కదులుతున్న రైలులో దారుణం.. వంటగదిలో సీటు ఉందని నమ్మించి.. | Delhi Girl Molested In Running Train At Bhopal FIR registered | Sakshi
Sakshi News home page

కదులుతున్న రైలులో దారుణం.. వంటగదిలో సీటు ఉందని నమ్మించి.. నిద్రిస్తున్న సమయంలో

Published Sat, Feb 12 2022 4:06 PM | Last Updated on Sat, Feb 12 2022 5:22 PM

Delhi Girl Molested In Running Train At Bhopal FIR registered - Sakshi

ఓ యువతి రైలు ఎక్కింది. అయితే, సదరు యువతికి సీటు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి వంట చేసే గదిలో ఖాళీ స్థలం ఉందని నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలిని అతడు అక్కడికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె నిద్రిస్తున్న సమయంలో..

భోపాల్ : ఇటీవలి కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలు, బాలికలు అనే బేధం లేకుండా కొందరు మృగాళ్లు వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోనే ఓ వ్యక్తి యువతి (21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

వివరాల ప్రకారం.. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు యశ‍్వంత్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ‍్తుండగా ఓ యువతి రైలు ఎక్కింది. అయితే, సదరు యువతికి సీటు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి వంట చేసే గదిలో ఖాళీ స్థలం ఉందని నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలిని అతడు అక్కడికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
(చదవండి: యూపీ పీఠానికి అదే దారి?)

ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో హుటాహుటిన వారు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వంట చేసే బోగీ డోర్ తెరచి చూడగా బాధితురాలు అపస్మాకర స్థితిలో పడి ఉంది. దీంతో వారు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 15 మంది చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
(చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement