టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు
ఏలూరు: కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు వీరంగం చేశారు. ఆరికరేవుల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి రామారావు తీవ్రంగా ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థిని ఆయన సాయంత్రం 6గంటలకు అధికారుల వద్దకు తీసుకువచ్చారు. అధికారులతో మంత్రాంగానికి దిగారు.
ఈ ఘటనను కెమెరాలో బంధించిన సాక్షి ఫొటోగ్రాఫర్ సత్యనారాయణను ఎమ్మెల్యే రామారావు నానా దుర్భాష లాడారు. పత్రికను, ఫొటోగ్రాఫర్‌ను తలబెడతానంటూ హెచ్చరించారు. దాంతో కొవ్వూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.