
బ్యాంకాక్‌లో 8.5 కేజీల బరువున్న ఓ పిల్లి పొరపాటున ఆరో అంతస్తు నుండి కిందికి దూకింది. అంతెత్తు నుండి పడిపోయినా కూడా ఆ పిల్లికి చిన్న గాయమైనా కాలేదు. ఇది చూసి ఆ యజమానే కాదు డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు. అయితే ఈ పిల్లి నేరుగా పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్ మీద పడటంతో దాని బరువుకు కారు వెనుక అద్దం మాత్రం పగిలింది.
మృత్యుంజయురాలు...
బ్యాంకాక్ కు చెందిన అపివాత్ టొయోతక అనే మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి షిఫుని ఇంట్లో వదిలి బయటకు వెళ్ళింది. వెళ్లేముందు కిటికీ తలుపు వేయడం మరిచిపోయింది. ఇంకేముంది షిఫు స్వేచ్ఛగా బయటకు వెళ్లి షికారు చేయాలనుకుందో ఏమో.. కిటికీలోనుంచి అమాంతం దూకేసింది. అదృష్టవశాత్తు షిఫు కింద పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు అద్దం మీద పడటంతో అద్దాన్ని పగలగొట్టుకుని కార్ సీటు మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.
కారు అద్దానికి ఎలాగూ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక షిఫుని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడక్కడా కారు అద్దం గీసుకున్న గాయాలు తప్ప దాని ఒంటి మీద వేరే గాయాలు లేకపోవడం చూసి షాకయ్యాడు. మృత్యుంజయురాలైన షిఫు చేసిన ఈ స్టంటును టొయోతక తన ట్విట్టర్లో పోస్ట్ చేసి గొప్పగా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment