బోటు బోల్తా : 42 మంది మృతి
కైరో : ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. శరణార్థులను తీసుకు వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. 400 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం కర్ఫ్ ఎల్ షేక్ వద్ద చోటు చేసుకుందని... ఈ ప్రమాదం జరిగిన సమయంలో 600 మంది శరణార్థులు బోటులో ఉన్నారని చెప్పారు.
వారంతా ఈజిప్టియన్లు, సరియన్లు, సుడాన్ వాసులు, సోమాలియాకు చెందిన వారని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బోటులో ప్రయాణిస్తున్న 150 మందిని కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడరని పేర్కొన్నారు. వారిని రషిద్ నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.