narsapuram
-
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజం
-
జనసేన ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
-
Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ
-
RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
ఓ.. జమానాల సినిమా, అందులో మోహన్ బాబుది ఓ ఆకు రౌడీ రోల్. ‘నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు’ అని తన అసిస్టెంట్‌తో ఓ బడాయిలకు పోతుంటాడు. ఎంతైనా పాత సినిమా కదా.. దానికి తగ్గట్లే క్లైమాక్స్‌లో పోలీసులు వస్తారు. ‘అయ్యా.. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి ఈ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు’’ అని అసిస్టెంట్ గుర్తు చేస్తాడు. ‘నాకు వాళ్లు తెలుసుకానీ, వాళ్లకే నేను తెలియదు కదా’ అని చెప్పి పోలీస్ జీప్ ఎక్కుతాడు మోహన్‌బాబు. కట్ చేస్తే.. నరసాపురం సీటు విషయంలో RRR అదే రఘురామ కృష్ణంరాజు చేసిన హడావిడి ఆ పాత సినిమా సీన్లను సరిగ్గా మ్యాచ్ చేసిందనే చెప్పాలి. ‘‘నరసాపురం సీటు నాదే .. నా బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు. నాకు వాళ్ళు తెలుసు.. వీళ్ళు తెలుసు’’ అంటూ ఫొటోలకు ఫోజులు పెట్టి మరీ మీసాలు తిప్పుకున్న రఘురామరాజుకు.. చివరకు చేతులు పిసుక్కోవడమే మిగిలింది. చంద్రబాబు ప్రోద్బలంతో, టీడీపీ అనుకూల మీడియా సాయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూ రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసినా రఘురామకు అచ్చీరాలేదు. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు గల్లంతైపోయింది.మొదటి నుంచి బిల్డప్ బాబాయే.. స్వతహాగా తాను అందరి లాంటి వాడిని కాదనే భావనలో కూరుకుపోయిన రఘురామ.. ఆ పరిస్థితులతో వైఎస్సార్సీపీలో ఎంతకాలం కొనసాగలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా నెగ్గిన ఆయన.. ఏడాదిలోనే అనూహ్యంగా పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత తనకు ఢిల్లీ పెద్దల అండ ఉందని ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే.. అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో ఎలాగోలా మేనేజ్ చేసుకోగలిగారు.ఇక.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఢిల్లీలో నిత్యం ప్రెస్మీట్లు పెడుతూ.. ఏపీ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. మధ్య మధ్యలో చంద్రబాబు సూచనలతో కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేశారు. టీడీపీని బీజేపీకి దగ్గర చేసి, 2024 తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ప్చ్.. ఇంతా చేస్తే చివరకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు అయ్యింది RRR పరిస్థితి. అదే తిప్పి కొట్టింది మరీ.. ఈ నాలుగేళ్లుగా టీడీపీ కోసం రఘురామ చేయని పనంటూ లేదు. అదే సమయంలో.. బీజేపీ నీడలో ఉన్న తనపై వేటు కూడా వేయలేదంటూ వైఎస్సార్సీపీకి సవాల్ విసిరే స్టేజ్‌కు చేరుకున్నారు రఘురామ. అయితే.. తాను బాగా దగ్గర అని రఘురామ ఊహించుకుంటే.. బీజేపీ మాత్రం ఆయన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చంద్రబాబు మనిషి అనే కోణంలో ఎంత దూరం ఉంచాలో.. అంత దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. వీటికి తోడు ఏపీ సీనియర్లు రఘురామ మీద ఇచ్చిన నివేదికల్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. అందుకే నిర్మోహమాటంగా.. టిక్కెట్ కుదరదని తేల్చేసింది. నీ మెంబర్షిప్ ఏదయ్యా?.. ఏ పార్టీ అయినా సరే.. తమదాంట్లో ప్రాథమిక సభ్యత్వం లేకుండా టికెట్ ఇస్తుందా?. బిల్డప్పుల రఘురామకు ఆ మాత్రం సోయి లేదా?.. ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై రఘురామకృష్ణంరాజు అక్కసు వెళ్లగక్కారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ రఘురామ గాలి తీసేసింది. ‘‘బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ పేరు లేకపోవడం ఆశ్చర్యమేముంది అంటూ ఎక్స్ వేదికగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా పోస్ట్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా? అంటూ సెటైర్లు వేశారాయన. ‘‘వారిపై జాలిచూపే పార్టీలు(టీడీపీ, జనసేలను ఉద్దేశిస్తూ పరోక్షంగా) ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారాయన. రఘురామకు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు నెటిజన్ల కామెంట్లు ‘నాకు టికెట్ రాకుండా సోము వీర్రాజు ద్వారా జగన్ అడ్డుకున్నాడు’.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుబాబోయ్.. కితకితలు పెట్టకుండానే రాజుగారు భలే నవ్విస్తున్నారే!. సోము వీర్రాజు MP టికెట్‌కే దిక్కు లేదు.. నీకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగాడా?.. మింగలేక మంగళవారం మాటలు. సోము వీర్రాజు (కాపు) కు MP టికెట్ రాకుండా చక్రం తిప్పింది పురంధేశ్వరి. ఎందుకంటే సోము కు ఎంపీ టికెట్ వచ్చి గెలిస్తే .. కాపు కోటాలో కేంద్ర మంత్రి అవుతాడు. నాకు రాదు అని ‘కమ్మ’ని కుట్ర పన్నింది ‘3 అడుగులు వెనక్కి వేస్తున్నాను’ .. టికెట్ రాకపోవడం పై రఘురామ రాజు. 30 అడుగులు వెనక్కి వేసినా పీకే_లేదు.. ఓ నెటిజన్ కామెంట్నీ అతి చేష్టలు , నీవు ఏ మాత్రం నమ్మదగినవాడివి కావు అని అన్ని పార్టీలకు తెలుసు. నీవు నరసాపురం మొఖం చూడక ఐదేళ్లు. నీవు ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఓడిపోతావ్ అని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే కా కమ్మ మీడియా ఈనాడు జ్యోతి TV5 నిన్ను వాడుకున్నాయి. కానీ నీవేమో నేను పెద్ద తోపు కాబోలు అనుకున్నావ్ ఆక్ పాక్ కరివేపాక్ క్లబ్బులో .. శాశ్వత సభ్యునిగా నీకు మెంబెర్ షిప్ ఇచ్చాడు చంద్రబాబురఘురామరాజుకు టికెట్ ఇవ్వని టీడీపీ. నర్సాపురం బీజేపీ సీటు వర్మకు ఇచ్చారు. కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదని పడి ఏడుస్తోంది టీడీపీ అను కుల భజన మీడియా ఈనాడు జ్యోతి TV5. 2014లో కూడా టీడీపీ టికెట్ ఇవ్వలేదు రఘురామరాజు2019 లో వైఎస్సార్సీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచినా పని చేసింది మాత్రం టీడీపీ కోసంబాబు కళ్ళలో ఆనందం కోసం.. నిత్యం రెడ్లను తిడుతూ కమ్మోళ్లను పొగుడుతూ గడిపాడు 5 ఏళ్ళు ఇప్పుడు సమ్మగా కమ్మ గ ఉందంట.. బాగా తీరింది దూలఅంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. ముంతమామామిడి పండన్నాడే గంగరాజు..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ...నర్సాపురారం సీటు నాదే అని బాబు పవన్ ల ముందు ప్రకటించుకున్నాడు బిల్డప్ రాజు అయినా తగ్గడంట!అదేం చిత్రమో.. కోరుకున్న టికెట్ దక్కకున్నా.. రఘురామ రాజు ‘బేస్’లో వాయిస్ మాత్రం తగ్గలేదు. ఏమున్నా ప్రజల్లో తేల్చుకుంటానంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రఘురామ ప్రకటించడాన్ని విడ్డూరంగా భావించాల్సిందే. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా.. పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంపై RRR ఒక వీడియో విడుదల చేశారు. కాలే కట్టేతో లోలోపల రగిలిపోతూనే.. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంగా లేనంటూ డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా విజయం సాధించారంటూ సీఎం జగన్‌పై నెపం నెట్టే యత్నమూ చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా సీఎం జగన్ తనకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగారనేది రఘురామ రాజు ప్రధాన ఆరోపణ. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదని వ్యాఖ్యానించిన రఘురామ.. బీజేపీ అధిష్టానం కూడా అది గుర్తించే టికెట్ వేరే వాళ్లకు ఇచ్చిందేమో!. అయితే ఇంత మాట్లాడి.. ఆఖరికి చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం పర్చడం ఇంతకాలం సాగిన కుట్రను మరింత బలపర్చిందని ఏపీ ప్రజలు గుర్తించరంటారా?.. :::సాక్షి వెబ్ పొలిటికల్ డెస్క్ -
ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది : సీఎం వైఎస్ జగన్
-
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా,దత్తపుత్రుడి పార్టీను రౌడీసేనగా మార్చేశారు : సీఎం జగన్
-
సీఎం జగన్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు : సీదిరి అప్పలరాజు
-
సీఎం రాకతో నర్సాపురం రూప రేఖలు మారబోతున్నాయి : ప్రసాద రాజు
-
నరసాపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే.. నెరవేరుస్తారు : మంత్రి కారుమూరి
-
నరసాపురంలో నవశకం..
-
రేపు నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం వైఎస్ జగన్ చెప్పారంటే..చేస్తారంతే..
-
అభిమాని అత్యుత్సాహం: పవన్ కళ్యాణ్‌కు తప్పిన పెను ప్రమాదం
-
నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..
నక్కపల్లి: మండలంలో నీలకుండీల నర్సాపురంలో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మరణించిన గుబ్బల నాగమణిది హత్యేనని సీఐ నారాయణరావు, ఎస్ఐ డి.వెంకన్నలు తెలిపారు. బుధవారం వారు నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించాడు. కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావులు నర్సాపురంలో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు గ్రామంలో ఒక భూస్వామికి చెందిన తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవిస్తున్నారు. అంతేకాకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి వచ్చి, నాగమణిని వేధిస్తుండేవాడు. గత నెల31న కూలిపనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదించాడు. ఒకటో తేదీన నాగమణి కూలి డబ్బుల విషయమై ఆరా తీసింది. అతను సరైన సమాధానం చెప్పక పోగా మద్యం సేవించి వచ్చి ఆమెను హింసించాడు. తన వ్యసనాలకు అడ్డంకిగా మారిందని ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పీక నులిమి, నోటిలో గుడ్డలు కుక్కి నాగమణిని హత్యచేశాడు. నాగమణి చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విచారణలో నాగమణిని హత్య చేసింది లక్ష్మణరావేనని తేలిందని, అతను నేరాన్ని అంగీకరించాడని సీఐ, ఎస్ఐలు తెలిపారు. లక్ష్మణరావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం -
సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది. –కొప్పినీడి విజయమోహన్ -
నరసాపురం మండలం పెద్ద మైనవానిలంకలో విషాదం
-
నీట్లో మెరిసిన తెలుగుతేజం
సాక్షి, నరసాపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్హత ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో నరసాపురం చినమామిడిపల్లికి చెందిన జొన్నల బాల శివరామకృష్ణ ద్వితియ ర్యాంక్ సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన శివరామకృష్ణ ఓపెన్ కేటగిరిలో 26వ ర్యాంకును కైవసం చేసుకుని ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్‌లో సిటును దక్కించుకున్నాడు. నీట్ మొత్తం 720 మార్కులకు గాను శివరామకృష్ణ 705 మార్కులు సాధించాడు. నర్సాపురంలోని మత్స్యపురి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: నీట్లో తెలుగుతేజం) -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో ఉంటూ..'
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం నరసాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు. సీఎం జగన్ భారత రాజ్యాంగానికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్వార్ధంతో కాదని ముందుగా గమనించాలి. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ ఎవరిని మభ్య పెట్టలేదు.. బహిరంగంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వెన్నుపోటు పొడిచారు.. మోసం చేశారు.. అనే అర్హత చంద్రబాబుకు లేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వెన్నుపోటు దారుడుకు అర్హత గల వ్యక్తి చంద్రబాబు మాత్రమే. వెన్నుపోటు పొడిచే విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారు. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది' అంటూ సుబ్బారాయుడు పేర్కొన్నారు. (దమ్ముంటే రాజీనామా చేయాలి) -
‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’
సాక్షి, పశ్చిమ గోదావరి: భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నరసాపురం ఘటన తనను కలచివేసిందని, తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం అన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చేవరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి అదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, పిల్లలిద్దరిని తణుకు బాలసదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు.(చదవండి: గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం) -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
వైఎన్ కళాశాలకు అరుదైన గుర్తింపు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నరసాపురం వైఎన్ కళాశాల స్థాయి పెరిగింది. మెంటారు కళాశాలగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దీనిని గుర్తించింది. యూజీసీ దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి రూపొందించిన పరామర్ష్ పథకానికి వైఎన్ కళాశాలను ఎంపిక చేసింది. దేశంలో మొత్తం 167 కళాశాలలను ఈ పథకానికి యూజీసీ ఎంపిక చేసింది. రాష్ట్రంలో 10 కళాశాలలు, తెలంగాణలో 4 కళాశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని 10 కళాశాలల్లో జిల్లాకు సంబంధించి ఒకటి వైఎన్ కశాశాల కాగా, రెండోవది ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల. కొన్ని జిల్లాల్లో కళాశాలలకు, యూనివర్సటీలకు ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కళాశాలలోని మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, ప్రొఫెసర్ల సామర్థ్యం, గత చరిత్ర తది తర అంశాలను పరిగణలోకి తీసుకుని వైఎన్ కళాశాలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎన్ కళాశాల నాక్ ఏ గ్రేడ్‌ను మూడుసార్లు సాధించింది. డీమ్డ్ యూనివర్సిటీకి మార్గం సుగమం వైఎన్ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం సాగుతోంది. మెంటారు కళాశాలగా గుర్తింపు దక్కడం ద్వారా దీనికి మార్గం సుగమం అయ్యిందని కళాశాల ఇన్చార్జ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోలిశెట్టి రఘురామ్, ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం మహేశ్వరి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్లు డాక్టర్ కె.నాగేశ్వరరా వు, డాక్టర్ గంధం రామకృష్ణ ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా గుర్తింపుతో రూ.30 లక్షలు గ్రాంట్ వస్తుందన్నారు. తమ కళాశాల ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు కళాశాలలను ఎంపిక చేసుకుని వాటికి నేక్ గుర్తింపు వచ్చేలా కృషిచేయాలన్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని చెప్పారు. తాము భీమవరం వబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి కళాశాల, తాళ్లపూడి కలిదిండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు దీప్తి కళాశాల, అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, లక్కవరం అల్లూరి వరలక్ష్మి కళాశాలను ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్ చినిమిల్లి శ్రీనివాస్, ట్రెజరర్ పొన్నపల్లి శ్రీరామారావు పాల్గొన్నారు. -
మత్స్యసిరి.. అలరారుతోంది
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది. రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల పంట పండుతోంది. బోట్లు మత్స్యసిరితో నిండిపోతున్నాయి. సాదారణంగా వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లిన బోటు చేపలతో నిండడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా ఇలా వేటకు వెళ్లినబోటు అలా నాలుగైదు రోజుల్లోనే తీరానికి చేరుకుంటోందని మత్ప్యకారులు చెబుతున్నారు. గత నెలరోజుల్లోనే తీరంలో దాదాపు రూ.300 కోట్ల విలువచేసే మత్స్యసంపద దొరికినట్టు అంచనా. గత ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున చేపలు దొరికాయి. కానీ గత ఏడాదికి మించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎలాంటి విపత్తులూ లేకుండా ప్రకృతి కూడా కరుణించడంతో ముమర్మంగా వేటసాగుతోంది. ప్రస్తుతం తీరంలో వందల సంఖ్యలో మెకనైజ్డ్బోట్లు, ఫైబర్‌బోట్లు వేటసాగిస్తున్నాయి. మరెక్కడాలేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ తీరంతో సహా మరెక్కడా లేని విధంగా నరసాపురం తీరంలోనే అపార మత్స్య సంపద లభిస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల వరదనీరు సముద్రంలో కలుస్తుండడంతో నీటిపోటుకు మత్స్యసంపద పైకితేలుతోందని, అందుకే భారీగా వలలకు దొరకుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదికాక ఎగువప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా, నరసాపురం తీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సముద్రగర్భం ఇబ్బందికరంగా మారడంతో జలచరాలు పైకితేలడం వల్లే సులువుగా వలలకు చిక్కుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల్లో రూ 300 కోట్లపైనే వ్యాపారం కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవలే జూన్ 15వ తేదీతో వేట నిషేధ కాలం ముగిసింది. వేట నిషేధం గడువు ముగిసి నెల దాటింది. నరసాపురం తీరంలో ఈ నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపద లభించినట్టు సమాచారం. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలూ దొరుకుతున్నాయి. ఈ రొయ్యిలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబయ్, పూణెల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాల బోట్లూ హల్చల్ నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు తరలి వస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ తీరంలో 150 నుంచి 200 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి. ఎగుమతులు పెరిగాయి మత్స్య ఎగుమతులు భారీగా పెరిగాయి. నెలరోజుల నుంచి నరసాపురం తీరంలో రూ.వందల కోట్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఈ సీజన్లో పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే గత సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో దిగుబడి పెరిగింది. సందువా, సొర లాంటి రకాల ఎగుమతులు పెరిగాయి. – మేకల సతీష్, ఆక్వా వ్యాపారి ఇతర జిల్లాల బోట్లు వస్తున్నాయి నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట సాగుతోంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బోట్లు వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా అన్ని బోట్లుకు చేపలు పడుతున్నాయి. సాధారణంగా జూలైలో తుపాన్ల ప్రమాదం ఉంటుంది. వేట సవ్యంగా సాగదు. ఆ ఇబ్బంది కూడా ఈ సారి లేకపోవడంతో వేట లాభసాటిగా మారింది. – పీతల ప్రసాద్, బోటు యజమాని -
అరెస్ట్ చేశారు.. చార్జిషీట్ మరిచారు
సాక్షి , ఏలూరు, నరసాపురం: జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసు విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏడాది తర్వాత కూడా చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని అప్పటి పోలీసు అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు లేవు.‘దంగేటి శ్రీగౌతమిది పక్కా హత్య. అది యాక్సిడెంట్ కాదు. ఈ కేసులో ఇప్పటివరకూ సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉంది.’ ఇది శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు అప్పటి పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్ 2018 జూన్ 26న చెప్పిన మాట. అయితే అప్పటి నుంచి కేసు పురోగతి ఏమీలేదు. మరి సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిం ది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీగౌతమి హత్య కేసు దర్యాప్తు తీరుపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసు చర్యలు నామమాత్రంగాగే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాదం మాటున పక్కా ప్లాన్‌తో శ్రీగౌతమిని టీడీపీ నేత, మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జి హత్య చేయించినట్టుగా పోలీసులు తేల్చారు. కేసులో నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ ఏ–3 నిందితుడిగా ఉండటంతో ఈ హత్యకేసు అప్పట్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ ఘాతుకం వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగింది. దర్యాప్తు సగమే అయ్యిందని పోలీసులు చెప్పడంతో మున్ముందు అసలు పెద్దలు తెరమీదకు వస్తారని అంతా అనుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి చార్జిషీట్‌ను పోలీసులు ఇప్పటివరకూ దాఖలు చేయలేదు. కేవలం ప్రిలిమినరీ చార్జి్జషీట్ను కోర్టుకు సమర్పించి ఊరుకున్నారు. పోలీసులు చేసిన కొత్త దర్యాప్తు ఏమిటి? 2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థులు అందోళనలు చేసినా కూడా అది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కుండబద్దలు కొట్టారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జా బుజ్జి, ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం నేత కావడం, స్థానికంగా అదే సామాజికవర్గానికి చెందిన కొందరు బడా వ్యక్తులు అండ ఉండటంతోనే పోలీసులు కేసును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు అదేమీ పట్టించుకోలేదు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీబీసీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీబీసీఐడీ దర్యాప్తు సాగించి ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావుడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ–1, ఏ–2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌తో పాటు ఏ–3గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూను జూన్ నెల 26న అరెస్ట్ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మ ణ్ను, పతకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సందీప్, దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. ముందు ప్రమాదమని చెప్పి, తరువాత అది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని చెప్పడం తప్ప. ఇంకా నీరుగార్చే ప్రయత్నమేనా.. ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. అయినా కూడా ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో ఉన్న పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి పోలీసుశాఖ అందిరిని సస్పెండ్ చేస్తుందని భావించారు. ఈకేసులో పావని పోరాటం చాలాకాలం కొనసాగించింది. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న సజ్జా బుజ్జితో పాటు మిగిలిన నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు అందుతున్నాయని పావని జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేయడం కూడా సంచలనం కలి గించింది. తాను స్కూటీపై వెళుతుండగా సజ్జా బుజ్జి కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడని నెలరోజుల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి, ఇటీవల బదిలీ అయిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి పావని విన్నవించింది. అయితే బుజ్జిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ చెప్పారని, ఈ కేసులో కనీసం కలవడానికి కూడా నరసాపురం డీఎస్పీ అవకాశం కలిపించడం లేదని పావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొంతమంది టీడీపీ అనుకూల పోలీసు ఉన్నతాధికారులు బుజ్జి వెనుక ఉండి తనకు అన్యాయం చేస్తున్నారని పావని ఆరోపిస్తోంది. -
అశ్లీల వీడియోల కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి,పశ్చిమ గోదావరి : అశ్లీల వీడియోలు వాట్సాప్‌లో వైరల్ చేసిన ఆగిశెట్టి సాయి భరత్ కేసులో శుక్రవారం మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు ప్రెస్మీట్లో తెలిపారు. సెక్స్ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఆగిశెట్టి గోపినాథ్, గుత్తుల నాగ సత్తిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిద్దరి నుంచి రెండు సెల్ఫోన్లు, మెమోరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. -
ఆకలి..‘ అల’మట
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : సుముద్రంలో వేట నిషేధం గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. 61 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గంగపుత్రులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలోకి అడుగుపెట్టనున్నారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతూ ఉంటుంది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు ఆకలితో అలమటించారు. మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు. బోట్లను సముద్రంలోకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సవ్యంగా వేట సాగాలని గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ వేటకు సన్నద్ధమవుతున్నారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండే నరసాపురం తీరంలో మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 100 వరకూ బోట్లు రోజూ వేట సాగిస్తాయి. వేట నిషేధ సమయం ముగియడంతో బోట్లు ఒక్కొక్కటీ చేరుకుంటున్నాయి. గతేడాది కష్టాల వేట నిజానికి గత ఏడాది వేటకు ప్రకృతి సహకరించింది. తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు పెద్దగా చుట్టుముట్టలేదు. అయినా వేట సవ్యంగా సాగలేదు. మత్స్యసంపద ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా పెద్దగా మత్స్య సంపద లభ్యంకాకపోవడంతో జాలర్లు దిగాలు పడ్డారు. అంతకు ముందు రెండు సంవత్సరాలు 2017, 2018లలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా రావడంతో మత్స్యకారులకు వేట విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అందని వేట నిషేధ సాయం నరసాపురం తీరంలో వేట నిషేధ సాయాన్ని గతపాలకులు అరకొరగా అందించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేట నిషేధ కాలంలో 2017లో కేవలం 104 మందికి సాయం అందించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం 2018లో 173 మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ. 4వేలు చొప్పున అందించింది. ఈ ఏడాది 375 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే వేట నిషేధ సమయం ముగిసినా ఇంకా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించలేదు. ఎన్నికల సమయం కావడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.నిజానికి 19 కిలో మీటర్ల మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దాదాపుగా 2వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని బతుకుతున్నారు. వారిలో పెద్దబోట్లపై పనిచేసేవారి సంఖ్య 700 వరకూ ఉంటుంది. కేవలం 375 మందిని ఎంపికచేసి మత్స్యశాఖ చేతులు దులుపుకోవడంపైనా మత్స్యకార సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పైనే ఆశలు అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనపైనే గంగపుత్రులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ కలిసొస్తే బాగుండు వేట లేకపోవడంతో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వేటకు వెళుతున్నాం. మంచి సీజన్. చేపలు ఎక్కువగా పడతాయి. ఈ ఏడాది బాగుంటుందని అనుకుంటున్నాం. తుపాన్లు పట్టకపోతే నాలుగు డబ్బులు వస్తాయి. దేవుడిపై భారం వేసి వేటకు వెళుతున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశ. – మైలా శ్రీనివాస్, బోటు కార్మికుడు, పెదమైనవానిలంక సొమ్ము త్వరలో జమ ఈ ఏడాది రూ.4 వేలు సాయం 375 మందికి ఇస్తున్నాం. గత ఏడాది 173 మందికే ఆర్థిక సాయం అందించాం. ఈ ఏడాది బోట్ల సంఖ్య పెరగడంతో లబ్ధిదారులు పెరిగారు. పెద్దబోట్లపై పని చేసే వారికే రూ.4 వేల సాయం అందుతుంది. సాయం రూ.4వేలు ఇస్తారా? రూ.10 వేలు పెంచి ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. – కె.రమణకుమార్, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
వద్దంటే వినరే..!
సాక్షి, నరసాపురంరూరల్: వారపు సంతల నుంచి బస్టాండ్ల వరకు ఎవరి వద్ద చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉన్నా వాటి అమలు మాత్రం కాగితాలకే పరిమితమవుతుంది. పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం అవగాహన కరువైంది. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వినయోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి అవగాహన కల్పిస్తే వాటి వాడకాన్ని తగ్గించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలు అయితే కొద్ది రోజులకు వస్త్రాలయితే కొద్ది నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ కవర్లు మాత్రం ఏళ్లు గడిచినా కరగవు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయకపోవడంతో వాటి వాడకం రోజురోజుకూ పెరిగిపోతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. 2012లోనే ప్లాస్టిక్ వాడకం నిషేధించినట్లు ప్రకటను వచ్చినప్పటికీ ప్రస్తుతం అవి (ప్లాస్టిక్ వ్యర్థాలు) ఆక్రమించే స్థలం సాధారణ చెత్త కంటే అధికంగా ఉంటుంది. దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లలో సరుకులు తీసుకుని అనంతరం వాటిని ఎక్కడ బడితే అక్కడ పారవేస్తున్నారు. ముఖ్యంగా మురికి నీటి కాలువల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లే ఉండడంతో అవీ కాస్తా నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకాలను తగిచడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. ప్లాస్టిక్ కవర్లకు బదులు పేపర్ బ్యాగులు వాడుకలోకి తీసుకురావాలని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అవగాహన కల్పించడంలో విఫలం ప్లాస్టిక్ కవర్లు నియంత్రించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారు. ఒక్కోసారి గ్రామాల్లో సైతం ఇంటింటికీ ప్రచారం నిర్వహించడంతోపాటు పలువురు కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపిన్లు జరిపిన సందర్భంలో ర్యాలీలు నిర్వహించడం, పంచాయతీ వారు టాంటాం వేయడం, అన్నీ జరిగాయి. అయితే నిషేధం అమలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. - ముద్దాల ప్రశాంతి, లక్ష్మణేశ్వరం అవగాహన కల్పించాలి ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి ఎంతో ముప్పు అని మేధావులు, అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే తరచూ వ్యాపారస్తులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లనే వినియోగించడం పరిపాటిగా మారింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, సమతుల్యత లోపించడం వంటి వాటికి కవర్ల వినియోగం ప్రధాన కారణమని చెపుతున్నప్పటికీ ఎవరూ వినే పరిస్థితి లేకపోవడం దారుణం. పర్యావరణానికి ముప్పు కలిగించే కవర్ల నిషేదంపై శ్రద్ధ చూపాలి. – కడలి ఆదినారాయణ, నరసాపురం -
నాగబాబుకి ఓటు వేయకండి : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్ కల్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది, నర్సాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?. భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా?. నర్సాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నర్సాపురం వెళ్లి సేవ చేస్తావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు. -
టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్ షర్మిల
సాక్షి, నరసాపురం: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే.. పవన్ కల్యాణ్ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తారని వైఎస్ షర్మిల జోస్యం చెప్పారు. 2019 రాజకీయ సినిమాలో యాక్టర్ పవన్ కల్యాణ్ అయితే డైరెక్టర్ చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సాపురంలో వైఎస్ షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ..‘ ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ ఉండేది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని వైఎస్సార్ శ్రమించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్ ప్రతి ఒక్కరికి మేలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే. అందుకే ఆ మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్నా కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు. చంద్రబాబు అవినీతి, అరాచకానికి, వెన్నుపోటుకు, దౌర్జన్యానికి మారుపేరు. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేస్తాడు. మాట తప్పుతాడు. హామీ ఇచ్చిన మొదటి సంతకానికే దిక్కులేకుండా చేశాడ’ని విమర్శించారు. ఎన్నికల వేళ పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడని అక్క చెల్లెమ్మలు మోసపోవద్దని కోరారు. ఇంతకు ముందు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీకి కూడా సరిపోలేదని విమర్శించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నాడని, ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేటు ఆసుపత్రులను తొలగించాడని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం పోలవరం తానే కడతానన్నారు జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కట్టాలి.. కానీ కమీషన్ల కోసం తానే కడతానంటూ పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేశాడు.. పైపెచ్చు రూ.60 వేల కోట్ల మేర అంచనాలు పెంచుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో రాజధాని కట్టే అనుభవం ఉందని ఓట్లు వేయించుకున్నాడు... అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇస్తే ఒక్క పర్మినెంటు బిల్డింగ్ కూడా కట్టలేదని విమర్శించారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని నారా లోకేష్‌కు ఏం అర్హత ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కొత్త పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వైఎస్ జగన్ వల్లే ఇప్పటికీ సజీవంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబేనని, వాళ్లు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందీ చంద్రబాబేనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, మేము సింగిల్‌గానే పోటీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రైతుకు మే నెలలో రూ.12,500 వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500, పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఇస్తామని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు నాలుగు దఫాల్లో పూర్తి రుణం మాఫీ చేసి, తిరిగి సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఏడాది మెస్ ఖర్చులకు గానూ రూ.20 వేలు చెలిస్తామన్నారు. పార్టీ పెట్టిన మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్న నరసాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు, ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణంరాజుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్ షర్మిల
-
‘30 ఏళ్లు సైకిల్ తొక్కినా ఫలితం లేదు’
సాక్షి, నరసాపురం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆరోపించారు. బుధవారం నరసాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ల అరిగిపోయాయే తప్ప తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. మాల, మాదిగలం ఏకమై జగనన్నను సీఎం చేసే వరకు నిద్రపోమని అన్నారు. ముదునూరి ప్రసాదరాజు, రఘురామకృష్ణంరాజులను నరసాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తానని టీవీ రామారావు తెలిపారు. -
నరసాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాదరాజు ప్రచారం
-
మొగల్తూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ప్రసాదరాజు ఏన్నికల ఫ్రచారం
-
నెరవేరని రాజన్న ఆశయం
సాక్షి, మొగల్తూరు (పశ్చిమ గోదావరి): నాలుగు గ్రామాల ప్రజలకు తాగు నీరందిస్తానని దివంగత నేత తీర ప్రాంత ప్రజల గుండెలోల చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2009 జనవరిలో మండలంలో పర్యటించిన సందర్భంలో రూ.33 కోట్లతో మొగల్తూరులో భారీ మంచి నీటి ప్రాజెక్టుకు దివంగత నేత హామీ ఇచ్చారు. ఆయన అకాల మృతి అనంతరం ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న నాదుడు లేడు. రూ.13 కోట్లతో చేపట్టిన పనులు రూ.13 కోట్లు వెచ్చించి సుమారు 30వేల మంది ప్రజల దాహర్తి తీర్చేందుకు ఉద్దేశించి మొగల్తూరు గొల్లగూడెంలో తవ్విన చెరువు. పంచాయతీకి చెందిన చెరువునే ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి చెరువు చుట్టూ రివిట్ మెంట్ కట్టారు. అయితే నాలుగు గ్రామాలకు తాగు నీరందించాల్సి ఉండగా కేవలం మొగల్తూరుకు తప్ప ఏ గ్రామానికి అందదు. నాలుగు గ్రామాలకు తాగునీరు మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు సుమారు 40 శివారు ప్రాంతాలకు తాగు నీరందించేందుకు రూ. 13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టును సుమారు 20 ఎకరాల్లో నిర్మించేందుకు భూసేకరణకు ప్రయత్నించినా పనులు పూర్తి కాలేదు. అయితే నిధులు మురుగుపోతున్నాయనే ఉద్దేశంతో మొగల్తూరు పంచాయతీ ప్రాజెక్టు చెరువుతోపాటు పంచాయతీకి చెందిన మరో రెండు చెరువులు కలుపుకుని తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా మొగల్తూరులోని పాలకమ్మ చెరువు రోడ్డులో గల కోమటి చెరువులో నీటిని నిల్వ చేసి గొల్లగూడెం చెరువు ద్వారా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్‌లు ద్వారా నీరందించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పూర్తి కాని పైప్‌లైన్ పనులు ఇక ఫిల్టర్ అయిన నీటిని ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రిజర్వు చేసుకుని పైప్‌లు ద్వారా గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న రామన్నపాలెంలో 8, మొగల్తూరులో 7, శేరేపాలెంలో 3, కొత్తపాలెంలో 2 ఓహెచ్‌ఆర్‌లు ద్వారా అందించాల్సిన పైప్‌లైన్ పనులు పూర్తికాలేదు. శేరేపాలెంలో పైప్‌లైన్ పనులు పూర్తిఅయినా నీరందటంలేదు. కొత్తపాలెం గ్రామంలో మాత్రం కొద్దిగా వస్తున్నాయని, నాసిరకం పైపులు కారణంగా నీరందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రామన్నపాలెం గ్రామంలో కొంతమేర పైప్లైన్లు వేసి వదిలేయడంతో ఆగ్రామానికి పూర్తిగా నీరు సరఫరా కావడంలేదు. కేవలం మొగల్తూరు గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో నీరందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి ప్రాజెక్టుపై పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఈ సారి సమస్యలను తీర్చే నాయకుడునే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు. తాగు నీరందడం లేదు మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరందడంలేదు. గ్రామంలోని పంచాయతీ చెరువు ఉన్నా తాగేందుకు పనికి రావడంలేదు. దీంతో రోజూ కొనుక్కుని తమ దాహాన్ని తీర్చుకుంటున్నాం. – ఏగి రాజశేఖర్, శేరేపాలెం నాసిరకంగా పనులు ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో చిన్న దెబ్బతగిలినా పైపులు పగిలి పోతున్నాయి. కాంట్రాక్టరు అధికారం పక్షానికి దగ్గిర వ్యక్తి కావడంతో పనులు నాసిరకంగా పూర్తిచేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. – కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపాలెం ఇప్పటికీ మాకు నీరందదు మొగల్తూరు భారీ ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి కూడా నీరందిస్తామని దివంగత నేత ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ మాగ్రామానికి పైప్ లైన్ పనులు పూర్తి చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తేనే మాకు నీరు అందుతుంది. – కాటూరి చంద్రమోహన్, రామన్నపాలెం జగన్ రావాలి – తాగు నీరందాలి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞం పథకంలో మంచి నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. మా గ్రామానికి స్వచ్ఛమైన నీరందాలంటే జగన్ రావాలి, తాగు నీరందాలి. – కొత్తపల్లి బాబి, శేరేపాలెం -
చంద్రబాబు నన్ను మోసం చేశాడు..
సాక్షి, నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామం. మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం ఆయన రాజీనామా పత్రాలపై తన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నన్ను, నా ప్రజలను నమ్మించి మోసం చేశాడు. కనీసం నన్ను సంప్రదించకుండా నర్సాపురం సీటు కేటాయించడం చాలా బాధాకరం. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధలేదు. కానీ నమ్మకద్రోహం చేయడం నా ప్రజలు ఆవేదన చెందారు. నాతో పాటు పదిమంది కౌన్సిలర్లు, వేలాదిమంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నాం. చదవండి...(వైఎస్ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు) వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా.’ అని స్పష్టం చేశారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న (ఆదివారం) వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం విదితమే. -
వైఎస్ జగన్‌ను కలిసిన కొత్తపల్లి
సాక్షి, హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... వైఎస్ జగన్‌తో ఏకాభిప్రాయం కుదిరింది. నరసాపురం కార్యకర్తల సమక్షంలో నా నిర్ణయం ప్రకటిస్తా. మేము మాట్లాడుకున్న విషయాలను కార్యకర్తల మధ్యలో చెబితేనే బాగుటుంది. మా నియోజకవర్గంలో మా కార్యకర్తలు, నాయకులకు సమక్షంలో తెలియచేస్తాను’ అని తెలిపారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నరసాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తానని చివరి వరకూ నమ్మించి మోసం చేశారు. దీంతో ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు, టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌తో కొత్తపల్లి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, గిరిజన నాయకుడు శంకర్ నాయక్, మచిలీపట్నంకు చెందిన మాధవిలతా తదితరులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
నరసాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ముదునూరి నామినేషన్
-
వంతెనకు.. నయ వంచన
సాక్షి, నరసాపురం : వశిష్ట వంతెన.. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వశిష్ట గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలన్నది బ్రిటీష్ హయాం నుంచి ఉన్న డిమాండ్. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నేతలు జిల్లాలో మొదటిగా ప్రస్తావించే అంశం. గత 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వశిష్ట వంతెన విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హడావుడి తప్ప మరొకటి జరగలేదు. వంతెన మంజూరైందంటూ టీడీపీ నేతలు అనేకసార్లు స్వీట్లు పంచుకున్నారు గానీ ప్రజలకు మాత్రం తీపి కబురు రాలేదు. 2016 ఫిబ్రవరి 18న నరసాపురం పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి వంతెన విషయంలో టీడీపీ నేతల హైడ్రామా మొదలైంది. హార్బర్ నిర్మాణానికి రూ.1,800 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా అదే నెలలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మరో ప్రకటన వచ్చింది. డ్రెడ్జింగ్ హార్బర్ నిధుల్లో రూ.200 కోట్లు ఖర్చు చేసి ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని ఒప్పించారని స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పుకొచ్చారు. నితిన్గట్కరీకి ఈ మేరకు చంద్రబాబునాయుడు రాసిన లేఖంటూ ఓ లెటర్‌ను కూడా పత్రికలకు విడుదల చేశారు. ఇంకేముంది కేంద్రం సహకారంతో కలల వారధి ఈ సారి కచ్చితంగా నిర్మాణం జరిగి తీరుతుందని అందరూ భావించారు. వంతెన నిర్మాణం జరుగుతుందంటూ టీడీపీ నాయకులు గోదావరి రేవు వద్ద మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చారు. 18 నెలల తరువాత మరో డ్రామా ఇదంతా జరిగిన తరువాత సీన్ కట్ చేస్తే మరో 18 నెలలకు ఉభయగోదావరి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ వెళ్లింది. ఇదే కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని కలిశారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం, వంతెనకు నిధుల మళ్లింపు అంశాన్ని పక్కకు పెట్టారు. చించినాడ నుంచి నరసాపురం మీదుగా 216 జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, సఖినేటిపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేసి, సఖినేటిపల్లి నుంచి నరసాపురంలో 216కు అనుసంధానం చేయాలని, నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని వినతిపత్రం ఇచ్చారు. దీనికి నితిన్‌గట్కరీ ఒప్పుకున్నారని, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో సహా ఢిల్లీ వెళ్లిన బృందంలోని నాయకులు చెప్పారు. 1986లో వంతెన నిర్మాణానికి బీజం నరసాపురం వశిష్ట వంతెన అనేది దశాబ్ధాల పోరాటం. బ్రిటిష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. మొదటిగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో అప్పటి మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ వంతెన పనులకు శంకుస్థాపన చేసి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.194 కోట్లతో టెండర్లు నరసాపురం వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. 2008 ఏప్రిల్ 15న వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. రూ.194 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలన్నీ పూర్తి చేసిన వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అయితే వైఎస్ వేరే కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందడం జరిగింది. మైటాస్ వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు పాదయాత్రలో జగన్ హామీ గత మే నెలలో నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో మొదటగా వంతెన విషయాన్నే ప్రస్తావించారు. వశిష్ట వంతెన నిర్మాణంలో ముఖ్యమంత్రి సినిమా చూపిస్తున్నారని, ఆ సినిమాకు తాను అధికారంలోకి రాగానే తెరవేస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రారంభించిన వంతెన పనులు పూర్తి చేసి చూపిస్తానన్నారు. -
నా మనసులో, ఇంట్లో వైఎస్సార్ ఉన్నారు..
సాక్షి, నర్సాపురం : రాష్ట్రంలో ఓటు పరిస్థితి ఎలా ఉందంటే బహరంగ సభకు హాజరైనవాళ్లు తమ జేబులో పర్సు ఉందో, లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు చూసుకోవాల్సి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శనివారం భీమవరం నియోజకవర్గ ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నాకు ఎంతో స్నేహభావం ఉంది. నా మనసులో, ఇంట్లో వైఎస్సార్ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డికి మాకు ఉన్న అనుబంధం ఎంతంటే ...నా మనవడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టడమే. వైఎస్సార్ కుటుంబాన్ని బలోపేతం చేయవలసిన బాధ్యతలు ఒక కుటుంబసభ్యుడిగా నాకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగువేల కిలోమీర్టల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రపంచంలో ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి. మన అందరం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావలసినదే..’ అని అన్నారు. -
మెడపట్టి గెంటేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం రూరల్(పశ్చిమగోదావరి): ఎస్సీ యువకులపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఓ యువకుడిని మెడపట్టి గెంటేశారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని సరిపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెండు రోజుల నుంచి హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నరసాపురం మండలం సరిపల్లి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం. ఇక్కడ గత పాలకుల హయాంలోనే పంచాయతీకి నూతన భవనం నిర్మించారు. అయితే ఈ భవనం ఎస్సీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఉండటంతో ఎమ్మెల్యే మాధవనాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీ కార్యాలయాన్ని తమ సామాజికవర్గం ఉన్న ప్రాంతానికి మార్చాలని యత్నించారు. దీనిలో భాగంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి గతేడాది జూలైలో శంకుస్థాపన చేశారు. ఎస్డీఎఫ్, ఉపాధిహామీ నిధులు రూ.37.50లక్షలతో ఈ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో శంకుస్థాపన సందర్భంలోనూ రెండు కులాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అయినా ఎమ్మెల్యే మొండిగా కొత్త పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కొత్తభవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మాధవనాయుడు పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు గమిడి మధుబాబు, మైలాబత్తుల కృష్ణంరాజు తదితరులు భవన నిర్మాణ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ప్రారంభించడం తగదని ఎమ్మెల్యేకు వివరించే యత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మాధవనాయుడు కోపంతో ఊగిపోతూ ఆ ఎస్సీ యువకులను మెడపై చేయివేసి బయటకు గెంటారు. ఈ పరిణామం నుంచి ఎస్సీ యువకులు తేరుకునేలోపే రూరల్ఎస్సై మూర్తి, తెలుగుదేశం చోటా నాయకులు ఒక్కటై వారిని ఈడ్చి పక్కకు లాగేశారు. ఈ పెనుగులాటలో యువకుల దుస్తులూ చిరిగాయి. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే ఎమ్మెల్యే తన అధికారదర్పాన్ని ప్రదర్శిస్తూ కొత్తపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల ఆందోళన ఎమ్మెల్యేకు తీరుకు వ్యతిరేకంగా ఎస్సీ యువకులు గ్రామస్తులతో కలిసి నరసాపురం-భీమవరం రోడ్డుపై బైఠాయించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఈ యువకులు రూరల్‌పోలీసు స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే, టీడీపీ చోటా నాయకులు, రూరల్ ఎస్సై తదితరులు తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు. అంతే కాకుండా ఎమ్మెల్యే మాధవనాయుడు తమను కులంపేరుతో దూషించారని ఆయనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన వారిలో మైలాబత్తుల రాజ్‌కుమార్, కేదాసు స్వరాజ్యకుమార్, మైలాబత్తుల కుటుంబరావు, ఏలూరి చంటి, ఉండ్రు స్టాలిన్, పి వెంకట్రావు, ఎం శరత్ తదితరులు ఉన్నారు. -
నరసాపురంలో రావాలి జగన్ కావాలి జగన్
-
లోకేష్ మన నెత్తిన ఎక్కేవారా?: పవన్ కల్యాణ్
సాక్షి, నరసాపురం: కులాల మధ్య చిచ్చు పెట్టే వాడిని కాదని... తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీలకు, కాపులకు అన్యాయం చేసింది టీడీపీనే అని చంద్రబాబు నాయుడిని విమర్శించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి నరసాపురంలో ఆయన ప్రసంగిస్తూ.. ఈ జిల్లాకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో టీడీపీ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టింది. కానీ జిల్లాకి టీడీపీ చేసిందేమీ లేదని విమర్శించారు. అరవై ఏళ్ళ క్రితం పూర్తి కావాల్సిన వశిష్ట వారధికి ఈ రోజుకీ దిక్కులేదని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అన్నీ అవినీతిమయంగా తయారయ్యాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుభవం పశ్చిమగోదావరికి ఏమాత్రం పనికి రాలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమలో 15 సీట్లు గెలవకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా.. లోకేష్ మంత్రై మన నెత్తిన ఎక్కేవారా అని ప్రశ్నించారు. మహిళా అధికారుల మీద దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ సమస్యే ఉందని అన్నారు. -
వరుస పెళ్లిళ్లు; ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమం): వరుస పెళ్లిళ్ల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కాకినాడటౌన్–నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–నర్సాపూర్ ప్రత్యేకరైలు (రైలు నెంబరు 07256) ఆగస్ట్ 14వ తేదీ సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 6 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేకరైలు (07255) ఆగస్ట్ 15వ తేదీ రాత్రి 7.30కు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కు హైదరాబాద్ చేరుతుంది. హైదరాబాద్–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07001) ఆగస్ట్ 14, 17వ తేదీలలో రాత్రి 9.05కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కు కాకినాడ టౌన్ చేరుతుంది. కాకినాడటౌన్ –హైదరాబాద్ ప్రత్యేక రైలు (07002) ఆగస్ట్ 15, 19 తేదీలలో రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
నరసాపురం బస్టాండ్ ఎదుట విద్యార్ధులు ఆందోళన
-
శభాష్ పావని..
శ్రీ గౌతమి కిరాయి హత్య ఉదంతంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో టీడీపీ పరువు పూర్తిగా బజారున పడింది. ఈ కేసును పక్కదోవ పట్టించడంలో పోలీసులపై రాష్ట్రస్థాయి నేతల హస్తం ఉందనే ప్రచారానికి బలం చేకూరుస్తూ జరుగుతున్న పరిణామాలు కూడా టీడీపీని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం : ఓ యువతిని టీడీపీ నేత సజ్జా బుజ్జి ప్రమాదం మాటున కిరాతకంగా హత్య చేయించడం, సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఉన్న జడ్పీటీసీ బాలం ప్రతాప్ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా నెపాన్ని పోలీసులపై వేసే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో కేసు విచారణలో పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఇప్పటికే బహిర్గతమయ్యింది. అప్పట్లో విచారణ అధికారులుగా ఉన్న పోలీసులు తప్పు చేసిన విషయాన్ని ఎవరూ కాదనే పరిస్థితిలేదు. అయితే ఎలాంటి పూర్తిస్థాయి విచారణ లేకుండా కేవలం 10 రోజుల్లోనే పోలీసులు కేసు క్లోజ్ చేసే సాహసం చేశారంటే, వెనుక బడా వ్యక్తులు లేకపోతే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఈ అంశాలను పక్కదారి పట్టిస్తూ అప్పటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్ సీఐ, పాలకొల్లు రూరల్ ఎస్సైలపై చర్యలు ఉంటాయని, కేసును డీల్ చేసిన ఏఎస్పీ రత్నకు మెమో జారీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట్లోనే ఈ కేసు విచారణ పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమైతే ఖాయంగా కనిపిస్తోంది. తెరవెనుక వ్యక్తులు ఎవరు పథకం ప్రకారం యువతిని హత్య చేసిన సజ్జా బుజ్జి అండ్ కో ఎలాంటి జంకూ లేకుండా తరువాత ఏడాదిన్నర కాలంగా దైనందిన జీవితాన్ని గడిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ్యాంకాక్ టూర్లకు తిరుగుతూ గడిపారు. పై స్థాయి వ్యక్తుల అండలేకపోతే ఇది సాధ్యంకాదని తెలుస్తోంది. అప్పట్లో విచారణ అధికారులుగా వ్యవహరించిన పోలీసు అధికారులదీ, సజ్జా బుజ్జిది ఒకే సామాజికవర్గం, అదీ సీఎం సొంత సామాజికవర్గం. మంత్రి లోకేష్‌బాబు సిఫార్సులు మేరకే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. అయితే బుజ్జి అండ్‌కో ను పైస్థాయి నాయకుల వరకూ తీసుకెళ్లడానికి స్థానికంగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన ఓ బడా వ్యక్తి సహాయపడినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరికొందరి వ్యవహారాలపై సీఐడీ వద్ద సమాచారం ఉందనే ప్రచారం సాగుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు ఇంకా సగమే పూర్తయ్యిందని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓవైపు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకనే భావనలో పోలీసులు ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అదే విధంగా పోలీసుశాఖ ముందుకెళితే శ్రీగౌతమి వ్యవహారంలో మరికొన్ని కొత్త క్యారెక్టర్లు తెరమీదకు రావచ్చనే ప్రచారం సాగుతోంది. శభాష్ పావని : అక్క చనిపోయింది. తోడుగా ఉన్న తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. తన అక్కది ప్రమాదం కాదని ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ధైర్యంతో ముందుకెళ్లి పోరాటంలో విజయం సాధించిన పావని చైతన్యానికి అభినందనలు దక్కుతున్నాయి. కేసులో సగంవంతు ఆధారాలను తనే సేకరించి పావని సీబీసీఐడీ అధికారులకు అందించింది. దీంతో సీఐడీ దర్యాప్తు కూడా సులభతర మయ్యిందని చెపుతున్నారు. సీఐడీ లేకపోతే తమకు న్యాయం జరిగేది కాదని పావని పేర్కొంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. తన అక్క మృతికి న్యాయం చేయాలని ఎందరినో కోరామని, ఎవరూ దగ్గరకు రానీయలేదన్నారు. బుజ్జి డబ్బులు ఇస్తానని రాయబారాలు కూడా నడిపాడని చెప్పింది. ఓ దశలో నిజంగా తను, అమ్మ ఆత్యహత్య చేసుకోవాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అక్కకు జరిగిన ఘోరానికి న్యాయం జరగాలని కష్టాలు, అవమానాలు దిగమింగి ముందుకెళ్లానని చెప్పింది. తన పోరాటానికి ’సాక్షి‘ అండగా నిలిచిందని కృతజ్ఞతలు చెప్పింది. రాజమండ్రి సీఐడీ సీఐ శేఖర్‌బాబు మేలు మరువలేమన్నారు. -
బయటపడ్డ టీడీపీ నేత కర్కశత్వం..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్ కేసు 17 నెలల తరువాత కొత్తమలుపు తిరిగింది. టీడీపీనాయకుల కర్కశత్వాన్ని బట్టబయలు చేస్తూ శ్రీగౌతమిని పక్కా పథకం ప్రకారం హత్యచేసినట్టుగా తేలినట్టు తెలిసింది. అప్పట్లో ఘోరం జరిగిన 15 రోజులకే తూతూమంత్రంగా దర్యాప్తు పూర్తిచేసి ఇది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని తేల్చేసి, హడావిడిగా ఫైల్ మూసేసిన పోలీసులు మళ్లీ కేసును సీబీసీఐడీ రంగప్రవేశంతో పునః విచారణ చేసి హత్యకేసుగా నమోదు చేసినట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం: శ్రీ గౌతమి కేసులో టీడీపీ ముఖ్యనేత సజ్జా బుజ్జితో పాటు మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. అప్పట్లో శ్రీగౌతమిది హత్యేనంటూ ఆమె సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి ఎందరో నేతలకు తమ గోడు చెప్పుకున్నారు. పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి టీడీపీ నేత కావడం, పైగా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ శ్రీగౌతమి కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి దర్యాప్తు అధికారులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసును నీరు కార్చేశారని సమాచారం. వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. జరిగిన ఘోరం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని మాత్రం ధైర్యంగా అక్కకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధపడింది. కేసును నిస్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా సీబీసీఐడీని ఆశ్రయించింది. సీఐడీ జోక్యం చేసుకుని కేసు విచారణ ప్రాథమికంగా చేయడం, కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇది హత్యేనని నిరూపణ అయ్యింది. తరువాత మళ్లీ పోలీసులు కేసును తిరిగి విచారణకు చేపట్టడం జరిగాయి. అసలేం జరిగింది 2017 జనవరి 18వ తేదీ రాత్రి 8.30 దాటిన తరువాత పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధిలో నరసాపురం–పాలకొల్లు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రి పనిపై పాలకొల్లు వెళ్ళిన అక్కాచెల్లెళ్ళుశ్రీగౌతమి, పావనిలు యాక్టివాపై నరసాపురం వస్తుండగా, వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్క శ్రీగౌతమి అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందింది. చెల్లి పావని మాత్రం రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చింది. అప్పటి వరకూ మద్యం మత్తులో ఆకతాయిలు వెంబడించి కారుతో ఢీకొట్టారని అనుకున్నారు అంతా. అయితే తెలివిలోకి వచ్చిన పావని అసలు విషయం బయటపెట్టింది. టీడీపీ నేత సజ్జా బుజ్జి తమపై హత్యా ప్రయత్నం చేశాడని చెప్పింది. తన అక్కను బుజ్జి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అప్పటి వరకూ తన తల్లికి కూడా తెలియని విషయాన్ని బయటపెట్టింది. పెళ్లి ఫొటోలను కూడా విడుదల చేసింది. బుజ్జిని అరెస్ట్ చేయాలంటూ తీవ్ర గాయాలతోనే పోరాటం చేసింది. ఆమెకు మద్దతుగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిలిచాయి. కానీ అది యాక్సిడెంట్ అని అతి తక్కువ రోజుల్లో పోలీసులు ఫైల్ క్లోజ్ చేశారు. కేసు నీరుగార్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ అప్పట్లో సాక్షిలో ప్రచరితమైన వరుస కథనాలు కాక పుట్టించాయి. ఇదంతా కుట్రంటూ టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. చివరకు చేసిన ఘోరం బట్టబయలైనట్టుగా తెలుస్తోంది. అనుమానాలు రేకెత్తించిన దర్యాప్తు పోలీసులు కేసు దర్యాప్తు సాగించిన తీరు మొదటి నుంచీ అనుమానాలు రేకెత్తించింది. అప్పట్లో ఏఎస్పీగా ఉన్న రత్న విచారణ చేశారు. సంచలనమైన ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సజ్జా బుజ్జిని అతని భార్యను పట్టణంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి నామమాత్రంగా విచారణ చేయడం, వెంటనే వారి ప్రమేయంలేదని పోలీసులు తేల్చి చెప్పడంతో సామాజికవర్గాన్ని నేపధ్యంగా ఎంచుకుని బుజ్జికి సీఎం సన్నిహితులు సహాయ పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బడా వ్యక్తులు వ్యవహారం నడిపారనే వార్తలు వచ్చాయి. స్వయంగా లోకేష్‌బాబు కలగజేసుకున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. అనుమానాలకు తావిస్తూ, కేవలం 15 రోజుల్లోనే యాక్సిడెంట్ కేసుగా చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చూపించారు. సందీప్ కొత్తకారు కొనుక్కుని కోడి పందాల కోసం భీమవరం వచ్చాడని తిరిగి వెళ్లేప్పుడు, స్కూటీపై వెళుతున్న గౌతమి, పావనిల వెంటపడి మద్యం మత్తులో ప్రమాదం చేశారని తేల్చారు. దీనిలో ఎలాంటి పొంతనలు లేనప్పటికీ కేసును తొందరగా ముగించారు. ఇక తరువాత పోలీసులు పావని ఆవేదనను పట్టించుకోలేదు. పోనీ పెళ్లయిన వ్యక్తి మా అక్కను రెండో పెళ్లి మోసం చేసి చేసుకున్నాడని పావని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. సీఐడీ రంగప్రవేశంతో సీన్ రివర్స్ అయితే పావని తన అక్కకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగించింది. డీఐజీ, డీజీపీలతో పాటు సీఐడీకి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కొన్ని నెలలుగా రాజమండ్రి సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ దర్యాప్తులో శ్రీగౌతమిది హత్యేనని తేలింది. ఇందులో అమెను రెండోపెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జి ప్రమయం ఉన్నట్టుగా తేలినట్టు తెలిసింది. యాక్సిడెంట్ చేసిన వారి ఖాతాలలో రెండుసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. ఏ ఖాతా నుంచి డబ్బులు పడ్డాయన్న వివరాల తీగ లాగితే డొంకంతా కదిలింది. అంతే కాకుండా నరసాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాపం హస్తం కూడా ఉన్నట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించినట్టు సమాచారం. దీంతో ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో బట్టబయలు చేసే సమయంలో తిరిగి పోలీసులు విచారణకు తీసుకున్నట్టుగా తెలిసింది. బుజ్జితో పాటుగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెపుతున్నారు. అయితే జడ్జీటీసీని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసును పూర్తిగా సీఐడీ దర్యాప్తు చేస్తే గతంలో విచారణలో చేసిన తప్పులు బయటకు వస్తాయని తిరిగి పోలీసులే విచారణకు తీసుకుని ముందుకెళుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారైనా శ్రీగౌతమి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మా అక్కను చంపిన వారికి శిక్ష పడాలి తను మోసపోయింది. ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని బుజ్జి చెప్పాడు. రహస్యంగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ముందు భార్యకువిడాకులు ఇచ్చేస్తానని, అది అసలు పెళ్ళికాదని చెప్పేవాడు. ఇబ్బంది వచ్చిందని చంపేశాడు. మా కుటుంబానికి అప్పుడు న్యాయం జరగలేదు. కేసును మళ్లీ విచారించే వరకూ న్యాయ పోరాటం చేశాను. మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి. – పావని విచారణలో ఉంది కేసు విచారణలో ఉంది. కొన్ని ఆధారాలతో కేసును మళ్లీ విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలను రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తాం. కేసు విచారణలో ఉండగా ఇంతకు మించి వివరాలు చెప్పలేం. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది. – కె.రజనీకుమార్, పాలకొల్లు రూరల్ సీఐ 2017 జనవరిలో ‘సాక్షి’ ప్రచురించిన కథనం మోసగించి రహస్యంగా వివాహం నరసాపురం కోవెలగుడి వీధిలో గత 26 సంవత్సరాలుగా శ్రీగౌతమి కుటుంబం నివాసం ఉంటోంది. దంగేటి నర్శింహారావు, అనంతలక్ష్మిలకు శ్రీగౌతమి, పావని ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే నర్శింహారావు నడివయసులో మూడేళ్ల క్రితం చనిపోయారు. దీంతో కుటుంబంలో అక్కా, చెల్లి, తల్లి మిగిలారు. శ్రీగౌతమి చదువుల్లో ఫస్ట్. వైఎన్ కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే, మరోపక్క చదువు కొనసాగించేది. బుజ్జి రొయ్యలమేత షాపులో శ్రీగౌతమి తండ్రి పనిచేసేవాడు. తండ్రి వద్దకు వెళ్లే క్రమంలో బుజ్జితో శ్రీగౌతమికి పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయ్యి, పిల్లలున్న బుజ్జి తన అక్కను మోసం చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని పావని ఆరోపిస్తూ వస్తోంది. సివిల్స్‌కు సమాయత్తమవ్వడం కోసం వైజాగ్‌లో ఉంటూ సంక్రాంతి పండుగ నిమిత్తం ఇంటికి వచ్చినపుడు శ్రీగౌతమి ప్రమాదంలో చనిపోయింది. -
నువ్వెంత.. నువ్వెంత?
- నరసాపురం టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు - పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో వర్గవిభేదాలు బాహాబాహీ వరకు వెళ్లాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు వర్గీయులు, ఇటీవల పార్టీలో చేరిన మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గీయులు దూషించుకుంటూ కలబడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన వారికి, పార్టీలో ఉన్నవారికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలోను, ప్రకాశం జిల్లా అద్దంకిలోను వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు, ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతలకు సయోధ్య కుదరని విషయం, అద్దంకిలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగటం తెలిసిందే. ఈ కోవలోనే నరసాపురంలో ఆదివారం ఇరువర్గాలు కలబడ్డాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు, వైఎస్సార్సీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు తమ వర్గాలను వెనకేసుకొస్తూ ప్రత్యర్థి వర్గాలను హెచ్చరించడటంతో కార్యకర్తలు మరీ రెచ్చిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్నారు. నరసాపురంలో జరిగిన టీడీపీ నియోజ కవర్గ విస్తృతస్థాయి సమావేశం దీనికి వేదికైంది. ఈ సమావేశానికి నేతలిద్దరూ తమ వర్గాలతో హాజరయ్యారు. కొత్తపల్లి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ కార్యకర్తలు, కొత్తపల్లి వర్గీయులు గొడవకు దిగారు. తోసుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎం.ఎ.షరీఫ్ మైక్‌లో ఎంత బతిమాలినా.. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు వినలేదు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కల్పించుకుని కొత్తపల్లి వర్గీయులపై ఫైర్ అయ్యారు. తన వర్గాన్ని వెనకేసుకొస్తూ.. గొడవ చేసేవారు సమావేశం నుంచి వెళ్లిపోవాలని కొత్తపల్లి ఎదుటే వార్నింగ్ ఇచ్చారు. కొత్తపల్లి కూడా ‘మా వాళ్లు ఏమీ గొడవ చేయడంలేదు, మీ వాళ్లనే కంట్రోల్ చేయాలి’ అని స్పందించారు. దీంతో రెండు వర్గాలు రెచ్చిపోయాయి. నాయకులు, కార్యకర్తలు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. అతిథులుగా వచ్చిన నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి అతికష్టం మీద ప్రైవేట్ సెక్యూరిటీ సాయంతో వేదిక దిగి వెళ్లిపోయారు. ఒకదశలో సమావేశాన్ని రద్దు చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించినా.. కార్యకర్తలు వెనుదిరగలేదు. చివరకు పోలీసులను రప్పించి, పరిస్థితిని అదుపుచేశారు. తూతూమంత్రంగా సమావేశం ముగించారు. -
నరసాపురంలో తమ్ముళ్ల కుమ్ములాటలు..
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తమ్ముళ్ల కొట్లాటలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్న తిరుపతి, నిన్న ప్రకాశం, నేడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో తమ్ముళ్లు కుమ్ములాటలకు దిగారు. రాష్ట్రంలో నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తలపట్టుకుంటున్నారు. నరసాపురం టీడీపీ నియోజకవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవనాయుడు, స్థానిక టీడీపీ నేతలతో పాటు టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్తపల్లి చేరికపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవనాయుడు, కొత్తపల్లి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం ఇరువర్గాలు బాహాబాహీగా దిగి కొట్టుకున్నారు. దీంతో జిల్లా నేతలు విస్తుపోయారు. తీవ్ర ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే మాధవనాయుడు సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తన సమక్షంలోనే గొడవ జరగడంపై జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొత్తపల్లి తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. కొత్తపల్లి వ్యవహారశైలిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయునున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవనాయుడు బుజ్జగించే పనిలో ఉన్నారు. -
ఐఏఎస్ ఎవరైనా కావొచ్చు
లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చంటున్నారు సివిల్స్ 101వ ర్యాంకర్ వాసన విద్యాసాగర్‌నాయుడు. తన మాతృభూమి నరసాపురం పట్టణానికి బుధవారం ఆయన విచ్చేశారు. ఐఏఎస్ కావాలన్న అమ్మ కోరికను 24 ఏళ్ల వయసులో నెరవేర్చానన్నారు. తన విద్యాభ్యాసం, సివిల్స్ ప్రిపరేషన్ విశేషాలను ఇలా పంచుకున్నారు. ప్రశ్న :మీ కుటుంబ నేపథ్యం జవాబు : నాన్న త్యాగరాజు హైదరాబాద్‌లో రైల్వే సీనియర్ వర్క్స్టడీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. నాన్న వాళ్లది భీమవరం, అమ్మ సొంతూరు నరసాపురం. దీంతో నాకు నరసాపురంతో అనుబంధం ఎక్కువ. ప్రశ్న : ఐఏఎస్ అయ్యేందుకు ప్రేరణ జవాబు :మా అమ్మ, తాత గారు పోతుల నర్సింహరావు (అమ్మనాన్న). తాతగారు కష్టపడి పైకొచ్చారు. చిన్నస్థాయి వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కష్టపడి చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ప్రేరణ కలిగించేది. దీంతో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా చేసుకున్నా. ప్రశ్న : మీ విద్యార్హతలు జవాబు : నరసాపురం క్రిస్టియన్ ఆసుపత్రి (మిసమ్మ ఆసుపత్రి)లో 1992 మార్చి 25న జన్మిం చాను. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ లోని డోర్నకల్‌లో చదివా. 8వ తరగతి నుంచి బీటెక్ వరకు హైదరాబాద్‌లో చదివా. 2013లో బీటెక్ పూర్తయింది. ప్రశ్న : సివిల్స్‌కు ఎలా సిద్ధమయ్యారు జవాబు: సొంతంగానే. ఉన్నత స్థాయిలో శిక్షణ ఏమీ తీసుకోలేదు. హైదరాబాద్‌లో మూడు నెలలు, ఢిల్లీలో ఓ నెలపాటు సాధారణ శిక్షణ తీసుకున్నా. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. సబ్జెక్ట్‌ల పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాను. ప్రశ్న : ఉన్నత స్థాయి శిక్షణ లేకుండానే ఐఏఎస్ సాధించవచ్చా జవాబు : తప్పకుండా సాధించవచ్చు. ఇందుకు నాతో పాటు చాలా మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. మా బ్యాచ్‌లో రిక్షావాలా కుమారుడు ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే మనుమడూ ఎంపికయ్యారు. సివిల్స్ సాధించడం కష్టం, ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 2014లో తొలిసారి సివిల్స్ రాసా 2015లో రెండో ప్రయత్నంలో 101వ ర్యాంక్ వచ్చింది. నా ఆప్షన్ సబ్జెక్ట్ హిస్టరీ. ప్రశ్న : మీరు సైన్స్ విద్యార్థి కదా మరి చరిత్ర ఎలా జవాబు : అదే తప్పు. ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు చదవాలనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టుల్లో డిగ్రీ చదివించాలి. ఐఏఎస్‌కు కావాల్సింది ఏదైనా డిగ్రీ మాత్రమే. అది సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఏదైనా కావొచ్చు. ప్రశ్న : మీరు ఐఏఎస్ కాకుంటే.. జవాబు : 2013లో బీటెక్ పూర్తయ్యింది. ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశా. ఒకవేళ ఐఏఎస్ కాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఆప్షన్‌గా పెట్టుకున్నాను. ప్రశ్న : యువతకు మీరిచ్చే సందేశం జవాబు : 2035 నాటికి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఇది మన దేశానికి ఉన్న బలం. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. ఏదో సాధించాలనే తపన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. యువత పుస్తకాలు ఎక్కువ చదవాలి. నా చిన్నప్పుడు నాన్నగారు గిఫ్టులుగా బొమ్మలు కాకుండా పుస్తకాలు ఇచ్చేవారు. బహుశా ఇదే నన్ను ఐఏఎస్‌ను చేసిందేమో. ప్రశ్న : పోస్టింగ్ విషయంలో మీ ఆప్షన్ జవాబు : ముందు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ. మొత్తానికి తెలుగు రాష్ట్రాలే. -
పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి
-
పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి
నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు. బైక్‌పై వచ్చిన సైకో స్థానిక జగన్నాథస్వామి ఆలయం సమీపంలోని మున్సిపల్ స్కూల్ లోపలికి వెళ్తున్న పల్లా కరుణ అనే విద్యార్థిని చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. దాంతో అక్కడే ఉన్న స్థానికులు సైకోను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే బాలికును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక స్వల్పంగా గాయపడ్డిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సైకో కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. -
కోటికి చేరువలో..
సాక్షి, కొవ్వూరు : జిల్లాలోని 97 ఘాట్లలో గడచిన తొమ్మిది రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 91లక్షల 87 వేల 752కు చేరింది. కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, పెనుగొండ మండలాల్లో గల ఘాట్లలో 60,63,775 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లోని ఘాట్లలో 27,49,327 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,74,750 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. బుధవారం సాయంత్రం 8 గంటల వరకు జిల్లాలో 10,26,170 మంది పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లావ్యాప్తంగా బుధవారం వేకువజామునుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జిల్లాలో సగటున 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిపి లేకుండా వాన కురిసినా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
నరసాపురంలో బాపు స్మృతి చిహ్నం
బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) పేరు చెప్పగానే తెలుగు అక్షరం పులకిస్తుంది.. తెలుగు బొమ్మ తల ఎగరేస్తుంది.. తెలుగు గీత సంతోషంతో ఉప్పొంగుతుంది.. గోదారమ్మ అలలు, అలలుగా ఎగసి పడుతుంది.. చిత్రకారుడిగా, రసరమ్య దృశ్య కావ్యాలను వెండి తెరపై తనదైన శైలిని ఆవిష్కరించిన దర్శకుడిగా, హాస్యర్షిగా ప్రపంచ గుర్తింపు పొందిన బాపు జ్ఞాపకం ఆయన పురిటిగడ్డ నరసాపురంలో ఇక పదిలమనే చెప్పవచ్చు. బాపు స్మృతి చిహ్నం ప్రపంచంలోనే మొదటిగా నరసాపురంలో గోదావరి చెంతన రూపుదిద్దుకుంది. తెలుగువాళ్ల గీతను మార్చిన నిశబ్ద గీతాకారుడి కీర్తిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన జయంతి సందర్భంగా సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మహత్తర ఘట్టం కోసం ‘పశ్చిమ’ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నరసాపురంలో ప్రాథమిక విద్య బాపు 1933 డిశంబర్ 15న నరసాపురంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో వెంకట వేణుగోపాలరావు, సూరమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో కొద్దికాలం ఆయన ఇక్కడే పెరిగారు. తండ్రి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1939-40లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బాపును మద్రాసు నుంచి నరసాపురం తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండేళ్లపాటు నరసాపురంలో టేలర్ హైస్కూల్లో బాపు ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం బాపు కుటుంబం మద్రాసు చేరుకుంది. అక్కడ న్యాయశాస్త్రం (లా) చదివిన బాపు కొద్దికాలం తండ్రితోపాటు న్యాయవాద వృత్తిని కొనసాగించారు. గోదావరి అంటే ప్రాణం గోదారమ్మ ఒడిలో పెరగడం వల్ల ఆయనకు గోదావరి యాస, భాష, హోయలు అంటే ఎంతో ఇష్టం. ఆయన చాలా చిత్రాలను గోదావరి కథాంశం, బ్రాక్డ్రాప్తోనే తెరకెక్కించారు.39 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 30 వరకు గోదావరి ప్రధానంశంగా సాగినవి కావడం విశేషం. గోదావరి అందాలను జగద్విదితం చేయడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా సోయగాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రచారం ఇష్టముండదు బాపు పలుమార్లు జిల్లాకు, నరసాపురానికి వచ్చారు. ప్రచారంపై ఆసక్తి చూపని ఆయన ఎవర్నీ కలిసేవారు కాదని, సభలు, సమావేశాలు, సత్కారాలకు ఆహ్వానించినా ఆసక్తి చూపేవారు కాదని బాపు మేనల్లుడు, న్యాయవాది నిడమోలు రామచంద్రరావు అన్నారు. కొద్ది మంది మిత్రుల బాగోగులను ఆరా తీసేవారని చెప్పారు. ఇష్టమైన వృత్తిని, ప్రవృత్తిని ఎంచుకుని ముందుకు వెళ్లాలని బాపు సూచించేవారని అన్నారు. బాపు సినిమాల్లో కథానాయకులే ప్రధాన భూమికలు. మహిళా పక్షపాతిగా ముద్రపడిన బాపు విగ్రహాన్ని ఓ మహిళ తీర్చిదిద్దడం విశేషం. తాడేపల్లిగూడేనికి చెందిన ప్రముఖ శిల్పి దేవికారాణి వడయార్ బాపు కాంస్య విగ్రహాన్ని త యారుచేశారు. ఐదో పద్ముడు నరసాపురానికి చెందిన ప్రముఖుల్లో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల్లో బాపు అయిదవవారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు (ఏఎస్ రావు) పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. మహిళా పునర్వివాహాలకోసం పాటుపడిన అద్దేపల్లి సర్విశెట్టి, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్ ఎంఎన్ రావు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం పొందగా గతేడాది బాపును పద్మశ్రీ అవార్డు వరించింది. అధికారికంగా వేడుకలు నరసాపురం లలితాంబ ఘాట్ వద్ద బాపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. కెనడాలో ఉంటున్న బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నకుమారుడు ప్రత్యేక ఆహ్వానితులు కాగా.. ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సినీ రంగ ప్రముఖులు రానున్నట్టు తెలిసింది. బాపు విగ్రహ ఏర్పాటుకు తానా విశేషంగా కృషిచేసింది. తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, ప్రతినిధులు కోమటి జయరామ్, వేమన సతీష్ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. మరో రూ.5 లక్షలను ఎంపీ తోట సీతారామలక్ష్మి నిధుల నుంచి మంజూరు చేశారు. బాపు జయంతి వేడుక, విగ్రహావిష్కరణ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇది అద్భుతం నరసాపురంలో బాపు విగ్రహం నెలకొల్పడం అద్భుతమైన విషయం. బాపు ప్రపంచస్థాయి మనిషి. ఆయన పుట్టినచోట, ఆయన నిత్యం ప్రేమించిన గోదావరి తీరంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో బాపు, ఆయన లిపి, బొమ్మలు పదిలంగా ఉంటాయి. ఏటా బాపు జయంతి వేడుకలను నిర్వహించాలి. - రెడ్డప్ప ధవేజీ ఆయన ప్రత్యేకత ఎవరికీ రాదు ప్రపంచంలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. వారిలో బాపు ప్రత్యేకమైన వారు. తనపేరుపై ప్రత్యేక లిపిని సృష్టించిన గొప్ప మనిషి ఆయన. ఎందరో చిత్రకారులకు బాపు ఆదర్శనీయులు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయం. బాపు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం అభినందనీయం. - విజయ్‌కుమార్, ప్రపంచ తెలుగు చిత్రకారుల సంఘం ఉపాధ్యక్షుడు చిత్రసీమ పులకిస్తోంది బాపు పేరు చెప్పగానే తెలుగు చిత్రసీమ పులకిస్తోంది. ఆయన స్క్రిప్టు ఆయన బొమ్మలాగే ఉంటుందని చెబుతుంటారు. యువ దర్శకులు, మాలాంటి యువ కళాకారులకు ఆయన జీవితం ఓ పాఠ్య గ్రంథం. నరసాపురంలో గోదావరి తీరంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం విశేషం. అదీ మొదటిసారిగా బాపు విగ్రహం ఇక్కడ పెట్టడం మరీ విశేషం. - చేగొండి అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత గర్వం లేని మనిషి బాపు చాలాసార్లు ఇక్కడకు వచ్చారు. ఆయనలో ఎప్పుడూ గర్వాన్ని, దర్పాన్ని చూడలేదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు. ఇక్కడే టేలర్ హైస్కూల్లో కొంతకాలం చదువుకున్నారు. బాపు బాల్య స్నేహితుల్లో చాలా మంది మరణించారు. కొద్దిమంది ఇప్పటికీ ఉన్నారు. నరసాపురంలో ఆయన విగ్రహం పెట్టడం అభినందనీయం. - నిడమోలు రామచంద్రరావు, బాపు మేనల్లుడు -
‘పశ్చిమ’కు తప్పిన తుపాను గండం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాకు హుదూద్ పెనుతుపాను గండం తప్పింది. అయితే తుపాను తీరం దాటిన అనంతరం అల్పపీడనంగా మారటంతో జిల్లాకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. తుపాను తీరం దాటే సమయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్తగా మొగల్తూరు, నరసాపురం మండలాల్లో తీర గ్రామాల నుంచి 8,179 మందిని 23 పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్పపీడనం కొనసాగుతుండటంతో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ ఆదివారం తీర గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రైల్వే 'డబ్లింగ్'...
మచిలీపట్నం : రాష్ట్ర విభజన జరిగిన అనంతరమయినా మన ప్రాంతంలోని రైలు మార్గాలు అభివృద్ధి చెందుతాయనుకుంటున్న ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పాలకులు పెద్దగా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం. మచిలీపట్నం - విజయవాడ మధ్య 80 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ చేస్తామని ఎన్నాళ్లుగానో పాలకులు చెబుతూ వస్తుండగా.. ఎట్టకేలకు మూడు సంవత్సరాల క్రితం సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో ఈ పనులను చేస్తామని గతంలో ప్రకటించారు. 2012 ఫిబ్రవరిలో రైల్వే డబ్లింగ్ పనులకు సంబంధించి సర్వే నిర్వహించారు. కోస్తా ప్రాంతం వెంబడి ఉన్న మచిలీపట్నం, నర్సాపురం, గుడివాడ, విజయవాడ, భీమవరం వరకు 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను డబ్లింగ్ చేసేందుకు రూ.1020 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అయితే భీమవరం - గుడివాడ, విజయవాడ - గుడివాడ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు 2012 సెప్టెంబరు 7వ తేదీన టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోస్తా తీరం వెంబడి రైలు మార్గాల అభివృద్ధికి నిధులే మంజూరు చేయలేదు.దీంతో ఈప్రాంత ప్రజలకు ఈ పనులపై తీవ్ర అయోమయం నెలకొంది. నిధుల కేటాయింపు జరిగేనా? కోస్తా తీరం వెంబడి ఉన్న రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం - గుడివాడ - విజయవాడ మధ్య డబ్లింగ్ పనులు జరిగే అవకాశం లేదని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను ఈ పనులకు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం మరో 50శాతం నిధులను కేటాయిస్తుందని అప్పుడే డబ్లింగ్ పనులను చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుడివాడ - మచిలీపట్నం మధ్య రైల్వేలైను అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన పాలకులు ఎంతమేర స్పందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో కోస్తా ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా వెలుగొందిన మచిలీపట్నం రైల్వేస్టేషన్ స్వదేశీ పాలనలో చిన్నపాటి స్టేషను స్థాయిలో సేవలందిస్తోంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో మార్మగోవా నుంచి మచిలీపట్నం వరకు రైల్వేలైను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా సరుకులను ఇక్కడికి తరలించి బందరు పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సరుకులను దిగుమతి చేసుకుని రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. బ్రిటీష్ పాలకులు 100 సంవత్సరాలకు పూర్వం ఈ రైల్వే ట్రాక్ నిర్మించారు. బ్రిటీష్ పాలకులు నిర్మించిన రైల్వే ట్రాక్ మినహా ఈ ప్రాంతంలో రైల్వేశాఖ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం గమనార్హం. అధికారంలోకి రావడానికి రైల్వేలైను డబ్లింగ్ పనులు చేపడతామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు చెబుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని మరచిపోవడం రివాజుగా మారింది. డబ్లింగ్ ప్రతిపాదనలు ఇలా.. విజయవాడ- గుడివాడ మధ్య 43 కిలోమీటర్లు, గుడివాడ - మచిలీపట్నం మధ్య 37 కిలోమీటర్లు , గుడివాడ - భీమవరం మధ్య 66 కిలోమీటర్లు, భీమవరం - నర్సాపూర్ మధ్య 30 కిలోమీటర్లు, భీమవరం - నిడదవోలు మధ్య 46 కిలోమీటర్లుకు రైల్వే లైన్ డంబ్లింగ్, విద్యుధీకరణ, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. 221కిలోమీటర్లకు ఈ పనులను చేసేందుకు రూ. 1020 కోట్లు అవసరమని 2012వ సంవత్సరంలో అంచనా రూపొందించారు. 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డంబ్లింగ్లో భాగంగా 747 చోట్ల మైనర్ వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుందని నిర్ణయించారు. 18 మీటర్లు లేదా 60 అడుగులకు పైబడిన డ్రెయిన్లు, కాలువలు 27 ఉన్నాయని ఈ ప్రాంతాల్లో మేజర్ వంతెనలను నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. మార్కెట్లో మెటీరియల్ ధరలను దృష్టిలో ఉంచుకుని మూడు సంవత్సరాల క్రితం ఒక కిలోమీటరు రైల్వేలైను, సిగ్నల్ వ్యవస్థ, విద్యుదీకరణ పనులకు రూ.4.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ధరలు పెరగడంతో ఈ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా మచిలీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు ఒక్క నూతన రైలు సర్వీసునూ మంజూరు చేయలేదు. దీంతో పాటు మచిలీపట్నం - రేపల్లె మధ్య 47 కిలోమీటర్లు మేర నూతన రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేశారు. ఈ సర్వే ప్రతిపాదన ఎక్కడ ఉందో ఎవరికి తెలియని దుస్థితి. మచిలీపట్నం - రేపల్లె మధ్య రైల్వే లైను నిర్మిస్తే కలకత్తా నుంచి చెన్నైకు దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. కోస్తా తీరం వెంబడి లభించే మత్స్యసంపదను కలకత్తా, చెన్నైలకు తక్కువ ఖర్చుతో తరలించేందుకు అవకాశం ఉంది. -
పవన్ కల్యాణ్ సభ వెలవెల
-
పవన్ కల్యాణ్ సభ వెలవెల
నరసాపురం: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌కు సొంత జిల్లాలో ఆదరణ కరువైంది. బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్న పవన్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మిశ్రమ స్పందన కనిపించింది. నరసాపురంలో నిర్వహించన పవన్ సభ జనం లేక వెలవెలబోయింది. ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో నిర్వాహకులు డీలా పడ్డారు. ఇదిలావుండగా, రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీ, టీడీపీ కూటమి తరపున పవన్ ప్రచారం చేయడంపై ఆయన అభిమానుల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజయవాడలో పవన్ అభిమానులు ఆయన దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు. -
గంగరాజు ఆశలు గల్లంతే
కలవని టీడీపీ శ్రేణులు అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత మోడీ బహిరంగ సభపైనే ఆశలు అరుునా కష్టమేనంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు ఆశలు గల్లంతవుతున్నారుు. ఎన్నికల ప్రచారానికి ఆయన తిరగలేక తిరుగుతున్నారు. అడుగడుగునా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన ప్రభావం ఎక్కడా కనిపించడంలేదు. ప్రజలు సైతం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి జనంలో ఏమాత్రం పట్టులేకపోవడంతో గంగరాజు ఆ పార్టీ అభ్యర్థి అనే విషయమే కొన్ని గ్రామాల్లో తెలియని పరిస్థితి నెలకొంది. కలవని తెలుగుదేశం శ్రేణులు పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీని దూరంగా పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు తాముగానే ప్రచారం చేస్తున్నారు తప్ప ఎంపీ అభ్యర్థి ప్రస్తావన తీసుకురావడం లేదు. గంగరాజు కూడా వారికి దూరంగానే ఉంటున్నారు. ఒకవేళ కలిసినా కాసేపు మొక్కుబడిగా ప్రచారం చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ మాత్రం అది కనిపించడం లేదు. బీజేపీ సీటు కేటాయించే సందర్భంలో అవలంభించిన వైఖరే దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ మాట చెల్లుబాటుకాకపోవడంతో ఆ పార్టీ నేతలంతా బీజేపీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి మధ్య కనీస సయోధ్య కూడా కనిపించడం లేదు. దీంతో గంగరాజు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన తన గ్రూపు సంస్థల ఉద్యోగులపైనే పూర్తిగా ఆధారపడ్డారు. ఆశ్రం కాలేజీ, డీఎన్ఆర్ కాలేజీతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గల లైలా గ్రూపు సంస్థల ఉద్యోగులను దిగుమతి చేసుకుని గ్రామాల్లో తిప్పుతున్నారు. వారందరికీ ఈ ప్రాంతం కొత్త కావడం, ఎవరేమిటో తెలియకపోవడంతో అయోమయూనికి గురవుతున్నారు. అట్టడుగు వర్గాల్లో వ్యతిరేకత అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దళిత వర్గం పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తోంది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎస్సీల ఓట్లు అత్యంత కీలకం. వారంతా మతం ముద్ర ఉన్న బీజేపీ అంటే భయపడున్నారు. గణనీయంగా ఉన్న దళిత క్రిస్టియన్లు బీజేపీ అభ్యర్థి గంగరాజు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మైనార్టీలైతే బీజేపీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే తమ పరిస్థితి దుర్భరంగా మారుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నట్టు బీజేపీ భావిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజశేఖరెడ్డి హయాంలో అమలైన పథకాల వల్ల లబ్ధిపొంది అనేక కుటుంబాలు నేటికీ ఆయనను ఆరాధిస్తున్నాయి. ఇవన్నీ గంగరాజుకు ప్రతికూలంగా మారాయి. మోడీ సభపైనే ఆశలు ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల పోరులో బాగా వెనుకబడిన గంగరాజు మే 1వ తేదీన భీమవరంలో జరిగే నరేంద్ర మోడీ సభపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సభ తర్వాత కొంతమార్పు వస్తుందేమోననే ఆశతో ఆయన వర్గం పనిచేస్తోంది. ఆ సభకు ఎలాగోలా జనాన్ని తీసుకొచ్చేందుకు హైరానా పడుతోంది. అయితే మోడీ వచ్చి సభ పెట్టినంత మాత్రాన అద్భుతం ఏమీ జరగదని టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆయన సభ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే తమకున్న ఒకేఒక్క అవకాశం మోడీ బహిరంగ సభేనని గంగరాజు వర్గం భావించి ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ నాయకులు మాత్రం ఈ సభపైనా పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో సభకు జనం వస్తారో రారోననే భయం బీజేపీ నేతలను వేధిస్తోంది. -
కొత్తపల్లి సుబ్బరాయుడికి తీవ్ర అస్వస్ధత
-
రఘురాజుకు డౌటే
తమకే కావాలంటున్న కృష్ణంరాజు, గంగరాజు చంద్రబాబుపైనే రఘురాజు ఆశలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీలో తనకు ఎదురే లేదని చెప్పుకున్న బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు (రఘురాజు)కు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సీటు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఐదు నెలల క్రితమే రాజకీయ అరంగేట్రం చేసి.. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో పావులు కదుపుతున్నట్లు హడావుడి చేసిన ఆయన ఇప్పుడు తన సీటు కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం ఎంపీ సీటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపారుకారీ ఒప్పందం చేసుకున్న రఘురాజు కొద్దినెలల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానాన్ని కూడా మచ్చిక చేసుకుని ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సీటుకు ఢోకా లేదనుకున్న ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. పలువురు నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పించి వారికి సీట్లివ్వాలని సూచిం చారు. దీంతో ఆయా నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు రఘురాజు తీరుపై కారాలు మిరియాలు నూరారు. ఈ తంతు ఇలా నడుస్తుండగానే బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు వ్యవహారం రసకందాయంలో పడినా ఎట్టకేలకు కుదిరింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు నరసాపురం సీటును బీజేపీకి వదిలేశారు. కానీ అక్కడ రఘురాజు అభ్యర్థిత్వానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. రెబల్‌స్టార్ ఒత్తిడి నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామకృష్ణంరాజుతోపాటు సినీ ప్రముఖుడు, మాజీ కేంద్ర మంత్రి యూవీ కృష్ణంరాజు తొలినుంచీ పోటీ పడుతున్నారు. రఘురాజు కంటే ముందే ఆయన బీజేపీలో చేరి తనకున్న విస్తృత పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నరసాపురం సీటును చేజిక్కించుకునేందుకు కృష్ణం రాజు పావులు కదుపుతున్నారు. జిల్లా బీజేపీలోని ఒక వర్గం ఆయనకే సీటివ్వాలని అగ్ర నేతలను కోరుతోంది. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైలా గ్రూపు కంపెనీల అధినేత గోకరాజు గంగరాజు (గంగతాతరాజు) అదే సీటు కోసం ప్రయత్నిస్తుండటంతో రఘురాజు అవకాశాలకు గండిపడ్డాయి. వీహెచ్‌పీ నాయకుడైన ఆయనకు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నారుు. వాటిని ఆధారం చేసుకుని గంగరాజు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఆశలు దీంతో రఘురాజు పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబుపైనే ఆయన పూర్తిగా ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో అయినా చంద్రబాబుతో బీజేపీ పెద్దలకు రికమండ్ చేయించుకుని నరసాపురాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే బీజేపీలోని ఒకవర్గం రఘురాజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన వ్యా పారాలను కాపాడుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అలాం టి వ్యక్తికి ఎలా సీటిస్తారని ఆ వర్గం బీజేపీ జాతీయ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అదీగాక చంద్రబాబు వ్యూహంలో భాగంగానే రఘురాజు బీజేపీలోకి వచ్చారని.. ఈ దృష్ట్యా ఆయనకు సీటు ఇచ్చినా పేరుకు బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. దీంతో నరసాపురం సీటు విషయంలో బీజేపీ అధిష్టానం సతమతం అవుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎంపీ స్థానం కోసం పట్టుబడుతోంది. ఒకవేళ ఆ దిశగా చర్చలు సఫలమై కాకినాడ సీటును బీజేపీకి ఇస్తే కృష్ణంరాజును అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీలో నేతలు ఉన్నారు. అది జరగని పక్షంలో నరసాపురం సీటు ఎవరికివ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీంతో రఘురాజు పరిస్థితి ఇరకాటంలో పడింది. -
'విశ్వసనీయత, నిజాయితీ కలిగినివాడే నిజమైన నాయకుడు'
-
నరసాపురంలో గుర్రపుబండిలో ప్రయాణించిన జగన్
-
నేడు నరసాపురంలో వైఎస్సార్ జనభేరి
ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో వైఎస్సార్ జనభేరి నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్టీమర్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా నరసాపురం వెళతారని తెలిపారు. 15, 16న ఐదు మునిసిపాలిటీల్లో రోడ్ షో ఈనెల 15వ తేదీన పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ముని సిపాలిటీల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 16న కొవ్వూ రు పట్టణంలో ప్రచారం నిర్వహించి.. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళతారు. ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయూలని బాలరాజు, రఘురామ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరసాపురంలో భారీ ఏర్పాట్లు నరసాపురం (రాయపేట) : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరప్రాంతమైన నరసాపురం నుం చి శుక్రవారం ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. స్థానిక స్టీమర్ రోడ్డులో వైఎస్సార్ జనభేరి బహిరంగ సభను భారీఎత్తున నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విసృ్తత ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా వేదికపై నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. దీంతో సభా ఏర్పాట్లను సుబ్బారాయుడు అనుచరులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నరసాపురం ప్రధాన సెంటర్ కనకదుర్గమ్మ గుడి ఆర్చి నాలుగు రోడ్ల కూడలిలో సభా వేదిక ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. సభా వేదిక వద్ద ప్రత్యేక సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. -
లాకప్ గదికి కన్నం పెట్టి నలుగురు దొంగల పరారీ
నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున నలుగురు నిందితులు పరారయ్యారు. వీరు నలుగురు ...పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదికి కన్నం పెట్టి తప్పించుకున్నారు. ఓ కారు దొంగతనం కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. నిందితులు కృష్ణాజిల్లా, హైదరాబాద్ కు చెందినవారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తీరాన్ని కోస్తున్న జలఖడ్గం!
పంతంగి రాంబాబు, సాక్షి: పాత బియ్యపు తిప్ప, పాత చినమైన వాని లంక ఈ గ్రామాలు ఒకప్పుడు ప.గో. జిల్లా నరసాపురం తీరప్రాంతంలో ఉండేవి. కిలోమీటర్ల కొద్దీ ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం ఈ గ్రామాలను పొట్టనపెట్టుకుంది. పాత బియ్యపు తిప్ప ఆనవాళ్లు కూడా ఇప్పుడు మిగల్లేదు. నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో వందల ఎకరాల భూముల్ని, చెట్టు చేమను సముద్రం మింగేసింది. పెదమైనవాని లంకతోపాటు, తూ.గో. జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, పల్లెపేట గ్రామాలు సముద్రపు కోతకు గురవుతూ ప్రమాదం అంచున వేళ్లాడుతున్నాయి. ఈ గ్రామాల జనం కొన్నేళ్లలోనే ఊళ్లు ఖాళీ చేసి వలస పోయి ప్రాణాలు నిలుపుకోవాల్సిందే.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే! ఎన్నేళ్లలో ఎంత తీరప్రాంతం సముద్రం పాలవుతుంది? ఎన్ని గ్రామాలు కనుమరుగవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెదకాలంటే.. అసలు మన దేశం మొత్తంలో కోస్తా తీర ప్రాంతం ఎంత కరిగిపోయిందో, సముద్రం ఎంత ముందుకొచ్చిందో ముందు లెక్క గట్టాలి. ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ, వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు ఉమ్మడిగా ఇటీవల ఈ పనే చేశారు. 20వ శతాబ్దంలో మన రాష్ట్ర తీరప్రాంతంలో 9 చ. కి.మీ.ల భూమి సముద్రం పాలైందని తేల్చారు. ఇంతకు ముందూ.. అక్కడక్కడా కొన్ని అధ్యయనాలు జరిగినా.. సముద్రపు కోత ఎంత విస్తీర్ణంలో భూమిని కబళించిందీ మొట్టమొదటిగా లెక్క తేల్చింది మాత్రం ఈ అధ్యయనమే. శ్రీకాకుళం-కృష్ణా తీరంలో 9 చ.కి.మీ.ల భూమి మాయం శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ విస్తరించి ఉన్న (1,361 కిలోమీటర్ల) తీరప్రాంతాన్ని విశాఖపట్నం ప్రాంతంగా ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక్కడ సముద్రపు నీటి మట్టం ఏడాదికి 1.09 మిల్లీ మీటర్ల చొప్పున (వందేళ్లలో 10.9 సెం.మీ.లు) పెరిగింది. సముద్రం సుమారు 7 మీటర్ల మేరకు తీరప్రాంతంలోకి చొచ్చుకు వచ్చింది. అలల తీవ్రతకు తీరంలో భూమి కరిగి సముద్రంలో కలిసిపోతోంది. వందేళ్లలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా మధ్యలోని సుమారు 9 చ.కి.మీ.ల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు లెక్క తేలింది. ముంబై తీరంలో సముద్రం 4 మీటర్లు ముందుకు వచ్చి, 17 చ. కి.మీ. భూమిని తనలో ఇముడ్చుకుంది. కొచ్చి తీరంలో 8 మీ. చొచ్చుకొచ్చిన సముద్రం 9 చ.కి.మీ. భూమిని మింగేసింది. చెన్నై తీరం కథ మాత్రం భిన్నంగా ఉంది. చెన్నై ప్రాంతంలో వెనక్కి తగ్గిన సాగరం! గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతం పరిస్థితి భిన్నంగా ఉండడం విశేషం. గుంటూరు నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ విస్తరించి ఉన్న (1,278 కిలోమీటర్ల) తీరప్రాంతాన్ని చెన్నై ప్రాంతంగా ఈ అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతంలో సముద్రం 3.7 మీటర్లు వెనక్కి జరిగింది. దీనివల్ల సముద్ర గర్భంలోని సుమారు 5 చ.కి.మీ.ల ఇసుక బయటపడింది. కోస్తాకు పది రెట్లు పెరగనున్న ముప్పు ‘మనుషుల పనుల వల్లనే వాతావరణంలో ప్రతికూల మార్పులొస్తున్నాయి. 2100 నాటికి ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీల సెస్సియస్ వరకూ పెరిగే అవకాశం ఉంది. భూతాపోన్నతి వల్ల సముద్ర నీటిమట్టం గత 40 ఏళ్లలో కన్నా మున్ముందు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది..’అని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) ఇటీవల వెలువరించిన ఐదో నివేదిక స్పష్టం చేస్తోంది. జర్మనీకి చెందిన పాట్స్‌డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకే) ఆధ్వర్యంలో ఐదు దేశాల నిపుణులు సముద్ర నీటి మట్టం పెరుగుదల ఈ శతాబ్దంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గత శతాబ్దంలో కన్నా ఈ శతాబ్దంలో సముద్రపు నీటి మట్టం పెరుగుదల ముప్పు పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తేలింది. గత శతాబ్దంలో 0.2 మీటరు ్లపెరిగిన సముద్ర నీటి మట్టం 2100 నాటికి 2 మీటర్ల ఎత్తు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణంలో పెరిగే ఒక్కో డిగ్రీ ఉష్ణోగ్రతకు 2.3 మీటర్ల చొప్పున సముద్ర నీటిమట్టం పెరుగుతుందని మరో అధ్యయనం చెబుతోంది. అమెరికా శాస్త్రవేత్తల సంఘం అంచనాల ప్రకారం.. 1880 తర్వాత సముద్ర నీటిమట్టం 8 అంగుళాలు పెరిగింది. 2050 నాటికి 6 నుంచి 16 అంగుళాలు, 2100 నాటికి 12 నుంచి 48 అంగుళాల వరకూ పెరగొచ్చు సముద్ర నీటి మట్టం 2 మీటర్లు పెరిగితే..? గత శతాబ్దంలో సుముద్రపు నీటి మట్టం సుమారు 11 సెం.మీ.లు పెరిగితేనే కిలో మీటర్ల కొద్దీ తీరప్రాంతం కనుమరుగైంది. ఇక 2 మీటర్లు పెరిగితే తీరప్రాంతంలో ఎంత బీభత్సం జరుగుతుందోనన్న ఊహే వెన్నులో చలి పుట్టిస్తోంది. భూతాపాన్ని తగ్గించే పనులు చేపట్టడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు లెక్కగట్టడానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంపైన ప్రజలు, పాలకులు మరింత దృష్టి పెట్టడం అవసరమని ఈ అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి. తీరప్రాంత అభివృద్ధి ప్రణాళికల రూపుకల్పనలో సముద్రపు కోతను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన తరుణం ఇది. ఒక గ్రామం వెనుక మరొకటి.. ప.గో.జిల్లా నరసాపురం మండలంలో లంక గ్రామాలు ఒకటి తర్వాత మరొకటి సముద్రం పాలవుతున్నాయి. గత 40 ఏళ్లలో రెండు గ్రామాలు సముద్రం పాలయ్యాయి. ‘పాత బియ్యపు తిప్ప’ గ్రామాన్ని సముద్రం తొలుత పూర్తిగా కబళించింది. సముద్రగర్భంలోకి వెళ్లిపోయిన ఈ గ్రామం ఆనవాళ్లేవీ ఇప్పుడు కనిపించవు. గ్రామస్తులు తరలివెళ్లి మెరక ప్రాంతంలో బియ్యపుతిప్ప పేరుతో గ్రామం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆ తర్వాత ‘పాత చినమైనవాని లంక’ వంతు వచ్చింది. 130 కుటుంబాలతో కళకళలాడిన ఈ గ్రామంలో పాఠశాల, రామాలయం, ఆరోగ్య ఉపకేంద్రం ఉండేవి. ఎర్రబస్సు కూడా వచ్చేది. ఈ గ్రామాన్ని సముద్రం మింగేయడం 1992 తర్వాత వేగవంతమైంది. 20 ఏళ్లనాడు తుపాను షెల్టర్‌ను సముద్ర తీరానికి వెయ్యి మీటర్ల దూరంలో నిర్మించారు. ఇప్పుడు సముద్రం దీని దగ్గరకు వచ్చేసింది. జనం గ్రామాన్ని విడిచిపోయి వేరే చోట ఇళ్లు కట్టుకున్నారు. 2011 వరకూ ఒకటి, రెండు కుటుంబాలు గ్రామంలో ఉండేవి. కొబ్బరి చెట్లు, తుపాను షెల్టరు, మొండిగోడల రామాలయం పాతచిన మైనవాని లంకకు ఆనవాళ్లుగా మిగిలాయి. కొన్నాళ్లుంటే అవీ కనుమరుగవుతాయి. 3 వేలకు పైగా జనాభా కలిగిన పెదమైనవాని లంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. సముద్రం నాలుగేళ్లలో అర కిలో మీటరు ముందుకొచ్చింది. కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం కొన్నేళ్లలో ఖాళీ అయిపోక తప్పదు. నిస్సహాయంగా పొట్టచేతపట్టుకొని మరో చోటకు వెళ్లడం తప్ప వారికి మరో మార్గం కనిపించడం లేదు. - న్యూస్‌లైన్, నరసాపురం రూరల్, ప.గో.జిల్లా -
నరసాపురంలో వైఎస్సార్ సిపి నిత్యావసరాల పంపిణీ
-
మంత్రిగారూ.. ఇంత చాటేలా!
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేక ప్రజాప్రతినిధులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఒకవేళ పనిమీద పట్టణానికి వచ్చినా హడావిడి లేకుండా సెలైంట్‌గా వచ్చి పని ముగించుకుని చల్లగా జారుకుంటున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ శనివారం నరసాపురానికి చాటుగా వచ్చి.. సమైక్యవాదులకు కనిపించకుండా సెలైంట్‌గా వెళ్లిపోయారు. పట్టణంలోని పొన్నపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ వల్లభూని లక్ష్మణరావు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంత్రి పట్టణానికి వచ్చారు. ఎప్పుడూ అంబేద్కర్ సెంటర్ నుంచి పట్టణానికి వచ్చే ఆయన అక్కడ సమైక్యవాదులు అడ్డుకుంటారేమోనని, చుట్టూతిరిగి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా అదే మార్గంలో వెళ్లిపోయారు. బుగ్గకారు సెరైన్ గాని, ఇతర హడావిడి గానీ లేకుండా పితాని జాగ్రత్తపడ్డారు. మంత్రి రాక విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా బయటకు పొక్కనీయలేదు. మంత్రి తీరుపై సమైక్య వాదులు మండిపడుతున్నారు. ప్రజలకు దొరక్కుండా ఇంకెంత కాలం ఇలా తిరగగలరని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.