అహ్మదాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తమ రాష్ట్రంలో జన్మించిన ఆడ పిల్లలందరినీ కూడా 'దేవ దూత'లుగా గుర్తించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభత్వాసుపత్రిని సందర్శించిన ఆయన.. నవజాత ఆడ శిశువులకు 5 గ్రాముల వెండి నాణేలు, బట్టలు, ‘మమతా కిట్’ ను అందించారు.
పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవితం, మంచి చదువు అందించాలని శిశువుల తల్లులను కోరారు. అంతకుముందు గాంధీనగర్‌లో ‘బేటీ బచావో..బేటీ పడావో’ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రంలో స్త్రీ,పురుష నిష్పత్తిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో వెయ్యిమంది పురుషులకు 848 మందే స్త్రీలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’నినాదాన్ని అందరూ అందుకొని మహిళా శక్తికి ఊతమివ్వాలని ట్వీటర్ ద్వారా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment