గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్! | rbi-cuts-lending-rate-loans-set-to-get-cheaper-sensex-surges | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 15 2015 3:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

సంక్రాంతి పండుగ వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధానంలో వడ్డీరేట్లను తగ్గించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఆర్‌బీఐ రెపో రేట్‌ను 0.25శాతం తగ్గించింది. దీంతో అది 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులేదు. వచ్చేఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్భనం 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. మరోవైపు రెపో రేటు తగ్గిన కారణంగా యాభైవేల కోట్ల రూపాయిలు చలామణిలోకి రానున్నాయి. ఇక గృహ రుణాదారులకు కూడా శుభవార్త. గృహరుణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త గృహ రుణదారులకు సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు కూడా మంచి జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement