కైరో: ఈజిప్టులోని నైలు నదిలో పడవ బోల్తా పడింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ పడవ బుధవారం రాత్రి బోల్తాపడింది. ఈజిప్టు రాజధాని కైరోకి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 19మంది ప్రయాణికులు నీటిలో మునిగి చనిపోయారు. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న రెస్క్యూ దళాలు ఆరుగురిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. పడవ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నామని ఈజిప్టు మంత్రి తెలిపారు. 16 ఆంబులెన్సులు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం వెదుకుతున్నామని తెలిపారు. వెలుగు తక్కువగా ఉండటం, నదీ ప్రవాహం వేగంగా ఉండడం గాలింపు ప్రక్రియకు ఆటంకంగా మారిందని అధికార వర్గాలు ప్రకటించాయి.