
సాక్షి, నర్సాపురం : రాష్ట్రంలో ఓటు పరిస్థితి ఎలా ఉందంటే బహరంగ సభకు హాజరైనవాళ్లు తమ జేబులో పర్సు ఉందో, లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు చూసుకోవాల్సి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శనివారం భీమవరం నియోజకవర్గ ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నాకు ఎంతో స్నేహభావం ఉంది. నా మనసులో, ఇంట్లో వైఎస్సార్ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డికి మాకు ఉన్న అనుబంధం ఎంతంటే ...నా మనవడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టడమే. వైఎస్సార్ కుటుంబాన్ని బలోపేతం చేయవలసిన బాధ్యతలు ఒక కుటుంబసభ్యుడిగా నాకుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగువేల కిలోమీర్టల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రపంచంలో ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. మన అందరం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావలసినదే..’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment