జిల్లాలోని 97 ఘాట్లలో గడచిన తొమ్మిది రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 91లక్షల 87 వేల 752కు చేరింది
సాక్షి, కొవ్వూరు : జిల్లాలోని 97 ఘాట్లలో గడచిన తొమ్మిది రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 91లక్షల 87 వేల 752కు చేరింది. కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, పెనుగొండ మండలాల్లో గల ఘాట్లలో 60,63,775 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లోని ఘాట్లలో 27,49,327 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,74,750 మంది పుష్కర స్నానాలు ఆచరించారు.
బుధవారం సాయంత్రం 8 గంటల వరకు జిల్లాలో 10,26,170 మంది పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లావ్యాప్తంగా బుధవారం వేకువజామునుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జిల్లాలో సగటున 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిపి లేకుండా వాన కురిసినా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు.