పవన్‌కల్యాణ్‌పై తక్షణం చర్యలు తీసుకోండి | Take immediate measures to Pavankalyan | Sakshi
Sakshi News home page

పవన్‌కల్యాణ్‌పై తక్షణం చర్యలు తీసుకోండి

Published Mon, May 5 2014 1:33 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

పవన్‌కల్యాణ్‌పై తక్షణం చర్యలు తీసుకోండి - Sakshi

పవన్‌కల్యాణ్‌పై తక్షణం చర్యలు తీసుకోండి

ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

హైదరాబాద్: ఇతరుల నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం టీడీపీకే వేయాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటర్లకు చెప్పి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. రాజకీయ నాయకుడినని చెప్పుకొంటున్న ఈ సినిమా నటుడు విజయనగరం జిల్లాలోని టెక్కలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయా పార్టీలు ఇచ్చే డబ్బు, ఇతర కానుకలు తీసుకోవాలని కానీ ఓటు మాత్రం టీడీపీకి వేయాలని చెప్పడం తీవ్రమైన నేరమని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఎన్నికల అధికారికి ఆదివారం ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఐపీసీ 107, 171ఇ, 171ఎఫ్ నిబంధనల ప్రకారం అది నేరమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తక్షణమే పవన్ కల్యాణ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement