'జన్మభూమి'లో టీసీ వీరంగం | ticket collector ganga prasad hulchul in janmabhoomi express train | Sakshi
Sakshi News home page

'జన్మభూమి'లో టీసీ వీరంగం

Published Mon, Aug 8 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ticket collector ganga prasad hulchul in janmabhoomi express train

రాజమహేంద్రవరం : విధుల్లో ఉన్న ఓ రైల్వే టీసీ (టికెట్ కలెక్టర్) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అకారణంగా ప్రయాణికులతో దుర్భాషలాడుతూ వారిపై దాడికి దిగాడు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న టీసీ గంగాప్రసాద్ సోమవారం మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు.

ప్రయాణికులతో దుర్భాషలాడటంతో పాటు అకారణంగా కొందరు ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రాజమహేంద్రవరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గంగా ప్రసాద్ను రైల్వే ఇన్‌స్పెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement