పవన్ కల్యాణ్ సభ వెలవెల
నరసాపురం: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు సొంత జిల్లాలో ఆదరణ కరువైంది. బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్న పవన్కు పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మిశ్రమ స్పందన కనిపించింది.
నరసాపురంలో నిర్వహించన పవన్ సభ జనం లేక వెలవెలబోయింది. ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో నిర్వాహకులు డీలా పడ్డారు. ఇదిలావుండగా, రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీ, టీడీపీ కూటమి తరపున పవన్ ప్రచారం చేయడంపై ఆయన అభిమానుల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజయవాడలో పవన్ అభిమానులు ఆయన దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు.