రైలు వేగం పుంజుకుని కదలటంతో ఆందోళన చెందిన ఆమె మరోసారి ఏసీ బోగీలోకి ఎక్కేందుకు యత్నించింది. అయితే టీసీ ఆమెను తోసివేయటంతో కదులుతున్న రైలు కింద పట్టాలపై పడిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చిన మేనల్లుడు దీన్ని చూసి అప్రమత్తం చేయటంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు రైలు బోగీలోని వంటగదిలో నక్కిన టీసీని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. టీసీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.