దుర్గాదేవి నమోస్తుతే!
శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం జిల్లా అంతటా దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనం ఇచ్చింది. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కష్టాల నుంచి తమను గట్టెక్కించామని వేడుకొన్నారు.