ఫొటో సరదా ఓ భక్తురాలికి చుక్కలు చూపించింది. ఫొటో కోసం ఏనుగు బొమ్మకింద దూరటం ఆమెను ఇబ్బందుల పాలుచేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో! ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది.