‘లోకల్‌’లో బురఖా వ్యక్తి కలకలం | Man In Burqa Caught Travelling In Mumbai Local | Sakshi
Sakshi News home page

‘లోకల్‌’లో బురఖా వ్యక్తి కలకలం

Feb 8 2026 1:34 PM | Updated on Feb 8 2026 1:38 PM

Man In Burqa Caught Travelling In Mumbai Local

ముంబై: ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో గల ఘాట్‌కోపర్ స్టేషన్ సమీపంలో  కలకలం చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఒక పురుషుడు ముంబై లోకల్ ట్రైన్‌లోని మహిళల బోగీలోకి ప్రవేశించాడు. రద్దీగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి చొరబడటంతో అక్కడి మహిళా ప్రయాణికులు  భయాందోళనకు గురయ్యారు.
 

తొలుత మహిళా ప్రయాణికులు అతనిని గమనించలేదు.  తరువాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అప్రమత్తమై, అతనిని నిలదీశారు.  దీనిని అక్కడున్న వారు తమ ఫోన్‌లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రైలులోని మహిళా ప్రయాణికులు ఆ వ్యక్తిపై రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే రైలు ఆగగానే ఆ వ్యక్తి  అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై ఘాట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని గుర్తించేందుకు  రైలులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement