రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ
ముంబై: రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను తగ్గించింది. మంగళవారం జరిగిన ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్ష సమావేశంలో రెపో, రివర్స్ రెపో రేటు అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో గృహ, వాహనాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
అయితే సీఆర్ఆర్( నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెపోరేటు 6.75 శాతం గా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయని తాము ఆశిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘరామ రాజన్ పేర్కొన్నారు.