Nile
-
వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
ఇటీవల కేరళలోని వివిధ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి. దాదాపు పదిమందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందట. అందువల్ల సురక్షితంగా ఉండేలా జాగ్రలు తీసుకోవటం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదవ్వడంతో కేరళ హైఅలర్ట్‌లో ఉంది. అసలేంటీ వెస్ట్ నైలు జ్వరం..? ఎందువల్ల వస్తుందంటే..?వెస్ట్ నైలు జ్వరం అంటే..వెస్ట్ నైలు జ్వరం అనేది వెస్ట్ నైల్ వైరస్ (WNV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న దోమల కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా క్యూలెక్స్ జాతికి చెందిన జాతులు. ఈ వైరస్ మొట్టమొదట 1937లో ఉగాండాలో గుర్తించారు. ఆ తర్వాత భారతదేశంలో అలప్పుజా జిల్లాలో ఇలాంటి తొలికేసు నమోయ్యింది.లక్షణాలు..కడుపు నొప్పి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పిఆకలి లేకపోవడంకండరాల నొప్పులువికారం, వాంతులు, అతిసారం, దద్దుర్లువాచిన శోషరస గ్రంథులుఈ లక్షణాలు సాధారణంగా 3 నుంచి 6 రోజుల వరకు లేదా ఒక నెల పాటు ఉండవచ్చు. వ్యాధి తీవ్రమైతే వెస్ట్ నైల్ ఎన్సెఫాలిటిస్ లేదా వెస్ట్ నైల్ మెనింజైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే..స్పష్టంగా ఆలోచించే సామర్థ్యంలో గందరగోళం లేదా మార్పుస్పృహ కోల్పోవడం లేదా కోమాకండరాల బలహీనతగట్టి మెడఒక చేయి లేదా కాలు బలహీనతఎవరికి ప్రమాదమంటే..60 ఏళ్లు పైబడిన వ్యక్తులు: వెస్ట్ నైల్ వైరస్ సోకితే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తీవ్రమైన లక్షణాలు, సమస్యలు అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు లేదా క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా అవయవ మార్పిడి వంటి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యలుదోమల నియంత్రణ: దోమల వృద్ధి అరికట్టేలా నిలబడి ఉన్న నీటిని తొలగించడం. క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా దోమల జనాభాను తగ్గుతుంది ఫలితంగా ఈ సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది.వ్యక్తిగత రక్షణ: పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు ధరించడం. DEET లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనెను కలిగి ఉన్న క్రిమి వికర్షకాలను పూయడం వల్ల దోమలు కుట్టకుండా నిరోధించవచ్చు.బహిరంగ కార్యకలాపాలను నివారించండి: దోమలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, సంధ్యా సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా దోమల కాటు ప్రమాదాన్ని తగ్గించొచ్చు.దోమల నివారిణిని పిచికారీ చేయండి: బయటకు వెళ్లే ముందు దోమల నివారణను పిచికారీ చేయండి లేదా ఓడోమోస్ను పూయండి.తలుపులు, కిటికీలు మూసి ఉంచండి: మీ ఇళ్లలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. రాత్రిపూట కుట్టకుండా ఉండటానికి దోమతెరలను ఉపయోగించండి.(చదవండి: మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు) -
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.ఎన్సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. -
'ఆర్డర్ ఆఫ్ నైల్'.. ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవం..
అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీకి అందించారు. ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ ఈ రోజు సందర్శించారు. సుమారు 1000 ఏళ్ల నాటి మసీదు గోడలపై చెక్కిన శాసనాలను ప్రధాని తిలకించారు. 13,560 మీటర్లలో విస్తరించిన మసీదును భారత్‌లోని దావూదీ బోహ్రా కమ్యునిటీలు 1970లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి వారే దాని పర్యవేక్షణ బాధ్యతలను చేపడుతున్నారు. గుజరాత్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న బోహ్రా తెగలతో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈజిప్టులోని భారత రాయబారి అజిత్ గుప్తే ఈ సందర్భంగా తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాలో పోరాట సమయంలో మరణించిన 4000 మంది భారత సైనికులకు గుర్తుగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షునితో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఇదీ చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
పడవ బోల్తా 19మంది మృతి
కైరో: ఈజిప్టులోని నైలు నదిలో పడవ బోల్తా పడింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ పడవ బుధవారం రాత్రి బోల్తాపడింది. ఈజిప్టు రాజధాని కైరోకి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 19మంది ప్రయాణికులు నీటిలో మునిగి చనిపోయారు. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న రెస్క్యూ దళాలు ఆరుగురిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. పడవ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నామని ఈజిప్టు మంత్రి తెలిపారు. 16 ఆంబులెన్సులు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం వెదుకుతున్నామని తెలిపారు. వెలుగు తక్కువగా ఉండటం, నదీ ప్రవాహం వేగంగా ఉండడం గాలింపు ప్రక్రియకు ఆటంకంగా మారిందని అధికార వర్గాలు ప్రకటించాయి. -
పడవ బోల్తా : 19 మంది మృతి
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని నైలు నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన బుధవారం ఆర్థరాత్రి జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే 16 అంబులెన్స్‌లు, రెండు బోట్లతో సహాయక చర్యలు ప్రారంభించి... మిగిలిన వారిని రక్షించామని పేర్కొన్నారు. అయితే ఓ ప్రయాణికుడి జాడ మాత్రం తెలియరాలేదని... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.