తూర్పు, పడమరలను కలుపుతూ రహదారి హారం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి(గోల్డెన్ క్వాడ్రీలేటరల్) తరహాలో.. భారతదేశ తూర్పు పడమరలను కలుపుతూ ‘భారతమాల’ పేరుతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఆ వివరాలు..
♦ మౌలిక వసతులకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక, భారీ కార్యక్రమం ‘భారతమాల’.
♦ భారతదేశ తూర్పు, పడమరలను అనుసంధానిస్తూ రహదారి హారం.
♦ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలను కలుపుతూ గుజరాత్ నుంచి మిజోరం వరకు రోడ్డు నిర్మాణం.
♦ రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారుల నిర్మాణం.
♦ గుజరాత్ నుంచి ప్రారంభించి రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌ల మీదుగా మిజోరం వరకు రోడ్డు రవాణా సౌకర్యం.
♦ ఈ రహదారికి మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు ఉన్న తీర రాష్ట్రాల రహదారులతో, మరో ప్రతిష్టాత్మక పథకం ‘సాగరమాల’తో అనుసంధానం.
♦ ఈ సంవత్సరం చివరలో ప్రారంభించి.. ఐదేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం.
♦ పర్యావరణ అనుమతులు, భూసేకరణే ప్రధాన అడ్డంకిగా భావిస్తున్న అధికారులు.
♦ సరిహద్దు ప్రాంతాలకు, మిలటరీ అవసరాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ పథకం వ్యూహాత్మక ఉద్దేశం.
♦ దీనితో సరిహద్దు వాణిజ్యం విస్తృతమయ్యే అవకాశం.
♦ భారతదేశానికి వేసిన దండలా కనిపించే ఈ రోడ్డు రవాణా పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి.
త్వరలో 'భారతమాల'
Published Thu, Apr 30 2015 1:33 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement