housing loan
-
ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం!
New Housing Loan Subsidy Scheme: పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని కలలు కంటున్నాయి. నగరాల్లోని మురికివాడల్లో, అద్దె ఇళ్లల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని రాబోయే సంవత్సరాల్లో తీసుకురాబోతున్నాం. వారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం ” అని మోదీ చెప్పారు. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చే కొత్త పథకం ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి పొడిగింపు. అయితే కొత్త పథకంలో వడ్డీ రాయితీని పొందే అర్హతను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
హౌసింగ్ లోన్, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్ఎస్బీసీ, యస్ బ్యాంక్ లు చేరాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు. ► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్ 6.70 శాతం వడ్డీ ఆఫర్ ఇస్తోంది. ఇది ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం. ► డిసెంబర్ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండబోదని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ► యస్ బ్యాంక్ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్ 6.65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పీఎన్బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
హెచ్ఆర్ఏ – గృహ రుణం...ఏది బెటర్?
ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే సాధనాలు చాలా ఉన్నాయి. హెచ్ఆర్ఏ, హోమ్ లోన్ కూడా ఈ కోవకి చెందినవే. కాకపోతే వివిధ సందర్భాల్లో వీటి ద్వారా చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన ఉంటే సరైన ప్రణాళిక వేసుకునేందుకు వీలవుతుంది. అందుకే.. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), గృహ రుణాల ద్వారా లభించే ప్రయోజనాల మధ్య తేడాలను ఒకసారి చూద్దాం... ఈ రెండూ ట్యాక్స్ డిడక్షన్ సాధనాలే అయినప్పటికీ.. రెండింటినీ ఏకకాలంలో క్లెయిమ్ చేయడానికి కుదరదు. సొంతిల్లు ఉన్నప్పుడు అద్దె కడుతున్నామంటూ హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయలేం. అలాగే అద్దె కడుతున్నట్లుగా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకుంటూ.... గృహ రుణంతో తీసుకున్న సొంత ఇంటికి సంబంధించి కట్టే ఈఎంఐల్లో పన్ను ప్రయోజనాలు పొందడానికి కుదరదు. కాబట్టి , ఏయే సందర్భాల్లో గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు ఈ రెండింటిలో ఏవి అనువైనవో తెలుసుకుందామా... హౌస్ రెంట్ అలవెన్స్... అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు కట్టే రెంట్‌ని.. వేతనంలో కొంత భాగంగా హెచ్ఆర్ఏ కింద చూపించడం జరుగుతుంది. ఈ కింది వాటిల్లో కనిష్టంగా ఉన్నదాన్ని పన్నులపరమైన మినహాయింపు పొందేందుకు హెచ్ఆర్ఏ కింద చూపించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. బేసిక్ శాలరీలో 50 శాతం వాస్తవ హెచ్ఆర్ఏ వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం ఒకవేళ ఏడాది పొడవునా ఈ అంకెల్లో ఎటువంటి మార్పూ లేకపోతే.. హెచ్ఆర్ఏని పూర్తి ఏడాదికి లెక్కించవచ్చు. అలా కాకుండా కొన్ని నెలల్లో మార్పులు చేర్పులు ఉన్న పక్షంలో నెలవారీగా .. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కలిపి లెక్క వేయాలి. ఉదాహరణకు సంతోష్ బేసిక్ శాలరీ నెలకు రూ. 40,000, హెచ్ఆర్ఏ రూ. 20,000 కాగా తను ఇంటి అద్దె కింద రూ. 25,000 కడుతున్నాడు అనుకుందాం. ఆర్థిక సంవత్సరం ఆసాంతం ఇందులో ఎటువంటి మార్పులు లేని పక్షంలో సంతోష్ హెచ్ఆర్ఏని ఈ కింది విధంగా లెక్కవేయడం జరుగుతుంది. బేసిక్ శాలరీలో 50 శాతం = రూ. 20,000 వాస్తవ హెచ్ఆర్ఏ = రూ. 20,000 వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం= రూ. 21,000 ఈ సందర్భంలో ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి కనిష్ట మొత్తం రూ. 20,000.. ఏడాదికి రూ. 2,40,000 హెచ్ఆర్ఏని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక, ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి ఇంటి అద్దె రసీదు, ఓనరు పాన్ నంబరు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు వారి పేరున ఉన్న ఇంట్లోనే నివసిస్తూ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసిన పక్షంలో.. పిల్లలు కట్టిన అద్దె మొత్తాన్ని పేరెంట్స్ తమ ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌ను పొందడానికి కరెంటు బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ లాంటి ఆధారాలు కూడా చూపాల్సి ఉంటుంది. గృహ రుణాలు... తొలిసారి సొంత ఇంటి కొనుగోలుకు హోమ్ లోన్ తీసుకుంటే.. ప్రతి నెలా కట్టే వాయిదాల్లో (ఈఎంఐ) అసలు భాగానికి .. గరిష్టంగా రూ. 1,50,000 దాకా సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతరత్రా మరికొన్ని పెట్టుబడులు కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఇక గృహ రుణంపై కట్టే వడ్డీకి కూడా సెక్షన్ 24బి కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 2,00,000 దాకా ఉంటుంది. వేతన జీవులు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం కల్పించేందుకే ఇలా గృహ రుణంపై ఆదాయ పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ.. హోమ్ లోన్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవడం ఉత్తమం అనే విషయానికొస్తే.. ప్రయోజనాలు.. సెక్షన్ 80సి కింద వచ్చే ఇతరత్రా సాధనాలకు అదనంగా హెచ్ఆర్ఏ డిడక్షన్స్ పొందవచ్చు. అంటే.. హెచ్ఆర్ఏ క్లెయిమ్ గానీ ఉంటే.. మరింత ఎక్కువగా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కించుకోవచ్చు. వారసత్వంగా ప్రాపర్టీ ఏదైనా దక్కే అవకాశం ఉండి, కొత్తగా మరిన్ని ఇళ్లను కొనుగోలు చేయదల్చుకోని వారికి ఇది ఉపయోగకరం. ప్రతికూలతలు.. ఒకవేళ కట్టే అద్దె కన్నా హెచ్ఆర్ఏ తక్కువగా ఉంటే కిరాయిని పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేయడానికి కుదరదని గమనించాలి. n సొంత ఇల్లు లేనివారు, వారసత్వంగా ఇల్లు దక్కే అవకాశం లేనివారు.. కేవలం హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ మీదే ఆధారపడితే కొత్తగా ప్రాపర్టీని సమకూర్చుకోవడానికి ఇది తోడ్పడదు. హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవంగా అద్దె కట్టకుండా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. గృహ రుణం ప్రయోజనాలు.. అసెట్‌ను సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇతరత్రా సెక్షన్ కింద రుణంలో వడ్డీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపులు కల్పిస్తుండటం వల్ల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మరింత ఎక్కువగా లభించినట్లవుతుంది. -
ఐసీఐసీఐ కూడా గుడ్ న్యూస్ చెప్పిందోచ్!
న్యూఢిల్లీ: ప్రయివేటుబ్యాంక్దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు శుభవార్త అందించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్టు ను తగ్గించిన అనంతరం తాజాగా ఐసీఐసీఐ హెం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది. గృహ రుణాల రేట్లపై 0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం ప్రకటించింది. రూ. 30లక్షలలోపు రుణాలపై ఈ తగ్గింపును అమలు చేయనుంది. ఎఫర్డబుల్ హౌ సింగ్ పథకానికి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ పథకం కింద, రూ.30 లక్షల రూపాయల కింద ఉన్న రుణాలు సరసమైన గృహాల రుణాలపై 0.3శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో, పరిశ్రమలో అతి తక్కువ ధరల్లో గృహ రుణాలను జీతాలు తీసుకునేవారికి అందుబాటులో తెచ్చింది. సాలరీడ్ మహిళా ఉద్యోగులు 8.35 శాతం రేటులోనూ, ఇతరులు 8.40 శాతం గృహ రుణాలు పొందనున్నారని ఒక ప్రకటనలోతెలిపింది. కాగా ఇప్పటికే ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం మేరకు సరసమైన గృహ రుణ రేనుఏ తగ్గించింది. దీని ప్రకారం 25 లక్షల రూపాయల లోపు రుణగ్రహీతలకు 8.40 శాతం, రు .1 కోట్ల వరకు వడ్డీ రేటును 8.50 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానుంది. మహిళల రుణగ్రహీతలకు రు. 25 లక్షల వరకు రుణాలకు 8.35 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తోంది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. 'గ్రాహ సిద్ధి' పేరుతో లాంచ్ చేసిన ఈ పథకంలో నిర్మాణం, గృహ లేదా ఫ్లాట్, మరమ్మత్తు లేదా పునర్నిర్మాణాల కోసం రుణాలను మంజూరు చేయనున్నట్టుప్రకటించిన సంగతి తెలిసిందే. -
రెండేళ్లలో 20వేల కోట్ల గృహరుణాలు
టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆర్.వైద్యనాథన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో హౌసింగ్‌లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 20,000 కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ధీమాను టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యక్తం చేసింది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఉన్న హౌసింగ్ లోన్ వాటా ఏటా 40 శాతం వృద్ధితో రెండేళ్లలో రూ. 20,000 కోట్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు టాటా హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆర్.వైద్యనాథన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి ఇంటి రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. రూ. 15 లక్షల లోపు రుణాల విలువ ప్రస్తుతం రూ. 1,800 కోట్లుగా ఉందని, ఇదే రెండేళ్లలో రూ. 4,000 కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మూడు లక్షలలోపు ఆదాయం ఉండి, రూ. 15 లక్షల లోపు రుణం తీసుకునే గ్రామీణ ప్రాంతాల్లో వారికి కేంద్రం ఇస్తున్న సబ్సిడీ వడ్డీరేటు పథకంలో తాము పాలుపంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూ.15 లక్షల లోపు రుణాలకు 9.2 శాతానికే గృహరుణాలను ఇస్తున్నామని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం సబ్సిడీని అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 70గా ఉన్న శాఖల సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి 100కు పెంచనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
-
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
చెన్నై : సంక్రాంతి పండుగ వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధానంలో వడ్డీరేట్లను తగ్గించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఆర్బీఐ రెపో రేట్‌ను 0.25శాతం తగ్గించింది. దీంతో అది 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులేదు. వచ్చేఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్భనం 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. మరోవైపు రెపో రేటు తగ్గిన కారణంగా యాభైవేల కోట్ల రూపాయిలు చలామణిలోకి రానున్నాయి. ఇక గృహ రుణాదారులకు కూడా శుభవార్త. గృహరుణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త గృహ రుణదారులకు సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు కూడా మంచి జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సులభంగా గృహరుణం..
త్వరలోనే వడ్డీరేట్లు దిగిరానుండటంతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలు ఖాతాదారులను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 20 ఏళ్లకు ఫిక్స్డ్ హోమ్‌లోన్ ప్రకటిస్తే, మరికొన్ని బ్యాంకులు బేస్‌రేటు కంటే వడ్డీరేట్లను తగ్గించడానికి వీలు లేకపోవడంతో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు, ప్రీక్లోజర్ చార్జీలపై మినహాయింపులతో ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా గృహరుణం తీసుకోవాలనుకునే వారు పరిశీలించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. సొంతింటి కల సాకారం చేసుకోవడవునేది చాలా క్లిష్టమైన అంశం. సరైన ఇంటిని అన్వేషించడం దగ్గర నుంచి, దానికి తగ్గ నగదును సవుకూర్చుకోవడం వరకు అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అందుబాటు ధరలో ఉన్న ఇంటిని ఎంచుకోవడం, దీనికి తగిన నగదును సవుకూర్చుకోవడవునేవి చాలా ముఖ్యాంశాలు. ఇప్పుడు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాలను అందిస్తున్నాయి. గృహరుణాన్ని ఇచ్చే సంస్థలో సరైన సంస్థను ఎంచుకోకపోతే సొంతింటి కల నెరవేర్చుకున్న ఆనందం ఒక్క రోజూ కూడా మిగలదు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణం పొందాలంటే ఈ అంశాలే కీలకం. ఎటువంటి గృహ రుణం కావాలి మార్కెట్లో అనేక గృహ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ గృహరుణం, ఇంటి విస్తరణకు రుణం, ఇంటి వురవ్ముతులకు రుణం, ఇంటిని తనఖా పెట్టి తీసుకునే రుణం, వుహిళల గృహరుణం, నివాసేతర గృహరుణం, స్టెప్ అప్ ఈఎంఐ, లీజ్ రెంటల్ ఫైనాన్స్ వంటి అనేక పథకాలున్నాయి. ముందుగా ఈ పథకాల్లో ఏది మీకు సరిపోతుందో పరిశీలించండి. మీరు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నారా లేక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారా లేక ప్రస్తుతమన్న ఇంటిని విస్తరిస్తున్నారా అనేవి కీలకం. ఎందుకంటే ఇవి దేనికవి విభిన్నం. వడ్డీ రేట్ల దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ల వరకు అన్నీ వూరిపోతాయి. ఎవరు తీసుకోవచ్చు వ్యక్తిగతంగా లేదా సహకార సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, వివిధ సంఘాలు గృహరుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత గృహరుణాల విషయూనికి వస్తే జీతం ఆదాయుంగా ఉన్న వారితో పాటు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు ఇలా ఆదాయుం ఉన్న ప్రతీ ఒక్కరు తీసుకోవచ్చు. సాధారణంగా ఇంటి విలువలో 80 శాతం వరకు గృహ రుణం లభిస్తుంది. పైన పేర్కొన్న వాటిలో ఏ విభాగంలోకి వస్తారన్నదాన్ని బట్టి డాక్యుమెంటేషన్, వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయి. ఎంత రుణం వస్తుంది... ఈ విషయూనికి వచ్చేసరికి గృహరుణ సంస్థలు అనేకాంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ముఖ్యంగా మీ చెల్లింపు సావుర్థ్యంతో పాటు, మీ వయసు, విద్యార్హత, మీపై ఆధారపడి జీవించే వారి సంఖ్య, అప్పులు, పొదుపు, ఆస్తులు, స్థిరంగా వచ్చే ఆదాయుం వంటి అంశాలను పరిశీలిస్తారు. అలాగే రుణం తీసుకునే వారు ఇంటిలోని ఇతర కుటుంబ సభ్యులకు ఆదాయం ఉంటే వారిద్దరూ కలసి రుణానికి దరఖాస్తు చేస్తే వురింత రుణం పొందే అవకాశంతో పాటు, సులభంగా లభిస్తుంది. రుణ కాలపరిమితి.. గృహరుణాల్లో పరిశీలించాల్సిన వాటిలో వురో ముఖ్యమైన అంశం రుణ కాలపరిమితి. సాధారణంగా అన్ని బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్ల కాలపరిమితిలో రుణాలను అందిస్తాయి. వురికొన్ని సంస్థలు అయితే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా రుణాన్ని ఇస్తున్నాయి. జీతం ఆదాయుం ఉన్న వారికి 60 ఏళ్ల వరకు, అదే వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు 65 ఏళ్ల వరకు మాత్రమే రుణాన్ని ఇస్తాయి. ప్రతీ ఒక్కరు పదవీ విరవుణలోపే గృహరుణాన్ని తీర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ఇవి కావాలి.. గృహరుణానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరి. కేవైసీ నిబంధనలకు అనుగుణంగా మీ నివాస, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఉద్యోగస్తులు అయితే మీ జీతానికి సంబంధించిన ఆరు నెలల శాలరీ స్లిప్, అపాయింట్మెంట్ ఆర్డరు, ఫాం 16, ఒక ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే వృత్తినిపుణులు అయితే మూడేళ్ల లాభనష్టాల చిట్టా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యం ఇది మీ వ్యక్తిగత జీవిత అలవాట్లు, బాధ్యతలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఉన్న వారు నెల జీతంలో గరిష్టంగా 40 శాతం వరకు వూత్రమే ఈఎంఐ ఉండే విధంగా చూసుకోవాలి. అదే ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు లేనివారు 60 శాతం వరకు చెల్లించే విధంగా ఈఎంఐ ఎంచుకోవచ్చు. ఈఎంఐ ఎంత అనేది మీరు తీసుకునే రుణం, అది చెల్లించే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ గృహరుణంలో ఎంచుకునే వడ్డీరేటు విధానం కూడా చాలా కీలకమైనది. సాధారణంగా బ్యాంకులు చలన (ఫ్లోటింగ్), స్థిర (ఫిక్స్డ్) వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్న విషయూనికి వస్తే... సాధారణంగా వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు (అంటే ఇప్పుడున్న పరిస్థితిలాగానే ) ఫ్లోటింగ్, అదే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరాయునుకున్నప్పుడు ఫిక్స్డ్ రేటుకు వెళ్లాలి. ఉదాహరణకు 1983-84 సవుయుంలో చాలా బ్యాంకులు 7.5 శాతానికే హోమ్లోన్స్ అందించాయి. అప్పుడు చాలావుంది ఫిక్స్డ్ విధానం ఎంచుకున్నారు. ఆ తర్వాత వడ్డీరేట్లు గణనీయుంగా పెరిగినా ఈఎంఐ భారం పెరగకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంళ్ళకు బ్యాంకులు ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయూ అని బ్యాంకు అధికారులను సంప్రదించండి. ఇవి పరిశీలిస్తాయి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత మంజూరు చేయూలా వద్దా అన్న అంశంపై హోమ్‌లోన్ సంస్థలు అనేక అంశాలను పరిశీలిస్తాయి. ఇందులో రెండు అంశాలు కీలకమైనవి. ఇందులో మొదటిది రుణ చెల్లింపు సావుర్థ్యం, రుణ చరిత్ర వంటివి అయితే రెండోది ఆస్తి పరిశీలన. ఎంచుకున్న ఆస్తి ఎటువంటి వివాదాలు లేకుండా సరిగా ఉందా లేదా, అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయూ లేదా అని పరిశీలిస్తాయి. ఈ రెండు అంశాల్లో బ్యాంకులు సంతృప్తి చెందితే మీకు రుణం మంజూరు అవుతుంది. బీమా తప్పనిసరి.. గృహరుణం తీసుకునే వారు రుణ మొత్తానికి సరిపడా బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చాలా హోమ్‌లోన్ సంస్థలు గ్రూపు ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. బీమా తీసుకుంటే రుణం తీసుకున్న తర్వాత అనుకోని సంఘటన ఏదైనా జరిగినా.. కుటుంబ సభ్యులకు ఈ రుణం భారంగా మారదు. అటువంటి సమయంలో చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీనే చెల్లిస్తుంది. సాధారణంగా ఈ బీమా పాలసీలకు ప్రీమియం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియానికి కూడా రుణం లభిస్తుంది. - ఆర్. నంబిరాజన్ ఎండీ, డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్ -
సులభంగా గృహరుణం..
మిగిలిన రుణాలతో పోలిస్తే గృహరుణం తీసుకోవడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. గృహరుణం మంజూరు సుదీర్ఘమైన ప్రక్రియే కాకుండా అనేక పత్రాలను రుణం మంజూరు చేసే ఆర్థిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎవర్ని అడిగినా... వారు రుణం పొందేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది చెపుతారు. అయితే దరఖాస్తుకు ముందుగానే కొన్ని అంశాలపై దృష్టిసారిస్తే... ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా గృహరుణం పొందడమే కాకుండా వ్యయభారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మన దేశంలో గృహ రుణాల మార్కెట్ చాలా పెద్దది. అనేక రకాల గృహరుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ గృహరుణాలు, ఇంటిని విస్తరించడం కోసం, ఇంటి మరమ్మతుల కోసం, మార్టిగేజ్, ఉమెన్ హోమ్లోన్స్, నాన్ రెసిడెన్షియల్, లీజ్ రెంటల్ ఫైనాన్స్, స్టెప్ అప్ ఈఎంఐ ప్రొడక్టు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పొచ్చు. ఈ రుణాలను జీతం ఆదాయంగా ఉన్న వాళ్లు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులతో పాటు కో-ఆపరేటివ్ బాడీస్, కొంత మంది సంఘంగా ఏర్పడి తీసుకోవచ్చు. ఇంటి విలువలో 80% కంటే తక్కువ మొత్తానికే గృహరుణం లభిస్తుంది. కొత్తగా గృహరుణం తీసుకునే వారికి బ్యాం కులు అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అం దిస్తున్నాయి. బ్యాంకులు పోటీపడి అతి తక్కువ రేట్లకే గృహరుణాలను ఇస్తుండటంతో పాటు, చెల్లింపు సామ ర్థ్యం ఆధారంగా మరింత తక్కువ రేటును కూడా ఇస్తున్నాయి. దీనికి తోడు పన్ను మినహాయింపులు ఉండనే ఉన్నాయి. గృహరుణం తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత రుణం వస్తుంది? రుణం ఎంత వస్తుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉం టుంది. వ్యక్తి చెల్లింపు సామర్థ్యం, వయసు, చదువు, స్థిరమైన ఆదాయమా కాదా? అతనిపై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు-అప్పు లు, పొదుపు అలవాట్లు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే గరిష్టంగా ఎంత రుణం ఇవ్వొచ్చన్న దానిపైన బ్యాం కులు ఒక నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ముందునుంచే దృష్టిపెట్టడం ద్వారా గరిష్ట మొత్తాన్ని రుణంగా పొందొచ్చు. కాలపరిమితి ముఖ్యమే.. రుణ ఎంపికలో కాలపరిమితి చాలా ముఖ్యమైన అంశం. ఈ కాలపరిమితిపైనే చెల్లించే వడ్డీ ఆధారపడి ఉంటుంది. అధిక కాలపరిమితి ఎంచుకుంటే వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోండి. సాధారణంగా బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్లలోపు చెల్లిం చే విధంగా గృహరుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఇస్తున్నాయి. రుణ కాలపరిమితిని ఎంచుకోవడంలో పదవీ విరమణ వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట కాలపరిమితి, పదవీ విరమణ వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అది రుణ కాలపరిమితిగా నిర్ణయిస్తారు. అదే వృత్తి నిపుణులు, వ్యాపారస్తులకైతే 65 ఏళ్ల వరకు రుణం చెల్లించడానికి అనుమతిస్తారు. చెల్లింపు సామర్థ్యం రుణ మంజూరు, ఎంత రుణం వస్తుందన్నది మీ చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బ్యాంకులు అనేక అంశాలను పరిశీలించి చెల్లింపు సామర్థ్యంపై అంచనాకి వస్తాయి. సాధారణంగా వివాహమై కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తి విషయంలో నెల జీతంలో 40 శాతానికి మించి ఈఎంఐ లేకుండా చూస్తారు. అదే ఎటువంటి బాధ్యతలు లేని వారికి మాత్రం మొదటి ఐదేళ్లు నెల జీతంలో 60 శాతం వరకు ఈఎంఐకి అనుమతిస్తారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు గృహరుణాలకు దరఖాస్తు చేసుకుంటే, పదవీ విరమణ తర్వాత రుణం చెల్లించే విధంగా తక్కువ వయసు ఉన్న మరో వ్యక్తిని కో-అప్లికెంట్‌గా పెట్టుకోవడానికి కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి. అర్హతలు..! ఒకసారి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత బ్యాంకులు లేదా ఇతర గృహరుణ సంస్థలు రెండు అంశాలను పరిశీలించిన తర్వాతనే రుణాన్ని మంజూరు చేస్తాయి. అందులో మొదటిది వ్యక్తిగత సమాచార పరిశీలన. మీరిచ్చిన కాగితాల ఆధారంగా మీ ఆర్థిక సామర్థ్యాన్ని లెక్కించి రుణం ఇవ్వచ్చా లేదా అన్న అంశాన్ని లెక్కిస్తాయి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న ప్రాపర్టీ కాగితాలను పరిశీలించి న్యాయపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. ఇవి కావాలి.. రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంకులకు విధిగా కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే కస్టమర్ ప్రొఫైల్, నివాసం ఉండే ప్రాంతాలనుబట్టి అదనపు కాగితాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం. దీంతోపాటు శాలరీ స్లిప్, ఫామ్ 16 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే వ్యాపారస్తులు అయితే లాభనష్టాల స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ గుర్తింపుతోపాటు, నివాస ధ్రువీకరణపత్రాలు కావాలి. ఎంచుకున్న ప్రాపర్టీకి సంబంధించిన జిరాక్స్ కాపీలను ఇవ్వాలి.