గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెర్చిఇంజన్ దిగ్గజం గూగుల్‌ను నారదుడితో పోల్చారు. ‘ ఇవాళ గూగుల్ సమాచార వనరుగా ఉంటోంది..గూగుల్‌ను మనం నారదమునితో పోల్చవచ్చు..ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన సమస్తం అందరికీ చేరవేసేవారు..అయితే మానవాళికి హాని తలపెట్టే సమాచారాన్ని ఎన్నడూ వ్యాప్తి చేయలేద’న్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడటం మాని పాన్‌షాపులు పెట్టుకోవాలని త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ సూచించిన క్రమంలో రూపానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
త్రిపుర సీఎం అంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్స్ రాయాలని, మెకానికల్ ఇంజనీర్లు సివిల్ సర్వీసుల జోలికి వెళ్లరాదని ఆయన అన్నారు. మహాభారత సమయంలోనే ఇంటర్‌నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేదని కూడా విప్లవ్ దేవ్ చెప్పుకొచ్చారు. విప్లవ్ వ్యాఖ్యలపై మేథావులు, రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment