
అహ్మదాబాద్: ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, గిరిజన నేత ఛోటూ వాసవ వంటి కుల నేతల్ని ఆశ్రయిస్తోందని విమర్శించారు. వీరందరికీ వారివారి సామాజిక వర్గాల్లో ఎలాంటి మద్దతు లేదని ఆదివారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అబద్ధాల కోరుగా, హార్దిక్ పటేల్‌ను ‘మీడియా తయారుచేసిన నేత’గా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment