న్యూఢిల్లీ: రెండు వేర్వేరు చోట్ల రోగులపై వైద్యులు రేప్‌లకు పాల్పడ్డారు. రాజధాని ఢిల్లీలో లజపత్‌నగర్‌లోని క్లినిక్‌లో రోగిపై అత్యాచారం జరిపిన 55 ఏళ్ల వైద్యుడు అరెస్టయ్యాడు. సుశీల్ ముంజల్ అనే వైద్యుడు ఈ నెల 2న సొంత క్లినిక్‌లో 24 ఏళ్ల యువతిపై లైంగిక దాడిచేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఛాతీ సమస్యతో అక్కడ చికిత్స పొందుతోంది. చెకప్‌కు వచ్చిన సమయంలో డాక్టర్ తన చాంబర్‌లోకి పిలిచి రేప్ చేశాడని యువతి ఆరోపించింది. వైద్య పరీక్షల్లో ఆమెపై రేప్ జరిగినట్లు నిర్ధరణ అయ్యింది.
డెంగీ రోగిపై డాక్టర్ అత్యాచారం
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో భాట్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో వైద్యుడు అత్యాచారం చేశాడని డెంగీకి చికిత్స పొందుతున్న మహిళ ఆరోపించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 2 మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్ రేప్ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో విచారణ ప్రారంభమైందని ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదని పోలీసులు తెలిపారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
రోగులపై వైద్యుల అత్యాచారం
Published Thu, Sep 8 2016 1:34 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement
Advertisement