photo credit: AFP
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్‌వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి.
వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.
ఎన్‌సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment