raghurama rajan
-
నా మనసులో, ఇంట్లో వైఎస్సార్ ఉన్నారు..
సాక్షి, నర్సాపురం : రాష్ట్రంలో ఓటు పరిస్థితి ఎలా ఉందంటే బహరంగ సభకు హాజరైనవాళ్లు తమ జేబులో పర్సు ఉందో, లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు చూసుకోవాల్సి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శనివారం భీమవరం నియోజకవర్గ ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నాకు ఎంతో స్నేహభావం ఉంది. నా మనసులో, ఇంట్లో వైఎస్సార్ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డికి మాకు ఉన్న అనుబంధం ఎంతంటే ...నా మనవడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టడమే. వైఎస్సార్ కుటుంబాన్ని బలోపేతం చేయవలసిన బాధ్యతలు ఒక కుటుంబసభ్యుడిగా నాకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగువేల కిలోమీర్టల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రపంచంలో ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి. మన అందరం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావలసినదే..’ అని అన్నారు. -
రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ
ముంబై: రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను తగ్గించింది. మంగళవారం జరిగిన ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్ష సమావేశంలో రెపో, రివర్స్ రెపో రేటు అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో గృహ, వాహనాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే సీఆర్ఆర్( నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెపోరేటు 6.75 శాతం గా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయని తాము ఆశిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘరామ రాజన్ పేర్కొన్నారు. -
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
-
గృహ రుణదారులకు ఆర్బీఐ సంక్రాంతి గిప్ట్!
చెన్నై : సంక్రాంతి పండుగ వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధానంలో వడ్డీరేట్లను తగ్గించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఆర్బీఐ రెపో రేట్‌ను 0.25శాతం తగ్గించింది. దీంతో అది 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులేదు. వచ్చేఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్భనం 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. మరోవైపు రెపో రేటు తగ్గిన కారణంగా యాభైవేల కోట్ల రూపాయిలు చలామణిలోకి రానున్నాయి. ఇక గృహ రుణాదారులకు కూడా శుభవార్త. గృహరుణాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్త గృహ రుణదారులకు సంక్రాంతి కానుకగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు కూడా మంచి జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.