సిద్దవటం : పెద్దపల్లె పంచాయతీలోని గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్, అత్యాచారం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన టోకించి గోపిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 9వ తరగతి చదువుతున్న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. మాధవరం–1 గ్రామంలోని శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, ఏఎస్‌ఐ చెన్నయ్య పాల్గొన్నారు.