TV Rama Rao
-
‘30 ఏళ్లు సైకిల్ తొక్కినా ఫలితం లేదు’
సాక్షి, నరసాపురం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆరోపించారు. బుధవారం నరసాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ల అరిగిపోయాయే తప్ప తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. మాల, మాదిగలం ఏకమై జగనన్నను సీఎం చేసే వరకు నిద్రపోమని అన్నారు. ముదునూరి ప్రసాదరాజు, రఘురామకృష్ణంరాజులను నరసాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తానని టీవీ రామారావు తెలిపారు. -
టీడీపీకి ఝలక్ .. టీవీ రామారావు రాజీనామా
-
నేను గెలుస్తా.. నువ్వు గెలుస్తావా
* మురళీమోహన్‌కు టీవీ రామారావు సవాల్ * స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కొవ్వూరు: ‘నేను గెలుస్తాను.. నాకు ఆ నమ్మకం ఉంది.. నీకుందా’ అంటూ కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ను ఉద్దేశించి సవాల్ చేశారు. శనివారం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్, స్థానిక నాయకులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిండికేట్ నాయకుల మాటలు నమ్మి తాను ఒక దళితుడనని కూడా చూడకుండా మురళీమోహన్ తనను అష్టకష్టాలు పెట్టారని ఆరోపించారు. ‘నీ దగ్గర ఒక్క మాట నిలకడ లేదు.. నా వల్ల నువ్వు ఓడిపోతానన్నావు కదా.. ఇపుడు నావల్లే నువ్వు నిజంగానే ఓడిపోతావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఎంతో కష్టపడ్డానని, నా లాంటి కష్టజీవికి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను విస్మరించి నాకు కేటాయించిన సీటును వేరొకరికి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. నా దేవుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతకు ఆంధ్రాలో పనేంటి? ‘గరికిపాటి రామ్మోహనరావు ఎవడు.. అతనొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడా... తెలంగాణ వాడికి ఆంధ్రాలో పనేంటి’ అని ప్రశ్నించారు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నాడని నిలదీశారు. అతనికి నచ్చితే టికెట్ వస్తుందా లేకపోతే రాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకపోయినా స్థానం కోల్పోతామన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు లొంగిపోయి చంద్రబాబు తప్పు చేశారని ఆరోపించారు. ఈ లాబీయింగ్‌లు చేసే వారిని పక్కన పెట్టండి చంద్రబాబుగారు అంటూ ప్రాథేయపడ్డారు. మీరు టికెట్ కేటాయించిన వ్యక్తికి అసలు పార్టీ సభ్యత్వం లేదన్నారు. సర్వేలలో 87 శాతం అనుకూలంగా వచ్చిన తననెందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని రామారావు ప్రశ్నించారు. ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తారా అని ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు. -
అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి
పాలకొల్లు: అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులకు పార్టీ నాయకత్వం మొండిచేయి చూపింది. పశ్చమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేత సిహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ)కి టిక్కెట్ నిరాకరించింది. తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో బాబ్జీ ఇప్పటికే నామినేషన్ వేశారు. మీకే టికెట్ అంటూ చెప్పిన చంద్రబాబు చివరకు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. చివరి నిమిషంలో నిమ్మల రామానాయుడికి సీటు కేటాయించి బాబ్జీకి షాక్ ఇచ్చారు. మంచి హస్తవాసి గల వైద్యునిగా పేరున్న బాబ్జీని స్థానికంగా అబ్బాయ్గారి అబ్బాయి అని పిలుస్తుంటారు. చింతలపూడి స్థానాన్ని ఆశించిన కర్రా రాజారావు, కొయ్యే మోషేన్‌రాజు, జయరాజులకు కూడా చంద్రబాబు రిక్తహస్తం చూపించారు. స్థానికేతురాలైన పీతల సుజాతకు టికెట్ కేటాయించి తనదైన రాజకీయం ప్రదర్శించారు చంద్రబాబు. పీతల సుజాత గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేశారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకూ చంద్రబాబు షాక్ ఇచ్చారు. కొవ్వూరు టిక్కెట్‌ను మోచర్ల జవహార్వతికి కేటాయించారు. -
ఎవరికిస్తారో..!
సాక్షి, ఏలూరు : ప్రధాన పార్టీల ఆశావహుల్లో సీట్ల ఉత్కంఠ నరాలు తెగే స్థారుుకి చేరింది. అభ్యర్థులు ఎవరనేది తేలకపోవడంతో పార్టీ శ్రేణులనూ కలవరపరుస్తోంది. అభ్యర్థిత్వాలను కట్టబెట్టే విషయంలో స్పష్టత కరువవడంతో టీడీపీ, బీజేపీ ఆశావహులు ఆందోళన, గందరగోళానికి గురవుతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో ప్రతిష్టంభన తొలగి స్థానాల ఎంపిక పూర్తయినా.. అభ్యర్థుల ఎంపిక మాత్రం జరగలేదు. దీంతో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను, పరిశీలకుల్ని ప్రకటించింది. ఆయా స్థానాల నుంచి వీరే పోటీ చేసే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశారుు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చినట్లయ్యింది. అయితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మా త్రం అభ్యర్థుల ఎంపిక జరపలేదు. నిన్నమొన్నటి వరకూ వలస వచ్చిన వారందర్నీ సైకిలెక్కించుకున్న టీడీపీ అధిష్టా నం చివరకు ఎవరికి సీట్లు కేటాయిస్తుం దో తమ్ముళ్లు మదనపడుతున్నారు. భీమవరం, ఆచంట, ఉంగులూరు, కొవ్వూ రు, చింతలపూడి, గోపాలపురం, పోలవ రం నియోజకవర్గాలపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. భీమవరం, ఆచం ట, తణుకు టికెట్లను ఆశిస్తున్న వారి పరిస్థితిని తెలుసుకున్నట్లు సమాచారం. భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వాలను మెంటే పార్థసారథి, గాదిరాజు బాబు ఆశిస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఈ మధ్యనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తన సమీప బంధువైన తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా భీమవరం టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వినికిడి. మరోవైపు మెంటే పార్థసారథి, గాదిరాజు బాబు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న ఆచంట సీటు విషయంలోనూ స్పష్టత రాలేదు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరి స్తున్న గుబ్బల తమ్మయ్యను కాదని ఇటీవల పార్టీలో చేరిన తాజామాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటు కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిని తమ్మయ్య అనుయాయులు అంగీకరించడం లేదు. సీటు తమ్మయ్యకేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్టీ అధినేత మాత్రం పితానికే ప్రాధాన్యమిస్తారేమోనన్న అనుమానం తమ్మయ్య వర్గీయుల్ని వెంటాడుతోంది. చింతల పూడి టీడీపీ టికెట్ కోసం కర్రా రాజారావు, ముత్తారెడ్డి, లక్ష్మణరావు పోటీ పడుతున్నారు. ఇటీవల పార్టీ మారి వచ్చిన రాజారావును పక్కనపెట్టి మిగ తా ఇద్దరిలో ఒకరిని వారిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు.గోపాలపురం సీటు కోసం ముప్పిడి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ రెండుమూడు సార్లు రాజధానికి వెళ్లి అధినేతను కలిశారు. కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావుకు సీటు కేటాయించని పక్షంలో ఆ స్థానం నుంచి పీతల సుజాతను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉంగుటూరు, తణుకు, పోలవరం నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపైనా ఇంకా స్పష్టత రాలేదు. సీటు తమకేనంటూ అక్కడున్న పార్టీ ఇన్చార్జిలు, కన్వీనర్లు అరుున గన్ని వీరాంజనేయులు, వైటీ రాజా, ఆరిమిల్లి రాథాకృష్ణ, మొడియం శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసే సమయం దగ్గర పడుతున్నా అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బీజేపీదీ అదే తీరు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని నరసాపురం లోక్‌సభ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థుల విషయంపై ఇప్పటికీ ప్రకటన చేయలేదు. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని కనుమూరి రఘురామకృష్ణంరాజు, రెబల్‌స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియక పార్టీ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్‌కు గడ్డుకాలం జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నరసాపురం లోక్‌సభ స్థానం అభ్యర్థిగా ఎంపీ కనుమూరి బాపిరాజు పేరును మాత్రమే ప్రకటించింది. పాలకొల్లు స్థానాన్ని ఎమ్మెల్యే బంగారు ఉషారాణికే ఇస్తారనుకుంటున్నారు. మిగతాచోట్ల ఎవర్ని పోటీకి దించాలన్న విషయంపై కసరత్తు జరుపుతోంది. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసే నాయకులే లేరని సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు వీరంగం
ఏలూరు: కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు వీరంగం చేశారు. ఆరికరేవుల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి రామారావు తీవ్రంగా ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థిని ఆయన సాయంత్రం 6గంటలకు అధికారుల వద్దకు తీసుకువచ్చారు. అధికారులతో మంత్రాంగానికి దిగారు. ఈ ఘటనను కెమెరాలో బంధించిన సాక్షి ఫొటోగ్రాఫర్ సత్యనారాయణను ఎమ్మెల్యే రామారావు నానా దుర్భాష లాడారు. పత్రికను, ఫొటోగ్రాఫర్‌ను తలబెడతానంటూ హెచ్చరించారు. దాంతో కొవ్వూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.