solar city
-
మోడల్ సోలార్ సిటీగా అయోధ్య: ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. అలాగే ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ అండ్ ఎగ్జిబిషన్’ (రీ-ఇన్వెస్ట్ 2024) నాలుగో ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించామన్నారు. యూపీలోని అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, పనితీరు అన్నీ ప్రత్యేకమైనవేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘ఇండియన్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్’ అని అంటున్నానని, దీనిని ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుందన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచిందని, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన విధానం, గ్రీన్ హైడ్రోజన్ విధానం హరిత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గుజరాత్లో పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం 50 వేల మెగావాట్లను దాటింది. సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
సోలార్ సైకిల్ ట్రాక్ అదరహో
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ పర్యావరణవేత్త, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్ ఆదివారం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని సైకిల్ ట్రాక్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ నేతృత్వంలో అద్భుతమైన సోలార్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ట్రాక్‌పైన కొద్ది సేపు సైకిల్ తొక్కారు. దక్షిణ కొరియాలోని సైకిల్ ట్రాక్ తరహాలో ఇక్కడ ఏర్పాటు కావడం సంతోషమని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు రెండు విభాగాలుగా మొత్తం 23 కిలోమీటర్ల అధునాత సోలార్ సైకిల్ ట్రాక్‌ను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ ట్రాక్ వద్ద పార్కింగ్ సదుపాయంతో పాటు సైకిళ్లు అద్దెకు లభిస్తాయి. అలాగే కెఫెటేరియా వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. -
గుజరాత్ : దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్ విలేజ్ గా మొధేరా
-
పెద్దపల్లి: రామగుండంలో నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్ట్
-
ఎలన్ మస్క్ నెత్తిన పిడుగు.. 70వేల కోట్ల ఫైన్!
Elon Musk Solarcity Lawsuit: టెక్ మేధావి ఎలన్ మస్క్‌కి భారీ షాక్ తగలనుందా?. అదీ సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే!. అవుననే అంటున్నాయి కొన్ని మీడియా కథనాలు. సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్.. అందులో మేజర్ షేర్ హోల్డర్ కూడా. ఈ క్రమంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. తాజాగా ఓ ఇన్వెస్టర్ ఆయన మీద కోర్టుకు ఎక్కగా.. ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల భారీ జరిమానా మస్క్ చెల్లించాల్సి వస్తుందట!. బ్లూమరాంగ్ కథనం ప్రకారం.. సోలార్సిటీకి సంబంధించిన ఇన్వెస్టర్ ఒకరు మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండానే ఎలన్ మస్క్ సుమారు 2.6 బిలియన్ డాలర్ల డీల్ ఒకటి కుదుర్చుకున్నాడనేది ఇన్వెస్టర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గిస్తూ.. లాభాలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని, తన వరకు తనకు సంబంధించిన వాటా కోసం కోర్టును ఆశ్రయించినట్లు సదరు షేర్‌హోల్డర్ పేర్కొన్నాడు. ఇక ఈ దావాకు మిగతా షేర్ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించడం విశేషం. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మస్క్ 9.4 బిలియన్ డాలర్ల జరిమానా(మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) చెల్లించాల్సి వస్తుందని బ్లూమరాంగ్ పేర్కొంది. ఇంతకుముందు కూడా.. గతంలో సోలార్ సిటీలో మస్క్ స్టాక్ షేర్ 2.4 మిలియన్గా ఉండేది. అయితే స్టాక్స్ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్‌కు చేరుకుంది. దీంతో మస్క్ షేర్ విలువ 9.56 బిలియన్ డాలర్లగా ఉంది. ఇక టెస్లా సీఈవో హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. ఇటు సోలార్ సిటీ స్టాక్ హోల్డర్స్‌ను ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 2017లో టెస్లా షేర్ హోల్డర్స్ అంతా కలిసి మస్క్ మీద దావా కూడా వేశారు. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం, అధిక వాటాను లాగేసుకోవడం, సమర్థవంతులను పక్కకు తోసేయడం లాంటివి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మస్క్‌పై. అయితే మస్క్ సంపాదన తప్పుడు దోవలో లేదని, 85 శాతం షేర్ హోల్డర్స్ ఈ ఆర్జనను ఆమోదిస్తున్నారని మస్క్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. చదవండి: చైనా బ్యాన్.. మస్క్ షాకింగ్ కామెంట్స్ -
అడ్రస్ లేని సోలార్ సిటీ
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం పట్టణం ఇక సోలార్ సిటీ.. విజయవాడ తరువాత రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నరసాపురంలో అని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసి రెండేళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాథమికంగా ఏ అంశమూ ముందుకు కదల్లేదు. దీంతో పట్టణ వాసులు నిరాశ చెందారు. ఇక ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశంలేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీరప్రాంత అభివృద్ధిపై అంతకాదు ఇంతంటూ చేసిన హడావుడిలో సోలార్‌సిటీ అంశం కూడా తెరమరుగైపోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలో 47 పట్టణాలను సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. మన రాష్ట్రానికి సంబంధించి మొదటిగా విజయవాడను ఎంపిక చేశారు.ఐతే కేంద్ర మంత్రి సీతారామన్ సొంత పట్టణం కావడం, మరోవైపు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ కూడా ఈ ప్రాంతం వారే కావడంతో నరసాపురం పట్టణాన్ని కూడా సోలార్ సిటీగా ఎంపిక చేశారు. ప్రకటనకు రెండేళ్లు కేంద్ర మంత్రి నిర్మిలా సీతారామన్ నరసాపురం పట్టణాన్ని సోలార్ సిటీగా ఎంపిక చేసినట్టు 2016 జనవరి 3న ప్రటించారు. మరుసటి నెల ఫిబ్రవరిలో డీటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం మునిసిపాలిటీకి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటనవచ్చింది. దీంతో వెనువెంటనే పట్టణాన్ని సోలార్‌సిటీగా అభివృద్ధి చేయడానికి కౌన్సిల్ తీర్మానించింది. సీతారామన్ ఆదేశాలతో హుటాహుటిన నాటి నెట్‌క్యాఫ్ ఎండీ (హైదరాబాద్) కమలాకరబాబు వచ్చి, మునిసిపల్ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్రంలో విజయవాడతో పాటుగా నరసాపురం కూడా సోలార్‌సిటీగా రూపాంతరం చెందుతుందని పట్టణ వాసులు సంతోషించారు. ఐతే నేటికీ ఒక పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. నెట్‌క్యాఫ్ వద్దే ఫైల్ పెండింగ్‌లో ఉంది. విజయవాడలో మాత్రం సోలార్‌సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ జాప్యాన్ని సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్పర్సన్లు శ్రద్ధ పెట్టకపోవడం వల్లే అవకాశం చేజారిందనే విమర్శలు ఉన్నాయి. తరువాత పట్టించుకోలేదు సోలార్ సిటీ డీపీఆర్ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. కానీ నిధులు ఫైసా విడుదల కాలేదు. నెట్‌క్యాఫ్ అధికారులతో అనేక సార్లు మాట్లాడాం. రేపు మాపన్నారు. కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించాము వీలు కాలేదు. ఫైల్ నెట్‌క్యాఫ్ వద్దే పెండింగ్‌లో ఉంది. – పి.రత్నమాల, మునిసిపల్ చైర్పర్సన్ -
సోలార్ సిటీలుగా నర్సాపూర్, మహబూబ్‌నగర్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో తెలంగాణలోని నర్సాపూర్ టౌన్, మహబూబ్‌నగర్‌తో పాటు ఏపీలోని విజయవాడ, కాకినాడను సోలార్ సిటీలుగా మార్చాలని నిర్ణయించినట్టు కేంద్ర వెల్లడించింది. ఈ మేరకు ఎంపీలు బుట్టా రేణుక, మాల్యాద్రి శ్రీరామ్ గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని ఎన్పీ కుంట మండలంలో, కడప జిల్లాలోని గాలివీడు మండలంలో స్థలాలు గుర్తించామని, అలాగే 1,000 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు కడప జిల్లాలోని మైలవరం, కర్నూలు జిల్లాలో స్థలాలు గుర్తించామని, అదేవిధంగా 500 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. వీటి ఏర్పాటుకు కేంద్ర సాయంగా రూ. 243 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 2015–16 ఏడాదికిగానూ 402 మిలియన్ యూనిట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికిగానూ సెప్టెంబర్ వరకు 458 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. -
ఢిల్లీ.. ఇక సోలార్ సిటీ!
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో భారీ భవంతులపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి గాను నగరంలో ఇప్పటికే 40 భవంతులను గుర్తించింది. వీటిపై సౌరవిద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన సామగ్రిని ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా ఎన్డీఎంసీ చైర్పర్సన్ జలజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌరవిద్యుత్ ఉత్పత్తి ద్వారా ఢిల్లీని ‘సోలార్ సిటీ’గా మార్చాలని నిర్ణయించామన్నారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఎండీఎంసీకి చెందిన పలు స్కూళ్లు, సబ్స్టేషన్లు, ఎంక్వైరీ కార్యాలయాలు, ఆస్పత్రులను గుర్తించామన్నారు. ఇవే కాక సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఇతర ప్రైవేట్, ప్రభుత్వ భవనాలపై కూడా వీటిని అమర్చనున్నట్లు ఆయన వివరించారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఉండేవిధంగా సోలార్ యూనిట్ల గుర్తింపు, డిజైనింగ్, టెస్టింగ్, ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించేందుకు ఒక ఆపరేటర్‌ను ఎన్డీఎంసీ నియమించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్లను సైతం ఆహ్వానించింది. గత ఫిబ్రవరిలో అధికారులు ఎన్డీఎంసీ పరిపాలనా విభాగపు పరిధిని ‘సోలార్ సిటీ’గా ఎంపిక చేసి ప్రతిపాదనలను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపారు. దానికి ఆ శాఖ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇదిలా ఉండగా, భవంతులపై సోలార్ యూనిట్లను బిగించడం పూర్తయితే దేశంలోనే న్యూఢిల్లీ రెండో ‘సోలార్ సిటీ’గా గుర్తింపు పొందనుంది. దేశంలో మొదటిగా చండీగఢ్‌లో ‘సోలార్‌సిటీ’ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎన్డీఎంసీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ తన మొత్తం విద్యుత్ వాడకంలో కనీసం 5 శాతాన్ని సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుకోనుంది. ఇదిలా ఉండగా, సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎంసీ గ్రిడ్‌కు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) నిర్ణయించిన రేట్ల మేరకు అనుసంధానించాలనేది సంస్థ ప్రణాళిక అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఏడాదిలోగా సోలార్ ప్లాంట్ల ద్వారా 8 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది ఎన్డీఎంసీ లక్ష్యమని శ్రీవాస్తవ తెలిపారు. పస్తుతం నగరంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సౌరవిద్యుత్‌తో కొంతవరకైనా ఉపశమనం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నగర అవసరాలకు వేసవిలో రోజూ 350 ఎంవీఏ, శీతాకాలంలో 150 ఎంవీఏ విద్యుత్ అవసరమవుతోంది. ఇదిలా ఉండగా, ఓఖ్లాలో ఎండీఎంసీ ఏర్పాటుచేసిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ద్వారా సుమారు 16 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 8 వేల గృహాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే.