![Gujarat CM Vijay Rupani in Self Quarantine Amid Corona Virus - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/15/vijay-ruppani.jpg.webp?itok=QCCgF-uy)
గాంధీనగర్ : గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది. అహ్మదాబాద్‌లోని జమల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. (కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా)
అయితే మంగళవారం మధ్యాహ్నం ఇమ్రాన్ గాంధీ నగర్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కలిశారు. దీంతో వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా బుధవారం నాటికి గుజరాత్‌లో 617 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. మృతుల సంఖ్య 26కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment