విదేశాంగ మంత్రి జైశకంర్ ఎక్కడ ఏవిధంగా ఎలా ఉండాలో తనకు తెలుసునంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జైశంకర్. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం కేప్ టౌన్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయ కమ్యూనిటీతో జరిగిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ పేరు ప్రస్తావించకుండా యూఎస్‌లో ఎవరో చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని భారతీయ కమ్యూనిటీ ప్రశ్నించగా..విదేశాంగ మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. తాను విదేశాల్లో ఉంటే తన గురించే మాట్లాడతానని, అక్కడ రాజకీయాలు చేసేందుకు చూడనని చెప్పుకొచ్చారు. అదే స్వదేశంలో ఉంటే మాత్రం వాదిస్తాను లేదా విభేదించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు.
ప్రజాస్వామ్య సంస్కృతి అర్థం పట్టేలా.. జాతీయ ప్రయోజనం కలిగించేలా సమిష్టిగా పనిచేయడం అనేది ఒక నిర్దిష్ట సాముహిక బాధ్యత అని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలోన శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన మొహబ్బత్‌కి దుకాన్ కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీజేపీ చర్యల ఫలితం భారత్‌లోని ముస్లింలు, దళితులు, గిరిజన ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని, వారి కోసం ప్రేమ, అప్యాయతలతో పోరాడలంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆర్థిక అసమానతలు గురించి కూడా వ్యాఖ్యానించారు.
(చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..)
Comments
Please login to add a commentAdd a comment