నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున నలుగురు నిందితులు పరారయ్యారు. వీరు నలుగురు ...పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్లోని లాకప్ గదికి కన్నం పెట్టి తప్పించుకున్నారు. ఓ కారు దొంగతనం కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. నిందితులు కృష్ణాజిల్లా, హైదరాబాద్ కు చెందినవారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.