సాక్షి, ఏలూరు : ప్రధాన పార్టీల ఆశావహుల్లో సీట్ల ఉత్కంఠ నరాలు తెగే స్థారుుకి చేరింది. అభ్యర్థులు ఎవరనేది తేలకపోవడంతో పార్టీ శ్రేణులనూ కలవరపరుస్తోంది. అభ్యర్థిత్వాలను కట్టబెట్టే విషయంలో స్పష్టత కరువవడంతో టీడీపీ, బీజేపీ ఆశావహులు ఆందోళన, గందరగోళానికి గురవుతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో ప్రతిష్టంభన తొలగి స్థానాల ఎంపిక పూర్తయినా.. అభ్యర్థుల ఎంపిక మాత్రం జరగలేదు.
దీంతో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను, పరిశీలకుల్ని ప్రకటించింది. ఆయా స్థానాల నుంచి వీరే పోటీ చేసే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశారుు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చినట్లయ్యింది. అయితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మా త్రం అభ్యర్థుల ఎంపిక జరపలేదు. నిన్నమొన్నటి వరకూ వలస వచ్చిన వారందర్నీ సైకిలెక్కించుకున్న టీడీపీ అధిష్టా నం చివరకు ఎవరికి సీట్లు కేటాయిస్తుం దో తమ్ముళ్లు మదనపడుతున్నారు.
భీమవరం, ఆచంట, ఉంగులూరు, కొవ్వూ రు, చింతలపూడి, గోపాలపురం, పోలవ రం నియోజకవర్గాలపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. భీమవరం, ఆచం ట, తణుకు టికెట్లను ఆశిస్తున్న వారి పరిస్థితిని తెలుసుకున్నట్లు సమాచారం. భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వాలను మెంటే పార్థసారథి, గాదిరాజు బాబు ఆశిస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఈ మధ్యనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
తన సమీప బంధువైన తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా భీమవరం టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వినికిడి. మరోవైపు మెంటే పార్థసారథి, గాదిరాజు బాబు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న ఆచంట సీటు విషయంలోనూ స్పష్టత రాలేదు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరి స్తున్న గుబ్బల తమ్మయ్యను కాదని ఇటీవల పార్టీలో చేరిన తాజామాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటు కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిని తమ్మయ్య అనుయాయులు అంగీకరించడం లేదు.
సీటు తమ్మయ్యకేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్టీ అధినేత మాత్రం పితానికే ప్రాధాన్యమిస్తారేమోనన్న అనుమానం తమ్మయ్య వర్గీయుల్ని వెంటాడుతోంది. చింతల పూడి టీడీపీ టికెట్ కోసం కర్రా రాజారావు, ముత్తారెడ్డి, లక్ష్మణరావు పోటీ పడుతున్నారు. ఇటీవల పార్టీ మారి వచ్చిన రాజారావును పక్కనపెట్టి మిగ తా ఇద్దరిలో ఒకరిని వారిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు.గోపాలపురం సీటు కోసం ముప్పిడి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ రెండుమూడు సార్లు రాజధానికి వెళ్లి అధినేతను కలిశారు.
కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావుకు సీటు కేటాయించని పక్షంలో ఆ స్థానం నుంచి పీతల సుజాతను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉంగుటూరు, తణుకు, పోలవరం నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపైనా ఇంకా స్పష్టత రాలేదు. సీటు తమకేనంటూ అక్కడున్న పార్టీ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు అరుున గన్ని వీరాంజనేయులు, వైటీ రాజా, ఆరిమిల్లి రాథాకృష్ణ, మొడియం శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసే సమయం దగ్గర పడుతున్నా అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
బీజేపీదీ అదే తీరు
టీడీపీతో పొత్తు కుదుర్చుకుని నరసాపురం లోక్‌సభ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థుల విషయంపై ఇప్పటికీ ప్రకటన చేయలేదు. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని కనుమూరి రఘురామకృష్ణంరాజు, రెబల్‌స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియక పార్టీ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
కాంగ్రెస్‌కు గడ్డుకాలం
జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నరసాపురం లోక్‌సభ స్థానం అభ్యర్థిగా ఎంపీ కనుమూరి బాపిరాజు పేరును మాత్రమే ప్రకటించింది. పాలకొల్లు స్థానాన్ని ఎమ్మెల్యే బంగారు ఉషారాణికే ఇస్తారనుకుంటున్నారు. మిగతాచోట్ల ఎవర్ని పోటీకి దించాలన్న విషయంపై కసరత్తు జరుపుతోంది. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసే నాయకులే లేరని సమాచారం.
ఎవరికిస్తారో..!
Published Tue, Apr 8 2014 4:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement