
ముంబై: ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, దేశీ ఆర్థిక పరిస్థితుల గణాంకాలు మెరుగ్గా ఉండటం తదితర అంశాలతో రూపాయి మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసల మేర ర్యాలీ చేసి 73.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మధ్య విభేదాలపై ఆందోళనలు కొంత తగ్గడం సైతం రూపాయి రికవరీకి తోడైనట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజీలో క్రితం ముగింపు 73.95తో పోలిస్తే మెరుగ్గా 73.88 వద్ద గురువారం రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది.
ఆ తర్వాత మరింతగా బలపడి చివరికి 50 పైసల లాభంతో 73.45 వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 12 తర్వాత ఒకే రోజున రూ పాయి ఇంతగా పెరగడం ఇదే ప్రథమం అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ విభాగం హెడ్ వీకే శర్మ చెప్పారు. డాలర్ బలపడటంతో బుధవారం నాడు రూపాయి మారక ం విలువ 27 పైసలు క్షీణించి మూడు వారాల కనిష్టమైన 73.95 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment