ముంబై: రూపాయి మళ్లీ చక్కటి రికవరీతో 70కన్నా దిగువకు వచ్చింది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో శుక్రవారం 69.95 వద్ద ముగిసింది. గురువారంతో పోల్చితే ఇది 40 పైసలు రికవరీ. గురువారం ముగింపు 70.35. డిసెంబర్ 20న రూపాయి 69.70 వద్ద ముగిసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆరు ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలర్ బలహీనత, క్రూడ్ ధరలు తిరిగి ఇప్పుడే భారీగా పెరగబోవన్న విశ్లేషణలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లు వరుసగా మూడవరోజు లాభాల బాటన పయనించడం కూడా రూపాయి బలోపేతానికి కారణమయ్యింది. ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి పటిష్ట ధోరణిలో 70.05 వద్ద ప్రారంభమైంది. 69.89–70.12 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment