సాక్షి, నరసాపురం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆరోపించారు. బుధవారం నరసాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ల అరిగిపోయాయే తప్ప తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. మాల, మాదిగలం ఏకమై జగనన్నను సీఎం చేసే వరకు నిద్రపోమని అన్నారు. ముదునూరి ప్రసాదరాజు, రఘురామకృష్ణంరాజులను నరసాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తానని టీవీ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment