
అహ్మదాబాద్: రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ అన్నారు. జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంత సేపు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని, గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక వేళ ఆ వీడియోలో నేనుంటే నా వ్యక్తిగత జీవితం గురించే అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియోలతో చిల్లర రాజకీయాలు చేస్తూ బీజేపీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో వ్యక్తిగత జీవితానికి, ఏకాంతానికి భద్రత లేకుండా పోయిందని విమర్శించారు.
ఓ హోటల్‌లో అమ్మాయితో హర్దిక్ పటేల్ గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో పటీదార్ ఆందోళన సమితి కన్వీనర్ కూడా ‘గుజరాత్ ప్రజలు అభివృద్ధి సీడీల కోసం ఎదురు చూస్తున్నారని, 22 ఏళ్ల హర్దిక్ సీడీల కోసం కాదని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment