సాక్షి, ముంబై: వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా ఇది వరుసగా మూడవ తగ్గింపు
హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది.
న్యూఢిల్లీలో ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి.
చదవండి: కరోనా : అయ్యయ్యో మారుతి!
ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment