అహ్మదాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఓ బ్రాహ్మణుడని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యానించారు. బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన మెగా బ్రాహ్మిణ్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ‘బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణుడని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు.
అంబేడ్కర్ ఇంటిపేరు బ్రాహ్మణుల ఇంటిపేరే. అంబేడ్కర్ గురువు ఆయనకు ఈ పేరు ఇచ్చారు. బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణుడని పిలవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ లెక్కన ప్రధాని మోదీ కూడా బ్రాహ్మణుడే’ అని త్రివేది పేర్కొన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన త్రివేది రావొపురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ వ్యాఖ్యలపై దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ మండిపడ్డారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంబేడ్కర్‌కు కులాన్ని ఆపాదించడం సిగ్గుచేటని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment