
సూరత్: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలోని దుకాణాలన్నీ రాఖీలతో కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాఖీ పండుగ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ నగల షాపు 22 కేరట్ల బంగారంతో చేసిన రాఖీలను అమ్ముతోంది. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ముఖ చిత్రాలను ముద్రించిన ఈ రాఖీలు ఒక్కొక్కటి రూ.30,000 నుంచి రూ.60,000 మధ్యలో లభ్యమవుతున్నాయి. ఈ విషయమై నగల షాపు యజమాని మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా మోదీ, రూపానీ, ఆదిత్యనాథ్ ముఖ చిత్రాలతో 50 బంగారు రాఖీలను తయారుచేశామని తెలిపారు. వీటిలో 47 రాఖీలు ఇప్పటికే అమ్ముడైపోయాయని వెల్లడించారు. ఇలాంటి రాఖీలు కావాలంటూ తమ షాపుకు ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment